Shuru
Apke Nagar Ki App…
నరసన్నపేట: ఆలయాలలో చోరీలు.. ముగ్గురు అరెస్ట్ నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, పోలాకి, సంతబొమ్మాలి, సారవకోట మండలాలలో అమ్మవారి ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేశారు. చేపూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Dr.Gangu Manmadharao
నరసన్నపేట: ఆలయాలలో చోరీలు.. ముగ్గురు అరెస్ట్ నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, పోలాకి, సంతబొమ్మాలి, సారవకోట మండలాలలో అమ్మవారి ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేశారు. చేపూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం ఎమ్మెల్యే శంకర్ తో కలిసి పలు రోడ్లను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, డిసెంబర్ 31: నగరంలోని ప్రతి వీధిలోనూ మౌలిక సదుపాయాలు కల్పించి, శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని బలగ చిట్టివారి తోట నుండి బలగ రోడ్డు వరకు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అలాగే కుమ్మరి వీధి నుండి పాలకొండ రోడ్డు వరకు రూ.1.23 కోట్ల సాధారణ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు నాణ్యమైన రహదారులు, కాలువల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద రావు, ఇంజనీరింగ్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.1
- కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం తరఫున నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, చిరునవ్వులు, సంతోషం నిండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. మీ విశ్వాసానికి మా ధన్యవాదాలు.1
- జడ్పీ పాఠశాల అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే హిరమండలం మండలంలోని తంప గ్రామంలోని జడ్పీ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం పాఠశాలను సందర్శించిన ఆయన, ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలపై వివరించగా, మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, తక్షణమే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.1
- edi paristhiti3
- #Happy New year 🎊🎊🎊#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year1
- Post by FIROZANSARI FIROZ1
- న్యూఇయర్ వేడుకల వేళ కాగజ్ నగర్ లో డ్రంక్ అండ్ డైవ్. కాగజ్ నగర్ :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వహీదుద్దీన్ పర్యవేక్షణలో ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ చౌరస్తాలలో తనిఖీలు చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- పట్టాలతో పండగ.. పింఛన్లతో భరోసా! - 50 ఏళ్ల నిరీక్షణకు తెర.. 25 మందికి భూమి పత్రాలు - కోర్టు ఆదేశాలతో 9 మందికి రూ. 18 లక్షల బకాయిల పంపిణీ - నిరుపేదలకు అండగా నిలిచిన మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి, డిసెంబర్ 31: అర్హులైన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం ప్రకాష్ నగర్ కాలనీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మూడు కీలక కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు 50 ఏళ్ల కల సాకారం.. కోటబొమ్మాళి మండలం పొందర వీధికి చెందిన 25 మంది లబ్ధిదారులు సుమారు ఐదు దశాబ్దాలుగా భూమి సాగు చేస్తున్నప్పటికీ, వారి పేర్లపై అధికారిక పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్‌గా తీసుకుని, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన 25 మందిని గుర్తించి వారికి 'వన్-బి' భూమి పత్రాలను సిద్ధం చేసింది. వీటిని ప్రకాష్ నగర్ కాలనీలో మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. త్వరలోనే వీరందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అన్యాయంపై విజయం.. రూ. 18 లక్షల పంపిణీ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో తొలగించబడిన నందిగామ మండలం దీనబందపురానికి చెందిన 9 మంది లబ్ధిదారుల పింఛన్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పందించిన ప్రభుత్వం.. పింఛన్లు నిలిపివేసిన నాటి నుండి నేటి వరకు ఉన్న బకాయి మొత్తం రూ. 18 లక్షలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు అందజేస్తూ.. పేదల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ వెనుకాడదని స్పష్టం చేశారు. ముందుగానే పింఛన్ల పండుగ.. ఇక నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీకి బదులుగా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రకాష్ నగర్ కాలనీలో మంత్రి స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. స్వయంగా పింఛన్లు అందజేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్, కూటమి ముఖ్య నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.4