కరీంనగర్ వాసవి అపార్ట్మెంట్ లో కన్నుల పండువలా ఉగాది పర్వదిన వేడుకలు...పంచాంగ శ్రవణం, మహిళలకు బహుమతులు ప్రధానం. కరీంనగర్ లో కన్నుల పండుగలా ఉగాది పర్వదిన వేడుకలు జరిగాయి. తిరుమలనగర్ లోని వాసవి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఓనర్స్ అందరూ కలిసి ఉగాది వేడుకలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తములచే పంచాంగ శ్రవణం గావించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు కాలం ఎలా ఉండబోతుందనే విషయాలను స్పష్టంగా పండితులు శ్రీనివాస రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కట్కూరి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, ప్రతినిధులు శివ, భాస్కర్, శంకర్ రెడ్డి, నరేందర్, రాజయ్య, మహిళా ప్రతినిధులు మంజుల, సమత, అనిత, శారద, రాజ్యలక్ష్మి, పద్మ, సింధు, శ్రీదేవి, స్వరూప పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం షడ్రుచుల పచ్చడి సేవించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ శ్రీదేవి, సెకండ్ ప్రైజ్ సమత కు వాసవి అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. అదేవిధంగా స్ట్రా పట్టు గిఫ్ట్ కొట్టు గేమ్ లో ఫస్ట్ ప్రైస్ అనిత, సెకండ్ ప్రైజ్ సింధుకు ప్రతినిధులు ప్రధానం చేశారు. చిల్డ్రన్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వర్ణిక, సెకండ్ ప్రైజ్ నాన్సి అందుకున్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతి పండుగను జరుపుకుంటామని అపార్ట్మెంట్ ప్రతినిధులు చాటిచెప్పారు.
కరీంనగర్ వాసవి అపార్ట్మెంట్ లో కన్నుల పండువలా ఉగాది పర్వదిన వేడుకలు...పంచాంగ శ్రవణం, మహిళలకు బహుమతులు ప్రధానం. కరీంనగర్ లో కన్నుల పండుగలా ఉగాది పర్వదిన వేడుకలు జరిగాయి. తిరుమలనగర్ లోని వాసవి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఓనర్స్ అందరూ కలిసి ఉగాది వేడుకలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తములచే పంచాంగ శ్రవణం గావించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు,
వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు కాలం ఎలా ఉండబోతుందనే విషయాలను స్పష్టంగా పండితులు శ్రీనివాస రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కట్కూరి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, ప్రతినిధులు శివ, భాస్కర్, శంకర్ రెడ్డి, నరేందర్, రాజయ్య, మహిళా ప్రతినిధులు మంజుల, సమత,
అనిత, శారద, రాజ్యలక్ష్మి, పద్మ, సింధు, శ్రీదేవి, స్వరూప పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం షడ్రుచుల పచ్చడి సేవించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ శ్రీదేవి, సెకండ్ ప్రైజ్ సమత కు వాసవి అపార్ట్మెంట్
వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. అదేవిధంగా స్ట్రా పట్టు గిఫ్ట్ కొట్టు గేమ్ లో ఫస్ట్ ప్రైస్ అనిత, సెకండ్ ప్రైజ్ సింధుకు ప్రతినిధులు ప్రధానం చేశారు. చిల్డ్రన్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వర్ణిక, సెకండ్ ప్రైజ్ నాన్సి అందుకున్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతి పండుగను జరుపుకుంటామని అపార్ట్మెంట్ ప్రతినిధులు చాటిచెప్పారు.
- ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉగాది పండుగ వేళ కరీంనగర్ లోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు ఆలయాలతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కన్నులపండువలా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మంత్రి పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుకున్నట్లు చేప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, గవర్నర్ ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.2
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జామా మసీదులో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామంలో ముస్లిం సోదరులకు సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి, ఈ పండుగ వేళ మతసామరస్యాన్ని చాటిచెప్పేలా అందరూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు, మనకు ఉన్న దానిలో మరొకరితో పంచుకోవడం అనే సందేశాన్ని రంజాన్ మాసం తెలియజేస్తుంది, నేడు బొప్పాపూర్ గ్రామం "జామా మసీద్"లో గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామాల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.1
- వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.1
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- మెట్ పల్లి, మార్చి 19: కోరుట్ల నియోజకవర్గం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్న వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..దర్యాప్తులో భాగంగా నిందితుడికి సహకరించి బాధితురాలిని కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కట్న వేధింపులు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు.మెట్ పల్లి డిఎస్పీ రాములు ఆదేశాల మేరకు ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టగా, నిందితులను గురువారం అరెస్ట్ చేసి, సబ్ డివిజన్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెలువడించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ వారిని న్యాయస్థానంలో ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు .ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.2
- కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా అంజనా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన అంజనా రెడ్డి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది హాజరై ఉగాది పర్వదినం తెలుగు నూతన సంవత్సర శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో తెలిపారు.4