రామచంద్రపురం భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. గురువారం మల్లంపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలోని రైతు వేదికలో రామచంద్రపురం గ్రామంలోని 10500 ఎకరాల వ్యవసాయ భూమి రీ సర్వే, హద్దులు గుర్తించుటకు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్రపూర్ భూములను రీ సర్వే నిర్వహించి భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గతంలో అనేక కారణాలవల్ల చాలామంది రైతులకు పట్టా పాస్ బుక్ లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించే విధంగా 10వేల 500 ఎకరాల వ్యవసాయ భూమిని 9 బ్లాక్ లుగా ఏర్పాటు చేసి 9 సర్వే బృందాలను ఏర్పాటు చేసి ఒక రోజు 50 నుంచి 75 మంది పట్టాదారుల భూములను రి సర్వే చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సూచించారు. రీ సర్వే నిర్వహించడానికి గ్రామస్తులు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, రామచంద్రపూర్, దేవ నగర్, భూపాల్ నగర్, గుర్తుర్ తండా, శివతండా సర్పంచులు దొంతి స్వరూప, సంతోష్, రమణారెడ్డి, రాజు నాయక్, భాస్కర్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. గురువారం మల్లంపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలోని రైతు వేదికలో రామచంద్రపురం గ్రామంలోని 10500 ఎకరాల వ్యవసాయ భూమి రీ సర్వే, హద్దులు గుర్తించుటకు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్రపూర్ భూములను రీ సర్వే నిర్వహించి భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గతంలో అనేక కారణాలవల్ల చాలామంది రైతులకు పట్టా పాస్ బుక్ లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించే విధంగా 10వేల 500 ఎకరాల వ్యవసాయ భూమిని 9 బ్లాక్ లుగా ఏర్పాటు చేసి 9 సర్వే బృందాలను ఏర్పాటు చేసి ఒక రోజు 50
నుంచి 75 మంది పట్టాదారుల భూములను రి సర్వే చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సూచించారు. రీ సర్వే నిర్వహించడానికి గ్రామస్తులు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, రామచంద్రపూర్, దేవ నగర్, భూపాల్ నగర్, గుర్తుర్ తండా, శివతండా సర్పంచులు దొంతి స్వరూప, సంతోష్, రమణారెడ్డి, రాజు నాయక్, భాస్కర్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1
- కరీంనగర్ లో కన్నుల పండుగలా ఉగాది పర్వదిన వేడుకలు జరిగాయి. తిరుమలనగర్ లోని వాసవి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఓనర్స్ అందరూ కలిసి ఉగాది వేడుకలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తములచే పంచాంగ శ్రవణం గావించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు కాలం ఎలా ఉండబోతుందనే విషయాలను స్పష్టంగా పండితులు శ్రీనివాస రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కట్కూరి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, ప్రతినిధులు శివ, భాస్కర్, శంకర్ రెడ్డి, నరేందర్, రాజయ్య, మహిళా ప్రతినిధులు మంజుల, సమత, అనిత, శారద, రాజ్యలక్ష్మి, పద్మ, సింధు, శ్రీదేవి, స్వరూప పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం షడ్రుచుల పచ్చడి సేవించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ శ్రీదేవి, సెకండ్ ప్రైజ్ సమత కు వాసవి అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. అదేవిధంగా స్ట్రా పట్టు గిఫ్ట్ కొట్టు గేమ్ లో ఫస్ట్ ప్రైస్ అనిత, సెకండ్ ప్రైజ్ సింధుకు ప్రతినిధులు ప్రధానం చేశారు. చిల్డ్రన్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వర్ణిక, సెకండ్ ప్రైజ్ నాన్సి అందుకున్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతి పండుగను జరుపుకుంటామని అపార్ట్మెంట్ ప్రతినిధులు చాటిచెప్పారు.4
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- వాసవి వస్తాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వినియోగదారులలో లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని 21 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఇందులో 11 మందికి స్మార్ట్ సెల్ ఫోన్లు 10 మందికి రిఫ్రిజిరేటర్ లను అందించనున్నారు .1
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.1
- హనుమకొండ, మార్చి 18: మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హసన్‌పర్తి సంస్కృతి విహార్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆమె ప్రారంభించారు. కాకతీయ మహిళా సమాఖ్య ద్వారా లక్షకు పైగా సభ్యులు రూ.460 కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు పొందడం అభినందనీయమని తెలిపారు. బస్సుల కొనుగోలు, ధాన్యం వ్యాపారం, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. సంఘాల ద్వారా ప్రతి నెల ఆదాయం పెరుగుతోందని, మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అవలంబించి ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు.1