మహబూబాబాద్ జిల్లాలో విషాదం – ధరలు పడిపోవడంతో టమాటాలను ఉచితంగా పంపిణీ చేసిన రైతులు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం కేంద్రంలో శుక్రవారం విషాదకర పరిస్థితి నెలకొంది. వారంతపు సంత సందర్భంగా టమాట రైతులు భారీ మొత్తంలో తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉదయం నుంచే మార్కెట్‌కు తరలించిన టమాటాలకు ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. “ఫ్రీ… ఫ్రీ… టమాటాలు ఫ్రీ” అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతసేపు సంత ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు ధరల పతనం—ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం – ధరలు పడిపోవడంతో టమాటాలను ఉచితంగా పంపిణీ చేసిన రైతులు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం కేంద్రంలో శుక్రవారం విషాదకర పరిస్థితి నెలకొంది. వారంతపు సంత సందర్భంగా టమాట రైతులు భారీ మొత్తంలో తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉదయం నుంచే మార్కెట్‌కు తరలించిన టమాటాలకు ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. “ఫ్రీ… ఫ్రీ… టమాటాలు ఫ్రీ” అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతసేపు సంత ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు ధరల పతనం—ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
- నర్సంపేట పట్టణంలోని నర్సంపేట మున్సిపాలిటీకి నూతన చైర్మన్‌గా పెండెం శ్రీలక్ష్మి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం చైర్మన్ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమం వైస్ చైర్మన్ గంధం నరేందర్తో పాటు వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పూజల అనంతరం చైర్మన్ కుర్చీలో కూర్చున్న పెండెం శ్రీలక్ష్మి మాట్లాడుతూ, నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత మెరుగుదల, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, రహదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో నర్సంపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె పేర్కొన్నారు.3
- జనగాం జిల్లా బచ్చన్నపేట: మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ, ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రముఖ దేవాలయం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ మెట్లపై మోకాళ్ల మీద నడుస్తూ 100 కొబ్బరికాయలు కొట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. "జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించింది. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. బొడ్డు ప్రవీణ్ చేసిన ఈ వినూత్న కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనూ, భక్తుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అభిమానానికి ఇది అరుదైన ఉదాహరణగా నిలిచింది.2
- ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం బిజేపికి అడ్డాగా మారింది. కమలం వికాసానికి దిక్సూచిలా పరిణమించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుసగా రెండుసార్లు ఎంపిగా కరీంనగర్ నుంచి గెలువడమే కాకుండా తన సత్తా, బిజేపి బలం ఎంటో చూపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాకు మార్గదర్శిగా కరీంనగర్ ను నిలబెట్టారు. అంతర్గతంగా రాష్ట్ర బిజేపిలో విబేదాలు, గ్రూప్ రాజకీయాలు ఎన్ని ఉన్నా బండి సంజయ్ మాత్రం ఒంటి చెత్తో కరీంనగర్ ను బిజేపికి అడ్డాగా మార్చారు. రాష్ట్రంలోనే బిజేపి కైవసం చేసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలే కాదు బిజేపి పెద్దల దృ,ష్టిని ఆకర్శించారు. ఇక తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకున్నారు. బండి సంజయ్ అంటే పార్టీలో హాట్ టాఫిక్ గా మారారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సి పల్ కార్పోరేషన్ లు 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పోరేషన్ లో మినహా ఎక్కడ ఆశించిన ఫలితాలు బిజేపికి రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం 467 వార్డులు ఉండగా 90 వార్డులను బిజేపి కైవసం చేసుకుంది. అందులో వన్ థర్డ్ అంటే 30 వార్డులను కరీంనగర్ కార్పోరేషన్ లోనే గెలుచుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక పట్టణాలైన ధర్మపురి, మంథని మున్సిపాలిటీల్లో బిజేపి బోని కూడా చేయలేదు. ఇక రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కోక్క స్థానమే గెలుచుకుంది. మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను బిజేపి గెలుచుకున్నప్పటికి ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లభించక తృటిలో రెండు మున్సిపాలిటీలను బిజేపి కోల్పోయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మొత్తం 27 స్థానాలను బిజేపి కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 55 వార్డులను బిజేపి గెలుచుకుంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐదుగురు ఇండిపెండెంట్లు బిజేపి లో చేరడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజేపి కార్పోరేటర్ లు కౌన్సిలర్ ల సంఖ్య 60కి చేరింది. నాటకీయ పరిణామాల నేపద్యంలో కరీంనగర్ కార్పోరేషన్ లో బిజేపి జెండా ఎగురవేసింది. 66 డివిజన్ లలో 30 గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజేపి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండడంతో బిజేపికి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ యత్నించాయి. కూటిమిగా ఏర్పడి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ కు మేయర్ పదవి కట్టబెట్టి బిఆర్ఎస్ డిప్యూటి మేయర్ పొందాలనే ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ వ్యూహం ముందు కూటమి ప్రయత్నాలు పటాపంచల్ అయ్యాయి. కాంగ్రెస్ కు మేయర్ పీఠం చేజారిపోయి కషాయ దళానికి కార్పోరేషన్ దక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజేపికి కార్పోరేషన్ దక్కడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందట. కూటమి కట్టి కాంగ్రెస్, లేదా ఇండిపెండెంట్ ను మేయర్ ను చేస్తే అక్రమ కలయికను గ్రామగ్రామాన బండి సంజయ్ చాటి చెబుతాడని దీంతో రాబోయే ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బావించి, బండి సంజయ్ నోటికి బిఆర్ఎస్ బయపడిందటా. అందుకే మేయర్ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం వెనక్కి తగ్గినట్లు సమాచారం. బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో బిజేపి విజయాల పరంపర కొనసాగుతుంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్ని తానై వ్యవహరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 121 గ్రామాల్లో బిజేపి మద్దతుదారులు సర్పంచ్ లుగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ చరిత్రలోనే బిజేపి ఓ మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. వికసిస్తున్న కమళంతో కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు బిజేపి లో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బిజేపి కి ఢోకా లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోనే కమలం వికసించక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కరీంనగర్ మార్క్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు బావిస్తున్నారు. బండి సంజయ్ సంకల్ప బలానికి దైవానుగ్రహం తోడై అద్బుతాలు సాధిస్తామని కాషాయదళం ఆసక్తిగా చర్చించుకుంటుంది. -------1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.1
- అరుణోదయ సాంస్కృతిక సమైక్య 9వ మహాసభ సందర్భంగా అర్వపల్లి లో అరుణోదయ కళాకారుల కళారూపాలతో ర్యాలీ ప్రారంభమైంది. సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మహాసభలను అర్వపల్లిలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.2
- Post by Ravi Poreddy1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట పట్టణ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.2
- పోలీసులు మా ఎమ్మెల్యే కోవ లక్ష్మిని రెండు కిలోమీటర్ల దూరం ఆపేసి, మంత్రి వివేక్ కాన్వాయ్‌ని లోపలికి పంపించారు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను గేట్ వరకు వెళ్లడానికి నిరాకరించినప్పుడు, మంత్రి వివేక్ కాన్వాయ్‌ని ఎలా లోపలికి పంపిస్తారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? దీనిపై ప్రశ్నిస్తే మా శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్ళ దాడి చేశారు దాడి చేసింది వాళ్ళే.. కేసులు మా నాయకులపై పెట్టి జైలులో పెట్టారు అక్రమ కేసులు, అక్రమ అరెస్టుల వల్ల ప్రజా తీర్పును కాల రాయలేరు! - హరీష్ రావు1
- జనగామ జిల్లా కేంద్రంలో కాంచీపురం జీబీఆర్ షాపింగ్ మాల్‌ను సినీనటి శ్రీనిధి అగర్వాల్ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అభిమానులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనిధి అగర్వాల్ రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో ఆధునిక వసతులతో షాపింగ్ మాల్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.1