దావత్-ఏ-ఇఫ్తార్ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
దావత్-ఏ-ఇఫ్తార్ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.1
- మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీస్ సంయుక్త ఆపరేషన్ లో అక్రమ సారాయి వ్యాపారం గురించి చిత్తూరు నుండి మహబూబాబాద్ కి నల్లబెల్లం తరలిస్తున్న లారీ నీ కురవి శివారు సోమ్లా తండా దగ్గర పట్టుకొని అందులో తరలిస్తున్న 70క్వింటాల్ నల్లబెల్లం,10 క్వింటల్ పట్టిక స్వాధీనం చేసుకొని బాద్యులైన గుగులోత్ సుమన్ మహబూబాబాద్, ఆరెపల్లి మధు మరియు బొల్లా విజయ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ Ci హతీరామ్, Si తాహేర్ బాబా, మరియు కురవి Si గండ్రాతి సతీష్, Si జయకుమార్, Pc సమ్మయ్య, Pc హరిబాబు,pc నరేష్, Pc బద్రు, Pc బాబు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా మాదాపూర్ లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ వైష్ణవి ని కోరుట్లకు చెందిన యువకుడు చిత్తారి హరిబాబు ప్రేమించి ఏడాది క్రితం పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలే వైష్ణవి గర్భం దాల్చగా వరకట్నం కోసం భర్త వేధించి చివరకు 17న కత్తితో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశాడు. హత్య జరిగిన మరుసటి రోజే పోలీసులు భర్త హరిబాబును అరెస్టు చేశారు. వైష్ణవి హత్య కేసులో హరిబాబు తల్లిదండ్రులతోపాటు సోదరుల ప్రమేయం ఉందని నిర్థారించిన పోలీసులు హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి ఇద్దరు అన్నలు ఆనంద్, అశోక్ లను అరెస్టు చేశారు. వైష్ణవి హత్య కేసులో భర్త తోపాటు నలుగురిని కటకటాల వెనక్కి పంపించినట్లు డిఎస్పీ రాములు తెలిపారు.1
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జామా మసీదులో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామంలో ముస్లిం సోదరులకు సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి, ఈ పండుగ వేళ మతసామరస్యాన్ని చాటిచెప్పేలా అందరూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు, మనకు ఉన్న దానిలో మరొకరితో పంచుకోవడం అనే సందేశాన్ని రంజాన్ మాసం తెలియజేస్తుంది, నేడు బొప్పాపూర్ గ్రామం "జామా మసీద్"లో గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామాల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1