ఉగాది పండుగ సందర్భంగా మట్టి పాత్రలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్...మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మట్టి పాత్రలు అందజేసిన పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని "మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి - కుల వృత్తులను ప్రోత్సహించండి" అనే నినాదంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లకు ఉగాది మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.. అందులో ఉగాది పండగ కి ఉపయోగపడే మట్టి కుండా, గ్లాస్ లు , జగ్గు ,బౌల్, షడ్రుచులు ఉండే మామిడి కాయలు , వేప పువ్వు , బెల్లం , చింతపండు ,కారం వస్తువులు ఉగాది కిట్ లో అందజేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు ఉపయోగించాలని , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పండగలతో మట్టి పాత్రలు అనువైనవనని మంత్రి పొన్నం ప్రభాకర్ మట్టి పాత్రలు వినియోగాన్ని పెంచి కుల వృత్తులను కాపాడడానికి అందజేశారని వారు పేర్కొన్నారు. మట్టి పాత్రలు వాడకం తరతరాల సంప్రదాయం.. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయనీ ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు వాడండి ,కుల వృత్తులను కాపాడండి .. ఆరోగ్యాన్ని రక్షించుకోండి అనే నినాదంతో పండగ జరుపుకోవాలని సూచించారు.
ఉగాది పండుగ సందర్భంగా మట్టి పాత్రలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్...మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మట్టి పాత్రలు అందజేసిన పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని "మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి - కుల వృత్తులను
ప్రోత్సహించండి" అనే నినాదంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లకు ఉగాది మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.. అందులో ఉగాది పండగ కి ఉపయోగపడే మట్టి కుండా, గ్లాస్ లు , జగ్గు ,బౌల్, షడ్రుచులు ఉండే మామిడి
కాయలు , వేప పువ్వు , బెల్లం , చింతపండు ,కారం వస్తువులు ఉగాది కిట్ లో అందజేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు ఉపయోగించాలని , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పండగలతో మట్టి
పాత్రలు అనువైనవనని మంత్రి పొన్నం ప్రభాకర్ మట్టి పాత్రలు వినియోగాన్ని పెంచి కుల వృత్తులను కాపాడడానికి అందజేశారని వారు పేర్కొన్నారు. మట్టి పాత్రలు వాడకం తరతరాల సంప్రదాయం.. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయనీ ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు వాడండి ,కుల వృత్తులను కాపాడండి .. ఆరోగ్యాన్ని రక్షించుకోండి అనే నినాదంతో పండగ జరుపుకోవాలని సూచించారు.
- జగిత్యాల జిల్లాలో తనయుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగ, ఇక కొడుకు లేడనే నిజాన్ని తట్టుకోలేక తల్లి గుండె ఆగిపోయింది. గంటల వ్యవధిలో తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో మోతె గ్రామంలో విషాదం అలుముకుంది. మోతె గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ (25) అప్పుల బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. కొడుకు మరణ వార్తతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లవ్వ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు తల్లి–కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.3
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1
- సిద్దిపేట జిల్లా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 18 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బుద్ధ నారాయణ మెట్టమ్మ దంపతుల జ్ఞాపకార్థం, బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈనెల అమావాస్య రోజున బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బుద్ధ అన్నపూర్ణ, శంకరయ్య, బుద్ద శివ, కొమరవెల్లి సుధాకర్,రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కాశీనాథ్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్,కైలాస ప్రశాంత్,రమేష్, ఉప్పల చంద్రశేఖర్, సిరిపురం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు4
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని "మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి - కుల వృత్తులను ప్రోత్సహించండి" అనే నినాదంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లకు ఉగాది మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.. అందులో ఉగాది పండగ కి ఉపయోగపడే మట్టి కుండా, గ్లాస్ లు , జగ్గు ,బౌల్, షడ్రుచులు ఉండే మామిడి కాయలు , వేప పువ్వు , బెల్లం , చింతపండు ,కారం వస్తువులు ఉగాది కిట్ లో అందజేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు ఉపయోగించాలని , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పండగలతో మట్టి పాత్రలు అనువైనవనని మంత్రి పొన్నం ప్రభాకర్ మట్టి పాత్రలు వినియోగాన్ని పెంచి కుల వృత్తులను కాపాడడానికి అందజేశారని వారు పేర్కొన్నారు. మట్టి పాత్రలు వాడకం తరతరాల సంప్రదాయం.. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయనీ ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు వాడండి ,కుల వృత్తులను కాపాడండి .. ఆరోగ్యాన్ని రక్షించుకోండి అనే నినాదంతో పండగ జరుపుకోవాలని సూచించారు.4