జగిత్యాలలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసే ముఠా గుట్టురట్టు...లావోస్ దేశానికి యువతను తరలించి సైబర్ ఫ్రాడ్ కు పాల్పడే నలుగురు అరెస్ట్. విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.

- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టిన జిందం కళా చక్రపానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.1
- జనగాం జిల్లా బచ్చన్నపేట: మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ, ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రముఖ దేవాలయం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ మెట్లపై మోకాళ్ల మీద నడుస్తూ 100 కొబ్బరికాయలు కొట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. "జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించింది. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. బొడ్డు ప్రవీణ్ చేసిన ఈ వినూత్న కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనూ, భక్తుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అభిమానానికి ఇది అరుదైన ఉదాహరణగా నిలిచింది.2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.2
- గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా టమాటాలు పంచిన రైతులు కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా రైతుల దుస్థితి శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్ కు తెచ్చిన రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంపిణీ చేసిన రైతులు కిలో టమాటా ధర రూ. 2 పలకడంతో టమాటాలను తీసుకొచ్చిన వాహనం కిరాయి ఖర్చు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆవేదన..1
- మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం కేంద్రంలో శుక్రవారం విషాదకర పరిస్థితి నెలకొంది. వారంతపు సంత సందర్భంగా టమాట రైతులు భారీ మొత్తంలో తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉదయం నుంచే మార్కెట్‌కు తరలించిన టమాటాలకు ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. “ఫ్రీ… ఫ్రీ… టమాటాలు ఫ్రీ” అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతసేపు సంత ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు ధరల పతనం—ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.1
- _స్వతంత్రం పూర్వం నుంచే ఆర్మీ సైనికుల ప్రధాన రాకపోకల కేంద్రం – ఆధునీకరణపై ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బొల్లారం, స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యం కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా నిలిచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ప్రయాణికులకు షెల్టర్ షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, పారిశుద్ధ్య లోపాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.బొల్లారం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం తరహాలో అభివృద్ధి చేసి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లు అధిక రద్దీతో కంజెక్షన్‌కు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెర్మినల్స్ అవసరమని పేర్కొన్నారు.ఇటీవల చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో ఉత్తర హైదరాబాద్‌కు కీలకమైన బొల్లారం స్టేషన్‌ను కూడా టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను నగరంలోకి ప్రవేశించకుండా నిలిపేందుకు బొల్లారం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు.స్థానికుల డిమాండ్ మేరకు నిజామాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజీ కల్పించినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల స్టాపేజీల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రైల్వే గేట్లు లేని ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, మొత్తం 22 ఆర్ ఓ బిలు, ఆర్ యు బిలు నిర్మించేందుకు రూపకల్పన సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.3
- రైతు నుంచి 16500 రూపాయలు లంచం తీసుకుంటు పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్ ఏసీబీకి చిక్కారు. పుట్టపాక గ్రామానికి చెందిన రైతు కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోగా 35 వేల రూపాయలు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడగా 16500 డీల్ కుదిరింది. బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో 16500 రూపాయలు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ నేరుగా తీసుకోకుండా డాక్యుమెంట్ రైటర్ ఎండి రసీద్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసిబి అధికారులు రఘడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రషీద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ను అరెస్టు చేసి లంచం డబ్బులను సీజ్ చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రేపు కరీంనగర్ ఏసిబి కోర్టులో ఇద్దరిని హాజరుపరుస్తామని చెప్పారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందన్ కళా చక్రపాణి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.1
- జనగామ జిల్లా కేంద్రంలో కాంచీపురం జీబీఆర్ షాపింగ్ మాల్‌ను సినీనటి శ్రీనిధి అగర్వాల్ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అభిమానులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనిధి అగర్వాల్ రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో ఆధునిక వసతులతో షాపింగ్ మాల్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.1