Shuru
Apke Nagar Ki App…
శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణం.. ఉగాది ఉత్సవాలు వైభవంగా హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవాలయ ముఖ్య అర్చకులు మధుకర్ శర్మ పంచాంగాన్ని శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు
M D Azizuddin
శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణం.. ఉగాది ఉత్సవాలు వైభవంగా హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవాలయ ముఖ్య అర్చకులు మధుకర్ శర్మ పంచాంగాన్ని శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.1
- మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీస్ సంయుక్త ఆపరేషన్ లో అక్రమ సారాయి వ్యాపారం గురించి చిత్తూరు నుండి మహబూబాబాద్ కి నల్లబెల్లం తరలిస్తున్న లారీ నీ కురవి శివారు సోమ్లా తండా దగ్గర పట్టుకొని అందులో తరలిస్తున్న 70క్వింటాల్ నల్లబెల్లం,10 క్వింటల్ పట్టిక స్వాధీనం చేసుకొని బాద్యులైన గుగులోత్ సుమన్ మహబూబాబాద్, ఆరెపల్లి మధు మరియు బొల్లా విజయ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ Ci హతీరామ్, Si తాహేర్ బాబా, మరియు కురవి Si గండ్రాతి సతీష్, Si జయకుమార్, Pc సమ్మయ్య, Pc హరిబాబు,pc నరేష్, Pc బద్రు, Pc బాబు పాల్గొన్నారు.1
- ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉగాది పండుగ వేళ కరీంనగర్ లోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు ఆలయాలతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కన్నులపండువలా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మంత్రి పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుకున్నట్లు చేప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, గవర్నర్ ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.2
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1