logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చారిత్రక బొల్లారం రైల్వే స్టేషన్‌కు అమృత్ స్టేషన్ హోదా కల్పించాలి _స్వతంత్రం పూర్వం నుంచే ఆర్మీ సైనికుల ప్రధాన రాకపోకల కేంద్రం – ఆధునీకరణపై ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బొల్లారం, స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యం కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా నిలిచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ప్రయాణికులకు షెల్టర్ షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, పారిశుద్ధ్య లోపాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.బొల్లారం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం తరహాలో అభివృద్ధి చేసి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లు అధిక రద్దీతో కంజెక్షన్‌కు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెర్మినల్స్ అవసరమని పేర్కొన్నారు.ఇటీవల చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో ఉత్తర హైదరాబాద్‌కు కీలకమైన బొల్లారం స్టేషన్‌ను కూడా టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను నగరంలోకి ప్రవేశించకుండా నిలిపేందుకు బొల్లారం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు.స్థానికుల డిమాండ్ మేరకు నిజామాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజీ కల్పించినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల స్టాపేజీల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రైల్వే గేట్లు లేని ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, మొత్తం 22 ఆర్ ఓ బిలు, ఆర్ యు బిలు నిర్మించేందుకు రూపకల్పన సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.

2 hrs ago
user_Suresh Sagar
Suresh Sagar
కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
2 hrs ago
d24f2a29-44ce-4a57-8d68-f13d991ed520

చారిత్రక బొల్లారం రైల్వే స్టేషన్‌కు అమృత్ స్టేషన్ హోదా కల్పించాలి _స్వతంత్రం పూర్వం నుంచే ఆర్మీ సైనికుల ప్రధాన రాకపోకల కేంద్రం – ఆధునీకరణపై ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బొల్లారం, స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యం కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా నిలిచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ప్రయాణికులకు షెల్టర్ షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, పారిశుద్ధ్య లోపాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మౌలిక

1a8aede5-6298-49ad-bac2-336a012d4485

వసతులను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.బొల్లారం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం తరహాలో అభివృద్ధి చేసి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లు అధిక రద్దీతో కంజెక్షన్‌కు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెర్మినల్స్ అవసరమని పేర్కొన్నారు.ఇటీవల చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో ఉత్తర హైదరాబాద్‌కు కీలకమైన బొల్లారం స్టేషన్‌ను కూడా టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను నగరంలోకి ప్రవేశించకుండా

నిలిపేందుకు బొల్లారం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు.స్థానికుల డిమాండ్ మేరకు నిజామాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజీ కల్పించినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల స్టాపేజీల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రైల్వే గేట్లు లేని ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, మొత్తం 22 ఆర్ ఓ బిలు, ఆర్ యు బిలు నిర్మించేందుకు రూపకల్పన సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకుల ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుటకొరకు, దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కోరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు.విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం, దేశభక్తి, స్ఫూర్తిదాయకం పెరుగుతాయి.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వలన, ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టారు.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే సరేసరి, లేకపోతే రామంతాపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంధును కూడా చేపడతాం, ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం అన్నారు.
    1
    రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై  మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకుల ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుటకొరకు, దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కోరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు.విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం, దేశభక్తి, స్ఫూర్తిదాయకం పెరుగుతాయి.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వలన, ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టారు.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే సరేసరి, లేకపోతే రామంతాపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంధును కూడా చేపడతాం, ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం అన్నారు.
    user_Nitturi Ravi
    Nitturi Ravi
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • Orthopaedic doctors in Hyderabad, such as Dr. Anand Agroya (PACE Hospitals), Dr. Vijay Kumar Loya, and Dr. Sunil Dachepalli, specialize in treating musculoskeletal conditions, offering services like joint replacement, arthroscopy, and trauma management. Consultation fees typically range from ₹350 to ₹1000, with many specialists available in areas like Hitec City, Secunderabad, and
    1
    Orthopaedic doctors in Hyderabad, such as Dr. Anand Agroya (PACE Hospitals), Dr. Vijay Kumar Loya, and Dr. Sunil Dachepalli, specialize in treating musculoskeletal conditions, offering services like joint replacement, arthroscopy, and trauma management. Consultation fees typically range from ₹350 to ₹1000, with many specialists available in areas like Hitec City, Secunderabad, and
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    22 hrs ago
  • ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ... పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్స్ ... పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు... గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ... ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...
    4
    ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ...
పేలుడు శబ్దానికి పరుగులు తీసిన 
కస్టమర్స్ ...
పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు...
గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు 
విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ...
ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన
లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    17 hrs ago
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పందెం బండ లాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. శక్తివంతమైన ఒంగోలు గిత్తలు పందెం బండను లాగుతూ పరుగులు తీస్తూ ప్రేక్షకులను అలరించాయి. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. రైతుల సంప్రదాయ క్రీడలకు గ్రామంలో ప్రత్యేక ఆదరణ కనిపించింది.
    1
    రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పందెం బండ లాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. శక్తివంతమైన ఒంగోలు గిత్తలు పందెం బండను లాగుతూ పరుగులు తీస్తూ ప్రేక్షకులను అలరించాయి. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. రైతుల సంప్రదాయ క్రీడలకు గ్రామంలో ప్రత్యేక ఆదరణ కనిపించింది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • 'ది బిల్ ఈస్ పాస్డ్' (ఫిబ్రవరి 20, 2014) తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు. పార్లమెంట్‌లో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు పాసై నేటికి 12 ఏండ్లు..! జై తెలంగాణ... జై కేసీఆర్ SRK....
    1
    'ది బిల్ ఈస్ పాస్డ్' 
(ఫిబ్రవరి 20, 2014) 
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు.
పార్లమెంట్‌లో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు పాసై 
నేటికి 12 ఏండ్లు..!  
జై తెలంగాణ... జై కేసీఆర్
SRK....
    user_Akhil kumar
    Akhil kumar
    Farmer పూదూర్, వికారాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • geyser repair service centre in Hyderabad ASN tecno service centre Ramantapur Uppal Tarnaka Moulali Warisguda Sitaphalmandi Ramnagar Himayath Nagar Amberpet Golnaka DD Colony Durga Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar Amberpet
    1
    geyser repair service centre in Hyderabad ASN tecno service centre Ramantapur Uppal Tarnaka Moulali Warisguda Sitaphalmandi Ramnagar Himayath Nagar Amberpet Golnaka DD Colony Durga Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar Amberpet
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    22 hrs ago
  • కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండెద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సుందరాపురం, లేమామిడి, నిర్దవెళ్లి, బొదునంపల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీల్లో పాల్గొన్నారు.
    1
    కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండెద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సుందరాపురం, లేమామిడి, నిర్దవెళ్లి, బొదునంపల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీల్లో పాల్గొన్నారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి ---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కోల్చారం మండలం పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి 
---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 
పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు.
కోల్చారం మండలం  పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.
విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.
సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. 
తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. 
విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. 
ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.