logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్థికాభివృద్ధిని సాధించాలి: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్... హనుమకొండ, మార్చి 18: మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హసన్‌పర్తి సంస్కృతి విహార్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆమె ప్రారంభించారు. కాకతీయ మహిళా సమాఖ్య ద్వారా లక్షకు పైగా సభ్యులు రూ.460 కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు పొందడం అభినందనీయమని తెలిపారు. బస్సుల కొనుగోలు, ధాన్యం వ్యాపారం, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. సంఘాల ద్వారా ప్రతి నెల ఆదాయం పెరుగుతోందని, మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అవలంబించి ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు.

21 hrs ago
user_Mediya wgl medical wgl
Mediya wgl medical wgl
Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
21 hrs ago

ఆర్థికాభివృద్ధిని సాధించాలి: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్... హనుమకొండ, మార్చి 18: మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హసన్‌పర్తి సంస్కృతి విహార్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆమె ప్రారంభించారు. కాకతీయ మహిళా సమాఖ్య ద్వారా లక్షకు పైగా సభ్యులు రూ.460 కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు పొందడం అభినందనీయమని తెలిపారు. బస్సుల కొనుగోలు, ధాన్యం వ్యాపారం, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. సంఘాల ద్వారా ప్రతి నెల ఆదాయం పెరుగుతోందని, మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అవలంబించి ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • జనగామ జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసిపి చేతన్ తెలిపారు. ప్రధాన నిందితుడు బెలిగిని శివకుమార్ పురోహితుడిగా పని చేస్తూ, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు శ్రీనివాస్, సాయి చరణ్, రాజేష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    1
    జనగామ జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నలుగురు నిందితులను  అరెస్ట్ చేసినట్లు ఏసిపి చేతన్ తెలిపారు.
ప్రధాన నిందితుడు బెలిగిని శివకుమార్ పురోహితుడిగా పని చేస్తూ, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు శ్రీనివాస్, సాయి చరణ్, రాజేష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
హన్మకొండ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎంను, ఎంఐఎం ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జాతిపితను అవమానపరిచేలా వ్యవహరిస్తూ గాడ్సేకు వారసులుగా బీజేపీ నాయకులున్నారని విమర్శించారు.‌ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాతపూర్వకంగా లేదా తమ పార్టీ సభ్యుల ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతి వనం పెడతామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీ నీ స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజుల్లోనే తుపాకి పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్ళని ఆరోపించారు. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని, అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య వైద్యం వివిధ అంశాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉంది అంటే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణ లే నిదర్శనమని తెలిపారు. మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప.. దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విమర్శించారు. సబర్మతి డెవలప్ చేసుకోగా.. మూసి డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మూసినిర్వాసులకు న్యాయం చేసిన తరువాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి బిఆర్ఎస్ లు సహకరించాలని కోరారు.
    2
    కేంద్ర మంత్రి బండి సంజయ్,  సీఎంను, ఎంఐఎం ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జాతిపితను అవమానపరిచేలా వ్యవహరిస్తూ గాడ్సేకు వారసులుగా బీజేపీ నాయకులున్నారని విమర్శించారు.‌ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాతపూర్వకంగా లేదా తమ పార్టీ సభ్యుల ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతి వనం పెడతామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీ నీ స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజుల్లోనే తుపాకి పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్ళని ఆరోపించారు. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని, అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య వైద్యం వివిధ అంశాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉంది అంటే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణ లే నిదర్శనమని తెలిపారు.
మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప.. దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విమర్శించారు. సబర్మతి డెవలప్ చేసుకోగా.. మూసి డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
మూసినిర్వాసులకు న్యాయం చేసిన తరువాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి బిఆర్ఎస్ లు సహకరించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    20 min ago
  • నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు సిట్ అంటేనే కూర్చోవడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే ఫాంహౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది ఆర్ఎస్ఎస్ ని నిషేదించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భారత నిఘా విభాగం *రా* ను కూడా నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రాష్టంలో కరెంట్ కోత విపరీతంగా ఉంది కరెంటు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగించాలి పంటలు ఎండిపోతున్నాయి మందుల సామేల్ బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులపై విషం కక్కారు.
    1
    నల్లగొండ జిల్లా
బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు
సిట్ అంటేనే కూర్చోవడం 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది
డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే
ఫాంహౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. 
నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం 
స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది
ఆర్ఎస్ఎస్ ని నిషేదించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా 
భారత నిఘా విభాగం *రా* ను కూడా నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది
రాష్టంలో కరెంట్ కోత విపరీతంగా ఉంది
కరెంటు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగించాలి
పంటలు ఎండిపోతున్నాయి
మందుల సామేల్ బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులపై విషం కక్కారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    20 hrs ago
  • కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో శ్రీ అంజనా రెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో ఎస్. అంజనా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కొండగట్టులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు.అనంతరం స్వామివారి మండపంలో శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.
    1
    కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో శ్రీ అంజనా రెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవో ఎస్. అంజనా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కొండగట్టులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు.అనంతరం స్వామివారి మండపంలో శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 min ago
  • ఉగాది శుభకాంక్ష లు
    2
    ఉగాది శుభకాంక్ష లు
    user_Hannu Shaik
    Hannu Shaik
    Local Politician మిర్యాలగూడ, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేట జిల్లా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.
    1
    సిద్దిపేట జిల్లా
కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు.
శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవాలయ ముఖ్య అర్చకులు మధుకర్ శర్మ పంచాంగాన్ని శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు
    1
    హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవాలయ ముఖ్య అర్చకులు మధుకర్ శర్మ పంచాంగాన్ని శ్రవణం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సీఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులను తొక్కుకుంటూ వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శించారు. కరీంనగర్ లో ఉగాది పర్వదినం సందర్భంగా స్వగృహంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, ఈ మధ్య కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్ లు పెడుతుంటే వాళ్లను ఉద్దేశించే సీఎం ఆ వార్నింగ్ ఇచ్చినట్లుందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప ఈ తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ సైతం తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారని విమర్శించారు.నా ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుండి పైసలు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డికే అప్పగించారని, ఇదే విషయంపైనే మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని ఆరోపించారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉందని, రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీయడం లేదని, బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
    1
    ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సీఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులను తొక్కుకుంటూ వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శించారు. కరీంనగర్ లో ఉగాది పర్వదినం సందర్భంగా స్వగృహంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, ఈ మధ్య కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్ లు పెడుతుంటే వాళ్లను ఉద్దేశించే సీఎం ఆ వార్నింగ్ ఇచ్చినట్లుందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప ఈ తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ సైతం తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారని విమర్శించారు.నా ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుండి పైసలు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డికే అప్పగించారని, ఇదే విషయంపైనే మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని ఆరోపించారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉందని, రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీయడం లేదని,  బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    25 min ago
  • భారతదేశ అత్యున్నత ప్రమాణిక గ్రంథమైన రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, జై భీమ్ మహాసేన జాతీయ అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న డిమాండ్ చేశారు. బుధవారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులు, బాధ్యతలు, సమానత్వం వంటి విలువలను నేర్పే అత్యంత ముఖ్యమైన పత్రం అని తెలిపారు. భావి భారత పౌరులుగా ఎదుగుతున్న విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చి, ప్రతి విద్యార్థికి రాజ్యాంగ పుస్తకాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని పాఠ్యాంశాల్లో రాజ్యాంగాన్ని చేర్చి, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దళితవాది విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్జీ కెవిపియస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శీను, వంటపాక యాదగిరి, రమణ తదితరులు పాల్గొన్నారు.
    2
    భారతదేశ అత్యున్నత ప్రమాణిక గ్రంథమైన రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, జై భీమ్ మహాసేన జాతీయ అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న డిమాండ్ చేశారు.
బుధవారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులు, బాధ్యతలు, సమానత్వం వంటి విలువలను నేర్పే అత్యంత ముఖ్యమైన పత్రం అని తెలిపారు.
భావి భారత పౌరులుగా ఎదుగుతున్న విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చి, ప్రతి విద్యార్థికి రాజ్యాంగ పుస్తకాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని పాఠ్యాంశాల్లో రాజ్యాంగాన్ని చేర్చి, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దళితవాది విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్జీ కెవిపియస్  జిల్లా అధ్యక్షుడు కొండేటి శీను, వంటపాక యాదగిరి, రమణ తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.