Shuru
Apke Nagar Ki App…
కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- జగిత్యాల జిల్లాలో తనయుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగ, ఇక కొడుకు లేడనే నిజాన్ని తట్టుకోలేక తల్లి గుండె ఆగిపోయింది. గంటల వ్యవధిలో తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో మోతె గ్రామంలో విషాదం అలుముకుంది. మోతె గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ (25) అప్పుల బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. కొడుకు మరణ వార్తతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లవ్వ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు తల్లి–కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.3
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు1
- మెట్ పల్లి, మార్చి 18: పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్‌లను శాలువాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.3
- జన్నారం మండల కేంద్రంలోని అన్ని వార్డులలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటో ద్వారా పోలీసులు ప్రచారం చేయించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని రాంనగర్లో పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సెలవుల నేపద్యంలో ఊర్లోకి వెళ్లే ప్రజలు వారి ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచుకోవద్దని సూచించారు కొత్తవారు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మున్సిపల్ చైర్‌పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. గురువారం జామా మసీద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన కిట్లను పేద ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని చైర్‌పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అన్వర్, అప్సర్, మంజూరు షబ్బీర్, కరిముల్లా, అజార్ తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని "మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి - కుల వృత్తులను ప్రోత్సహించండి" అనే నినాదంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లకు ఉగాది మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.. అందులో ఉగాది పండగ కి ఉపయోగపడే మట్టి కుండా, గ్లాస్ లు , జగ్గు ,బౌల్, షడ్రుచులు ఉండే మామిడి కాయలు , వేప పువ్వు , బెల్లం , చింతపండు ,కారం వస్తువులు ఉగాది కిట్ లో అందజేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు ఉపయోగించాలని , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పండగలతో మట్టి పాత్రలు అనువైనవనని మంత్రి పొన్నం ప్రభాకర్ మట్టి పాత్రలు వినియోగాన్ని పెంచి కుల వృత్తులను కాపాడడానికి అందజేశారని వారు పేర్కొన్నారు. మట్టి పాత్రలు వాడకం తరతరాల సంప్రదాయం.. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయనీ ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు వాడండి ,కుల వృత్తులను కాపాడండి .. ఆరోగ్యాన్ని రక్షించుకోండి అనే నినాదంతో పండగ జరుపుకోవాలని సూచించారు.4