Shuru
Apke Nagar Ki App…
భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కొండగట్టు ఆలయ నూతన ఈవో అంజనా రెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో శ్రీ అంజనా రెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో ఎస్. అంజనా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కొండగట్టులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు.అనంతరం స్వామివారి మండపంలో శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.
Satheesh gangu
భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కొండగట్టు ఆలయ నూతన ఈవో అంజనా రెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో శ్రీ అంజనా రెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో ఎస్. అంజనా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కొండగట్టులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు.అనంతరం స్వామివారి మండపంలో శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జామా మసీదులో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామంలో ముస్లిం సోదరులకు సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి, ఈ పండుగ వేళ మతసామరస్యాన్ని చాటిచెప్పేలా అందరూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు, మనకు ఉన్న దానిలో మరొకరితో పంచుకోవడం అనే సందేశాన్ని రంజాన్ మాసం తెలియజేస్తుంది, నేడు బొప్పాపూర్ గ్రామం "జామా మసీద్"లో గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామాల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.1
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉగాది పండుగ వేళ కరీంనగర్ లోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు ఆలయాలతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కన్నులపండువలా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మంత్రి పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుకున్నట్లు చేప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, గవర్నర్ ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.2
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- మెట్ పల్లి, మార్చి 19: కోరుట్ల నియోజకవర్గం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్న వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..దర్యాప్తులో భాగంగా నిందితుడికి సహకరించి బాధితురాలిని కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కట్న వేధింపులు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు.మెట్ పల్లి డిఎస్పీ రాములు ఆదేశాల మేరకు ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టగా, నిందితులను గురువారం అరెస్ట్ చేసి, సబ్ డివిజన్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెలువడించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ వారిని న్యాయస్థానంలో ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు .ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.2
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,1
- ఉగాది పచ్చడి: షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని దీని అర్థం. తీపి (బెల్లం), పులుపు (చింతపండు), వగరు (మామిడి ముక్కలు), చేదు (వేప పువ్వు), ఉప్పు, కారం. పంచాంగ శ్రవణం: ఈ ఏడాది మనకు ఎలా ఉండబోతుందో పండితుల ద్వారా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి తెలుసుకోవడం.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భీమన్న ఆలయంలో భక్తులు ఉగాది సందర్భంగా దర్శించుకుని మొక్కలను చెల్లించుకున్నారు1