logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆకేరు వాగుపై చెక్ డ్యామ్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆకేరు వాగుపై రూ.65 లక్షల వ్యయంతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చెక్ డ్యామ్ ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి, వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

ఆకేరు వాగుపై చెక్ డ్యామ్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆకేరు వాగుపై రూ.65 లక్షల వ్యయంతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చెక్ డ్యామ్ ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి, వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.
    1
    హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    46 min ago
  • Post by Venkatgoud kallepu
    1
    Post by Venkatgoud kallepu
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer Warangal, Telangana•
    3 hrs ago
  • కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం హనుమకొండ భవాని నగర్ లోని క్యాంపు కార్యాలయం నందు గీసుగొండ మండలం కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 27వ తేదీ(శుక్రవారం) రాత్రి 10.00 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నారు.
    2
    కొమ్మాల శ్రీశ్రీశ్రీ  లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను  ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి 
గురువారం హనుమకొండ భవాని నగర్ లోని క్యాంపు కార్యాలయం నందు గీసుగొండ మండలం కొమ్మాల శ్రీశ్రీశ్రీ  లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి  23వ తేదీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 27వ తేదీ(శుక్రవారం) రాత్రి 10.00 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    10 hrs ago
  • యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో యాప్ రద్దు చేయాలని రైతులు ఆగ్రహం యాప్ లో బుక్ చేసుకోవాలని అంటున్నారు.. నాకు చదువురాదు ఎలా బుక్ చేసుకోవాలి మాకు యూరియా ఇవ్వకుండా ఒక్క యూరియా బస్తా బయటకు పోయినా ఆత్మహత్య చేసుకుంటానని రైతు ఆవేదన
    1
    యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో యాప్ రద్దు చేయాలని రైతులు ఆగ్రహం
యాప్ లో బుక్ చేసుకోవాలని అంటున్నారు.. నాకు చదువురాదు ఎలా బుక్ చేసుకోవాలి
మాకు యూరియా ఇవ్వకుండా ఒక్క యూరియా బస్తా బయటకు పోయినా ఆత్మహత్య చేసుకుంటానని రైతు ఆవేదన
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం కేంద్రంలో శుక్రవారం విషాదకర పరిస్థితి నెలకొంది. వారంతపు సంత సందర్భంగా టమాట రైతులు భారీ మొత్తంలో తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉదయం నుంచే మార్కెట్‌కు తరలించిన టమాటాలకు ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. “ఫ్రీ… ఫ్రీ… టమాటాలు ఫ్రీ” అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతసేపు సంత ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు ధరల పతనం—ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం కేంద్రంలో శుక్రవారం విషాదకర పరిస్థితి నెలకొంది. వారంతపు సంత సందర్భంగా టమాట రైతులు భారీ మొత్తంలో తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉదయం నుంచే మార్కెట్‌కు తరలించిన టమాటాలకు ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
పెట్టిన పెట్టుబడికి సరిపడా ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు.
“ఫ్రీ… ఫ్రీ… టమాటాలు ఫ్రీ” అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతసేపు సంత ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు ధరల పతనం—ఈ దృశ్యం అందరినీ కలచివేసింది.
ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రైతు కష్టానికి ఫలితం దక్కలేదు. చెమటోడ్చి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఒక రైతు ఆవేదన చెందారు. టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక.. తన పంటను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్‌కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని గూడూర్ మండలం భూపతిపేట కు చెందిన రైతులు పోగుల కొండ సారయ్య, మోహన్,గుజ్జ సురేందర్ మూడు ఎకరాలలో టమాట పంట వేయగా మూడు లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను రోడ్డు పాలు చేయడం కంటే, తోటి ప్రజలకు పంచిపెడితే వారి ఆకలి తీరుతుందని భావించిన సదరు రైతులు.. దాదాపు 50 పెట్టెల నిండా టమాటాలను తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేశారు.
    1
    రైతు కష్టానికి ఫలితం దక్కలేదు. చెమటోడ్చి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఒక రైతు ఆవేదన చెందారు. టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక.. తన పంటను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్‌కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని గూడూర్ మండలం భూపతిపేట కు చెందిన రైతులు పోగుల కొండ సారయ్య, మోహన్,గుజ్జ సురేందర్ మూడు ఎకరాలలో టమాట పంట వేయగా మూడు లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను రోడ్డు పాలు చేయడం కంటే, తోటి ప్రజలకు పంచిపెడితే వారి ఆకలి తీరుతుందని భావించిన సదరు రైతులు.. దాదాపు 50 పెట్టెల నిండా టమాటాలను తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం బిజేపికి అడ్డాగా మారింది. కమలం వికాసానికి దిక్సూచిలా పరిణమించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుసగా రెండుసార్లు ఎంపిగా కరీంనగర్ నుంచి గెలువడమే కాకుండా తన సత్తా, బిజేపి బలం ఎంటో చూపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాకు మార్గదర్శిగా కరీంనగర్ ను నిలబెట్టారు. అంతర్గతంగా రాష్ట్ర బిజేపిలో విబేదాలు, గ్రూప్ రాజకీయాలు ఎన్ని ఉన్నా బండి సంజయ్ మాత్రం ఒంటి చెత్తో కరీంనగర్ ను బిజేపికి అడ్డాగా మార్చారు. రాష్ట్రంలోనే బిజేపి కైవసం చేసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలే కాదు బిజేపి పెద్దల దృ,ష్టిని ఆకర్శించారు. ఇక తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకున్నారు. బండి సంజయ్ అంటే పార్టీలో హాట్ టాఫిక్ గా మారారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సి పల్ కార్పోరేషన్ లు 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పోరేషన్ లో మినహా ఎక్కడ ఆశించిన ఫలితాలు బిజేపికి రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం 467 వార్డులు ఉండగా 90 వార్డులను బిజేపి కైవసం చేసుకుంది. అందులో వన్ థర్డ్ అంటే 30 వార్డులను కరీంనగర్ కార్పోరేషన్ లోనే గెలుచుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక పట్టణాలైన ధర్మపురి, మంథని మున్సిపాలిటీల్లో బిజేపి బోని కూడా చేయలేదు. ఇక రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కోక్క స్థానమే గెలుచుకుంది. మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను బిజేపి గెలుచుకున్నప్పటికి ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లభించక తృటిలో రెండు మున్సిపాలిటీలను బిజేపి కోల్పోయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మొత్తం 27 స్థానాలను బిజేపి కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 55 వార్డులను బిజేపి గెలుచుకుంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐదుగురు ఇండిపెండెంట్లు బిజేపి లో చేరడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజేపి కార్పోరేటర్ లు కౌన్సిలర్ ల సంఖ్య 60కి చేరింది. నాటకీయ పరిణామాల నేపద్యంలో కరీంనగర్ కార్పోరేషన్ లో బిజేపి జెండా ఎగురవేసింది. 66 డివిజన్ లలో 30 గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజేపి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండడంతో బిజేపికి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ యత్నించాయి. కూటిమిగా ఏర్పడి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ కు మేయర్ పదవి కట్టబెట్టి బిఆర్ఎస్ డిప్యూటి మేయర్ పొందాలనే ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ వ్యూహం ముందు కూటమి ప్రయత్నాలు పటాపంచల్ అయ్యాయి. కాంగ్రెస్ కు మేయర్ పీఠం చేజారిపోయి కషాయ దళానికి కార్పోరేషన్ దక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజేపికి కార్పోరేషన్ దక్కడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందట. కూటమి కట్టి కాంగ్రెస్, లేదా ఇండిపెండెంట్ ను మేయర్ ను చేస్తే అక్రమ కలయికను గ్రామగ్రామాన బండి సంజయ్ చాటి చెబుతాడని దీంతో రాబోయే ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బావించి, బండి సంజయ్ నోటికి బిఆర్ఎస్ బయపడిందటా. అందుకే మేయర్ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం వెనక్కి తగ్గినట్లు సమాచారం. బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో బిజేపి విజయాల పరంపర కొనసాగుతుంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్ని తానై వ్యవహరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 121 గ్రామాల్లో బిజేపి మద్దతుదారులు సర్పంచ్ లుగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ చరిత్రలోనే బిజేపి ఓ మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. వికసిస్తున్న కమళంతో కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు బిజేపి లో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బిజేపి కి ఢోకా లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోనే కమలం వికసించక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.‌ రాబోయే రోజుల్లో కరీంనగర్ మార్క్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు బావిస్తున్నారు. బండి సంజయ్ సంకల్ప బలానికి దైవానుగ్రహం తోడై అద్బుతాలు సాధిస్తామని కాషాయదళం ఆసక్తిగా చర్చించుకుంటుంది. -------
    1
    ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం బిజేపికి అడ్డాగా మారింది. కమలం వికాసానికి దిక్సూచిలా పరిణమించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుసగా రెండుసార్లు ఎంపిగా కరీంనగర్ నుంచి గెలువడమే కాకుండా తన సత్తా, బిజేపి బలం ఎంటో చూపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాకు మార్గదర్శిగా కరీంనగర్ ను నిలబెట్టారు. అంతర్గతంగా రాష్ట్ర బిజేపిలో విబేదాలు, గ్రూప్ రాజకీయాలు ఎన్ని ఉన్నా బండి సంజయ్ మాత్రం ఒంటి చెత్తో కరీంనగర్ ను బిజేపికి అడ్డాగా మార్చారు. రాష్ట్రంలోనే బిజేపి కైవసం చేసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలే కాదు బిజేపి పెద్దల దృ,ష్టిని ఆకర్శించారు. ఇక తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకున్నారు. బండి సంజయ్ అంటే పార్టీలో హాట్ టాఫిక్ గా మారారు.
ఉమ్మడి జిల్లాలో రెండు మున్సి పల్ కార్పోరేషన్ లు 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పోరేషన్ లో మినహా ఎక్కడ ఆశించిన ఫలితాలు బిజేపికి రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం 467 వార్డులు ఉండగా 90 వార్డులను బిజేపి కైవసం చేసుకుంది. అందులో వన్ థర్డ్ అంటే 30 వార్డులను కరీంనగర్ కార్పోరేషన్ లోనే గెలుచుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక పట్టణాలైన ధర్మపురి, మంథని మున్సిపాలిటీల్లో బిజేపి బోని కూడా చేయలేదు. ఇక రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కోక్క స్థానమే గెలుచుకుంది. మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను బిజేపి గెలుచుకున్నప్పటికి ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లభించక తృటిలో రెండు మున్సిపాలిటీలను బిజేపి కోల్పోయింది.  నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మొత్తం 27 స్థానాలను బిజేపి కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 55 వార్డులను బిజేపి గెలుచుకుంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐదుగురు ఇండిపెండెంట్లు బిజేపి లో చేరడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజేపి కార్పోరేటర్ లు కౌన్సిలర్ ల సంఖ్య 60కి చేరింది. 
నాటకీయ పరిణామాల నేపద్యంలో కరీంనగర్ కార్పోరేషన్ లో బిజేపి జెండా ఎగురవేసింది. 66 డివిజన్ లలో 30 గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజేపి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండడంతో బిజేపికి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ యత్నించాయి. కూటిమిగా ఏర్పడి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ కు మేయర్ పదవి కట్టబెట్టి బిఆర్ఎస్ డిప్యూటి మేయర్ పొందాలనే ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ వ్యూహం ముందు కూటమి ప్రయత్నాలు పటాపంచల్ అయ్యాయి. కాంగ్రెస్ కు మేయర్ పీఠం చేజారిపోయి  కషాయ దళానికి కార్పోరేషన్ దక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజేపికి కార్పోరేషన్ దక్కడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందట. కూటమి కట్టి కాంగ్రెస్, లేదా ఇండిపెండెంట్ ను మేయర్ ను చేస్తే అక్రమ కలయికను గ్రామగ్రామాన బండి సంజయ్ చాటి చెబుతాడని దీంతో రాబోయే ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బావించి, బండి సంజయ్ నోటికి బిఆర్ఎస్ బయపడిందటా. అందుకే మేయర్ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం వెనక్కి తగ్గినట్లు సమాచారం.
బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో బిజేపి విజయాల పరంపర కొనసాగుతుంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్ని తానై వ్యవహరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 121 గ్రామాల్లో బిజేపి మద్దతుదారులు సర్పంచ్ లుగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ చరిత్రలోనే బిజేపి ఓ మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. వికసిస్తున్న కమళంతో కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు బిజేపి లో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బిజేపి కి ఢోకా లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోనే కమలం వికసించక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.‌ రాబోయే రోజుల్లో కరీంనగర్ మార్క్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు బావిస్తున్నారు. బండి సంజయ్ సంకల్ప బలానికి దైవానుగ్రహం తోడై అద్బుతాలు సాధిస్తామని కాషాయదళం ఆసక్తిగా చర్చించుకుంటుంది.
-------
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    24 min ago
  • జనగాం జిల్లా బచ్చన్నపేట: మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ, ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రముఖ దేవాలయం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ మెట్లపై మోకాళ్ల మీద నడుస్తూ 100 కొబ్బరికాయలు కొట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. "జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించింది. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. బొడ్డు ప్రవీణ్ చేసిన ఈ వినూత్న కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనూ, భక్తుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అభిమానానికి ఇది అరుదైన ఉదాహరణగా నిలిచింది.
    2
    జనగాం జిల్లా బచ్చన్నపేట: మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ, ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రముఖ దేవాలయం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ మెట్లపై మోకాళ్ల మీద నడుస్తూ 100 కొబ్బరికాయలు కొట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. "జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించింది. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. బొడ్డు ప్రవీణ్ చేసిన ఈ వినూత్న కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనూ, భక్తుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అభిమానానికి ఇది అరుదైన ఉదాహరణగా నిలిచింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    59 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.