Shuru
Apke Nagar Ki App…
edi paristhiti
Rocky
edi paristhiti
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పట్టాలతో పండగ.. పింఛన్లతో భరోసా! - 50 ఏళ్ల నిరీక్షణకు తెర.. 25 మందికి భూమి పత్రాలు - కోర్టు ఆదేశాలతో 9 మందికి రూ. 18 లక్షల బకాయిల పంపిణీ - నిరుపేదలకు అండగా నిలిచిన మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి, డిసెంబర్ 31: అర్హులైన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం ప్రకాష్ నగర్ కాలనీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మూడు కీలక కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు 50 ఏళ్ల కల సాకారం.. కోటబొమ్మాళి మండలం పొందర వీధికి చెందిన 25 మంది లబ్ధిదారులు సుమారు ఐదు దశాబ్దాలుగా భూమి సాగు చేస్తున్నప్పటికీ, వారి పేర్లపై అధికారిక పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్‌గా తీసుకుని, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన 25 మందిని గుర్తించి వారికి 'వన్-బి' భూమి పత్రాలను సిద్ధం చేసింది. వీటిని ప్రకాష్ నగర్ కాలనీలో మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. త్వరలోనే వీరందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అన్యాయంపై విజయం.. రూ. 18 లక్షల పంపిణీ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో తొలగించబడిన నందిగామ మండలం దీనబందపురానికి చెందిన 9 మంది లబ్ధిదారుల పింఛన్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పందించిన ప్రభుత్వం.. పింఛన్లు నిలిపివేసిన నాటి నుండి నేటి వరకు ఉన్న బకాయి మొత్తం రూ. 18 లక్షలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు అందజేస్తూ.. పేదల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ వెనుకాడదని స్పష్టం చేశారు. ముందుగానే పింఛన్ల పండుగ.. ఇక నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీకి బదులుగా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రకాష్ నగర్ కాలనీలో మంత్రి స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. స్వయంగా పింఛన్లు అందజేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్, కూటమి ముఖ్య నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.4
- జడ్పీ పాఠశాల అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే హిరమండలం మండలంలోని తంప గ్రామంలోని జడ్పీ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం పాఠశాలను సందర్శించిన ఆయన, ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలపై వివరించగా, మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, తక్షణమే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.1
- నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.1
- నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల డిఆర్ ఉత్తమ హోటల్స్ వారి డియర్ ఉత్తమ్ స్వీట్స్ నందు కేక్స్ మరియు స్వీట్స్ పైన బంపర్ ఆఫర్లు ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన క్వాలిటీ రుచికరమైన స్వీట్స్ తినాలంటే కేవలం డిఆర్ ఉత్తమ స్వీట్స్ మాత్రమే అని ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకంగా డిసెంబర్ 31 నుండి గీ స్వీట్స్ కూల్ కేక్స్ తదితర అన్ని ఐటమ్స్ మీద ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసి తమ ఖాతాదారులకు అందించే క్రమంలో మీ ముందుకు తీసుకు వచ్చిందని డిఆర్ ఉత్తమ స్వీట్స్ యాజమాన్యం మీడియాతో తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రత్యేకంగా డిఆర్ ఉత్తమ హోటల్ నందు డిసెంబర్ 31 తేదీలలో వెజ్ నాన్ వెజ్ బఫే ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు భోజన ప్రజలు ఒకసారి వచ్చి రుచిచూడవలసిందిగా కోరారు. తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అందరికీ కూడా నూతన మరియు భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఉత్తమ హోటల్ కార్యనిర్వాహకులు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.3
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యాయయనోత్సవాలు రెండవ రోజు శ్రీకృష్ణ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుడు..1
- Post by Bondhu Suresh1
- నరసన్నపేట: ఆలయాలలో చోరీలు.. ముగ్గురు అరెస్ట్ నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, పోలాకి, సంతబొమ్మాలి, సారవకోట మండలాలలో అమ్మవారి ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేశారు. చేపూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.3
- తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో పోలీసుల అత్యుత్సాహం ఆల్రెడీ ఆర్డిఓ సర్వే చేసి తేల్చిన భూమి పంచాయతీలో అధికార పార్టీకి మద్దతుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణ ఒక వర్గాన్ని స్టేషన్లో కూర్చోబెట్టి మరో వర్గానికి అనుకూలంగా వేసిన నాట్లను తొక్కించిన వైనం తహసిల్దార్ నివేదిక ను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులు అవతల వైపు కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్న పత్రాలు చూపిస్తున్న వారికి మద్దతుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రతిరోజు స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్పీ ని సైతం తప్పుదోవ పట్టిస్తున్న తిప్పర్తి ఎస్సై శంకర్, సిఐ కొండల్ రెడ్డి ఇవాళ ఉదయం కూడా జీపులో వచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం పోలీసుల తీరుకు నిరసనగా సామూహికంగా బలవన్మరణానికి పాల్పడతామంటూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబం గ్రామంలో ఉద్రిక్తత1
- నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ సమీపంలో గల రాధాకృష్ణ స్వీట్స్ నందు డిసెంబర్ 31 జనవరి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లే నిర్వహించారు . నాణ్యమైన స్వీట్స్ కొరకు కేవలం రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే పెట్టింది పేరు రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే. డిసెంబర్ 31 సందర్భముగా ప్రత్యేకంగా ఈ స్వీట్స్ కేక్స్ కూల్ కేక్స్ తదితర ఐటమ్స్ పై ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు ఏడుకొండలు గారు మీడియాతో తెలిపారు. అదే క్రమంలో తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు తమ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలికారు.4