Shuru
Apke Nagar Ki App…
వర్ధన్నపేటలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ సారంగపాణి వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మున్సిపల్ చైర్‌పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. గురువారం జామా మసీద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన కిట్లను పేద ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని చైర్‌పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అన్వర్, అప్సర్, మంజూరు షబ్బీర్, కరిముల్లా, అజార్ తదితరులు పాల్గొన్నారు.
M D Azizuddin
వర్ధన్నపేటలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ సారంగపాణి వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మున్సిపల్ చైర్‌పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. గురువారం జామా మసీద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన కిట్లను పేద ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని చైర్‌పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అన్వర్, అప్సర్, మంజూరు షబ్బీర్, కరిముల్లా, అజార్ తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1
- హనుమకొండ, మార్చి 18: మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హసన్‌పర్తి సంస్కృతి విహార్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆమె ప్రారంభించారు. కాకతీయ మహిళా సమాఖ్య ద్వారా లక్షకు పైగా సభ్యులు రూ.460 కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు పొందడం అభినందనీయమని తెలిపారు. బస్సుల కొనుగోలు, ధాన్యం వ్యాపారం, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. సంఘాల ద్వారా ప్రతి నెల ఆదాయం పెరుగుతోందని, మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అవలంబించి ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు.1
- మహబూబాబాద్ జిల్లా లో రోడ్డు ప్రమాదం. మహిళ మృతి. మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం, ఉప్పరగూడెం వద్ద జాతీయ రహదారి 365/A పై టిప్పర్ ఢీకొట్టడంతో గ్రామానికి చెందిన నాగటి పద్మం ( 50) అనే మహిళను అక్కడికక్కడే మృతి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు సీరోలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన..1
- జగిత్యాల జిల్లాలో తనయుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగ, ఇక కొడుకు లేడనే నిజాన్ని తట్టుకోలేక తల్లి గుండె ఆగిపోయింది. గంటల వ్యవధిలో తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో మోతె గ్రామంలో విషాదం అలుముకుంది. మోతె గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ (25) అప్పుల బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. కొడుకు మరణ వార్తతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లవ్వ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు తల్లి–కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.3
- నకిరేకల్ నియోజకవర్గo: పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ నకిరేకల్ లయన్స్ క్లబ్.. సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ సేవలు ప్రశంసనీయo 4 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ గారు నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియం వెంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రంలో పరీక్షలు వ్రాసి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు 250 మందికి దాత వంటే పాక సోమేశ్ భారతమ్మ పెళ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ మరియు సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని 4వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ సేవలు అన్ని వర్గాల వారికి నిర్విరామంగా అందించడం అభినందనీయమని ప్రశంసించారు నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వలిశెట్టి స్వప్న నకిరేకల్ సెంటీనియల్ క్లబ్ అధ్యక్షులు కందాల ప్రేమ్నాథ్ రెడ్డి డిసి శేఖర్ శెట్టి నకిరేకల్ లయన్స్ క్లబ్. సెంటీనియల్ క్లబ్ కార్యదర్శులు సూర్యచంద్రరావు కందాల వెంకటరెడ్డి ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ ఉప్పల సంతోష్ తదితరులు పాల్గొన్నారు3
- మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. గురువారం మల్లంపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలోని రైతు వేదికలో రామచంద్రపురం గ్రామంలోని 10500 ఎకరాల వ్యవసాయ భూమి రీ సర్వే, హద్దులు గుర్తించుటకు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్రపూర్ భూములను రీ సర్వే నిర్వహించి భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గతంలో అనేక కారణాలవల్ల చాలామంది రైతులకు పట్టా పాస్ బుక్ లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించే విధంగా 10వేల 500 ఎకరాల వ్యవసాయ భూమిని 9 బ్లాక్ లుగా ఏర్పాటు చేసి 9 సర్వే బృందాలను ఏర్పాటు చేసి ఒక రోజు 50 నుంచి 75 మంది పట్టాదారుల భూములను రి సర్వే చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సూచించారు. రీ సర్వే నిర్వహించడానికి గ్రామస్తులు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, రామచంద్రపూర్, దేవ నగర్, భూపాల్ నగర్, గుర్తుర్ తండా, శివతండా సర్పంచులు దొంతి స్వరూప, సంతోష్, రమణారెడ్డి, రాజు నాయక్, భాస్కర్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.3
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- జనగామ జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసిపి చేతన్ తెలిపారు. ప్రధాన నిందితుడు బెలిగిని శివకుమార్ పురోహితుడిగా పని చేస్తూ, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు శ్రీనివాస్, సాయి చరణ్, రాజేష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.1