logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన వీరశిఖామణి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో గౌడన్నలందరూ ఏకం కావాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్‌లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన గౌడన్నలు.. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నలమాస కృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గౌడన్నలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన ఉత్తేజిత గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు పాల్గొని విజయవంతం చేశారు.

on 14 March
user_Mogulagani Mahendar Mogulagani Mahendar
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
on 14 March

మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన వీరశిఖామణి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో గౌడన్నలందరూ ఏకం కావాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్‌లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన గౌడన్నలు.. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నలమాస కృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గౌడన్నలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన ఉత్తేజిత గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు పాల్గొని విజయవంతం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
    1
    జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు
    2
    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే  ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.
    1
    అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై 
ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని  పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద 
సిద్ధంగా ఉన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం  పోస్టర్ ను  లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను  ఏడు గ్రామాల  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.
    user_Kommera Rajureddy Reporter
    Kommera Rajureddy Reporter
    రియల్ ఎస్టేట్ తిమ్మాపూర్ ఎల్‌ఎండి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    1
    కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • వరంగల్: దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 2011 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ప్రాంతీయ విభేదాలను కాంగ్రెస్ రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు.
    1
    వరంగల్: దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 2011 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
ప్రాంతీయ విభేదాలను కాంగ్రెస్ రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, బ్యాండ్ వాగన్ గా కోనసాగలేనని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్టానం నడుస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను చేయడం ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.పదవులు కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాన్ని....కానీ పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సూచించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూశానని, రేవంత్ నువ్వు ఎమ్ చూసావో నాకు తెలియదన్నారు. కెసిఆర్ నా వయసును గౌరవిస్తాడని, నన్ను అన్న అని పిలుస్తాడని, కెసిఆర్ కు ప్రజలంటే గౌరవం, నీలాగా కాదని అన్నారు. కేసీఆర్ పై విధానపరమైన విమర్శ చేశానే తప్ప వ్యక్తిగతంగా తాను ఏనాడు ఎవ్వరిని విమర్శించలేదన్నారు. పార్టీ సూచన తో ప్రభుత్వం నడువాలి కానీ, తెలంగాణ లో ప్రభుత్వ సూచన తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుద్దని జీవన్ రెడ్డి అన్నారు.
    1
    సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, బ్యాండ్ వాగన్ గా కోనసాగలేనని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్టానం నడుస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను చేయడం ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.పదవులు కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాన్ని....కానీ పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సూచించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూశానని, రేవంత్ నువ్వు ఎమ్ చూసావో నాకు తెలియదన్నారు. కెసిఆర్ నా వయసును గౌరవిస్తాడని, నన్ను అన్న అని పిలుస్తాడని, కెసిఆర్ కు ప్రజలంటే గౌరవం, నీలాగా కాదని అన్నారు. కేసీఆర్ పై విధానపరమైన విమర్శ చేశానే తప్ప వ్యక్తిగతంగా తాను ఏనాడు ఎవ్వరిని విమర్శించలేదన్నారు. పార్టీ సూచన తో ప్రభుత్వం నడువాలి కానీ, తెలంగాణ లో ప్రభుత్వ సూచన తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుద్దని జీవన్ రెడ్డి అన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.