Shuru
Apke Nagar Ki App…
ఉరుములు, మెరుపులతో బీభత్సం.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది! ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.
Mediya wgl medical wgl
ఉరుములు, మెరుపులతో బీభత్సం.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది! ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1
- కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా అంజనా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన అంజనా రెడ్డి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది హాజరై ఉగాది పర్వదినం తెలుగు నూతన సంవత్సర శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో తెలిపారు.4
- నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు సిట్ అంటేనే కూర్చోవడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే ఫాంహౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది ఆర్ఎస్ఎస్ ని నిషేదించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భారత నిఘా విభాగం *రా* ను కూడా నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రాష్టంలో కరెంట్ కోత విపరీతంగా ఉంది కరెంటు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగించాలి పంటలు ఎండిపోతున్నాయి మందుల సామేల్ బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులపై విషం కక్కారు.1
- ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జామా మసీదులో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామంలో ముస్లిం సోదరులకు సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి, ఈ పండుగ వేళ మతసామరస్యాన్ని చాటిచెప్పేలా అందరూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు, మనకు ఉన్న దానిలో మరొకరితో పంచుకోవడం అనే సందేశాన్ని రంజాన్ మాసం తెలియజేస్తుంది, నేడు బొప్పాపూర్ గ్రామం "జామా మసీద్"లో గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామాల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.1
- ఉగాది శుభకాంక్ష లు2
- సోషల్ మీడియా క్రేజ్.. ప్రాణాల మీదకు తెస్తోంది! రీల్స్ పిచ్చితో మృత్యువుతో చెలగాటం.. కదులుతున్న బస్సు కింద దూరి యువకుడి భయంకరమైన స్కేటింగ్ విన్యాసం! నేటి తరుణంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తోంది. క్షణకాలం ఆనందం కోసం.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న బస్సు కింద నుంచి స్కేటింగ్ చేస్తూ అవతలి వైపుకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. రహదారిపై ఒక బస్సు తన వేగంతో వెళ్తుండగా, వెనుక నుంచి స్కేటింగ్ చేస్తూ వచ్చిన ఒక యువకుడు అనూహ్యంగా బస్సు కిందకు దూరిపోయాడు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా లేదా బస్సు టైరు కింద పడినా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ, అదృష్టవశాత్తు ఆ యువకుడు క్షేమంగా బయటకు వచ్చాడు. చూడటానికి ఇది ఒక అద్భుతంలా అనిపించినా, ఇలాంటి చర్యలు ప్రాణాంతకమని ట్రాఫిక్ పోలీసులు మరియు సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ చూసి చిన్నపిల్లలు, ఇతర యువకులు కూడా ప్రయత్నించే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్య గమనిక: వీడియోలు వైరల్ కావొచ్చు కానీ, ప్రాణాలు పోతే తిరిగి రావు. సాహసాలకు, మూర్ఖత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని JTV9 News యువతకు విజ్ఞప్తి చేస్తోంది.1
- జనగామ జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసిపి చేతన్ తెలిపారు. ప్రధాన నిందితుడు బెలిగిని శివకుమార్ పురోహితుడిగా పని చేస్తూ, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు శ్రీనివాస్, సాయి చరణ్, రాజేష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.1
- కరీంనగర్ లో కన్నుల పండుగలా ఉగాది పర్వదిన వేడుకలు జరిగాయి. తిరుమలనగర్ లోని వాసవి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఓనర్స్ అందరూ కలిసి ఉగాది వేడుకలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తములచే పంచాంగ శ్రవణం గావించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు కాలం ఎలా ఉండబోతుందనే విషయాలను స్పష్టంగా పండితులు శ్రీనివాస రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కట్కూరి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, ప్రతినిధులు శివ, భాస్కర్, శంకర్ రెడ్డి, నరేందర్, రాజయ్య, మహిళా ప్రతినిధులు మంజుల, సమత, అనిత, శారద, రాజ్యలక్ష్మి, పద్మ, సింధు, శ్రీదేవి, స్వరూప పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం షడ్రుచుల పచ్చడి సేవించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ శ్రీదేవి, సెకండ్ ప్రైజ్ సమత కు వాసవి అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. అదేవిధంగా స్ట్రా పట్టు గిఫ్ట్ కొట్టు గేమ్ లో ఫస్ట్ ప్రైస్ అనిత, సెకండ్ ప్రైజ్ సింధుకు ప్రతినిధులు ప్రధానం చేశారు. చిల్డ్రన్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వర్ణిక, సెకండ్ ప్రైజ్ నాన్సి అందుకున్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతి పండుగను జరుపుకుంటామని అపార్ట్మెంట్ ప్రతినిధులు చాటిచెప్పారు.4
- భారతదేశ అత్యున్నత ప్రమాణిక గ్రంథమైన రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, జై భీమ్ మహాసేన జాతీయ అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న డిమాండ్ చేశారు. బుధవారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులు, బాధ్యతలు, సమానత్వం వంటి విలువలను నేర్పే అత్యంత ముఖ్యమైన పత్రం అని తెలిపారు. భావి భారత పౌరులుగా ఎదుగుతున్న విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చి, ప్రతి విద్యార్థికి రాజ్యాంగ పుస్తకాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని పాఠ్యాంశాల్లో రాజ్యాంగాన్ని చేర్చి, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దళితవాది విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్జీ కెవిపియస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శీను, వంటపాక యాదగిరి, రమణ తదితరులు పాల్గొన్నారు.2