నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ బాధ్యతల స్వీకారం..... వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట పట్టణ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ బాధ్యతల స్వీకారం..... వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట పట్టణ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు
ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
- గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా టమాటాలు పంచిన రైతులు కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా రైతుల దుస్థితి శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్ కు తెచ్చిన రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంపిణీ చేసిన రైతులు కిలో టమాటా ధర రూ. 2 పలకడంతో టమాటాలను తీసుకొచ్చిన వాహనం కిరాయి ఖర్చు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆవేదన..1
- మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం కేంద్రంలో శుక్రవారం విషాదకర పరిస్థితి నెలకొంది. వారంతపు సంత సందర్భంగా టమాట రైతులు భారీ మొత్తంలో తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉదయం నుంచే మార్కెట్‌కు తరలించిన టమాటాలకు ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. “ఫ్రీ… ఫ్రీ… టమాటాలు ఫ్రీ” అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతసేపు సంత ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు ధరల పతనం—ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.1
- హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.1
- రైతు కష్టానికి ఫలితం దక్కలేదు. చెమటోడ్చి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఒక రైతు ఆవేదన చెందారు. టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక.. తన పంటను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్‌కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని గూడూర్ మండలం భూపతిపేట కు చెందిన రైతులు పోగుల కొండ సారయ్య, మోహన్,గుజ్జ సురేందర్ మూడు ఎకరాలలో టమాట పంట వేయగా మూడు లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను రోడ్డు పాలు చేయడం కంటే, తోటి ప్రజలకు పంచిపెడితే వారి ఆకలి తీరుతుందని భావించిన సదరు రైతులు.. దాదాపు 50 పెట్టెల నిండా టమాటాలను తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేశారు.1
- Post by Venkatgoud kallepu1
- కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం హనుమకొండ భవాని నగర్ లోని క్యాంపు కార్యాలయం నందు గీసుగొండ మండలం కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 27వ తేదీ(శుక్రవారం) రాత్రి 10.00 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నారు.2
- విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.1
- యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో యాప్ రద్దు చేయాలని రైతులు ఆగ్రహం యాప్ లో బుక్ చేసుకోవాలని అంటున్నారు.. నాకు చదువురాదు ఎలా బుక్ చేసుకోవాలి మాకు యూరియా ఇవ్వకుండా ఒక్క యూరియా బస్తా బయటకు పోయినా ఆత్మహత్య చేసుకుంటానని రైతు ఆవేదన1