పదవ తరగతి పరీక్షల్లో శ్రద్ధ శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించాలి కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి ---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కోల్చారం మండలం పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి పరీక్షల్లో శ్రద్ధ శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించాలి కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి ---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కోల్చారం మండలం పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి ---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కోల్చారం మండలం పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.1
- 📍హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు1
- _స్వతంత్రం పూర్వం నుంచే ఆర్మీ సైనికుల ప్రధాన రాకపోకల కేంద్రం – ఆధునీకరణపై ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బొల్లారం, స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యం కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా నిలిచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ప్రయాణికులకు షెల్టర్ షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, పారిశుద్ధ్య లోపాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.బొల్లారం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం తరహాలో అభివృద్ధి చేసి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లు అధిక రద్దీతో కంజెక్షన్‌కు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెర్మినల్స్ అవసరమని పేర్కొన్నారు.ఇటీవల చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో ఉత్తర హైదరాబాద్‌కు కీలకమైన బొల్లారం స్టేషన్‌ను కూడా టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను నగరంలోకి ప్రవేశించకుండా నిలిపేందుకు బొల్లారం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు.స్థానికుల డిమాండ్ మేరకు నిజామాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజీ కల్పించినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల స్టాపేజీల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రైల్వే గేట్లు లేని ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, మొత్తం 22 ఆర్ ఓ బిలు, ఆర్ యు బిలు నిర్మించేందుకు రూపకల్పన సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.3
- ఏఐ సమ్మిట్లో యంగెస్ట్ స్పీకర్, బాల మేధావి రణ్వీర్ సన్దేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రాచీన భారతీయ ఫిలాసఫీలను ఆధునిక టెక్నాలజీలకు తాను ఎలా అనుసంధానిస్తున్నాననే అంశంపై సదస్సులో మాట్లాడతానని చెప్పారు. 'మిగిలిన దేశాల AI మోడల్లను పరిశీలిస్తూ మన దేశం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో విశ్లేషిస్తా. తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ దేశ జీడీపీకి ఎలా దోహదపడుతుందో వివరిస్తా' అని పేర్కొన్నారు.1
- చట్నీస్ ఎల్బీనగర్ బ్రాంచ్‌లో వంటగదిలో ఉన్న ఇడ్లీ స్టిమర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. పేలుడు శబ్ధంతో హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని జోగేశ్వర్, దయ, సుమిత్, సునీల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్టిమర్‌లో ప్రెజర్ పెరగడంతోనే ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.వంటగదిలో భద్రతా ప్రమాణాలపై అధికారులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుక్కర్లో ఉండే ప్రెషర్ వల్ల పేలిందా షార్ట్ సర్క్యూ టైం అయిన కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా హైదరాబాద్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఇటు ఎలక్ట్రిక్ వస్తువులు కార్లు బైకులు ఫ్రిజ్లు టీవీలు పేలిపోతున్నాయి మరోవైపు వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హాస్టల్ ప్రభుత్వ కార్యాలయంలో కూడా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి దీనిపైన హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.1
- మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు రామాయంపేట మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి రామాయంపేట పట్టణం సంబంధించి బైపాస్ రోడ్డు ధర రామాయంపేట బయట నుండి నిర్మాణం చేయుటకు సర్వేలు కూడా పూర్తి చేశారు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో అనేకమంది రైతుల యొక్క సాగు చేయబడే భూములు కోల్పోతూ ఉన్నారు వీటి గురించి అనేకసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది ముఖ్యంగా హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము రోడ్డు వేయుటకు నిధులను మంజూరు చేస్తుంది ఈ రోడ్డుకు భూముల భూములు ఇచ్చే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది 13 లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం కానివ్వండి సెక్షన్ 26 కింద భూములు కోల్పోయిన రైతులకు అక్కడి మార్కెట్ రేటు ప్రకారము నూటికి నూరు శాతం డబ్బులు చెల్లించి మాత్రమే భూములు తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెర్ల పెడుతూ రైతులను బెదిరిస్తూ అధికార యంత్రాంగాన్ని మొహరించి ఈ బైపాస్ రోడ్డు గురించి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు కోల్పోతున్న భూములకు మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి తనకు పట్టనట్టు ఇది నేషనల్ హైవే కదా మాకు ఎటువంటి సంబంధం లేదు అని రైతుల దగ్గర మాటలు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఒకటి అడుగుతా ఉన్నాం నేషనల్ హైవే ఏసేటప్పుడు దానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది ఆ రోడ్డుకి కావలసిన భూములను సమీకరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు మర్చిపోయినట్టున్నారు నేను రైతులను ఒకటే కోరుతా ఉన్నాం మనకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే మాత్రమే ఈ బైపాస్ రోడ్డుకు అంగీకరిద్దాం లేనట్టయితే అడ్డుకుందామని చెప్పేసి కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు వెంటనే స్పందించాలే కలెక్టర్ తో మాట్లాడాలి కన్స అండ్ మినిస్టర్ తో మాట్లాడాలి ముఖ్యమంత్రితో మాట్లాడి రామాయంపేట రైతులకు 2013 చట్టం ప్రకారము 26వ సెక్షన్ ప్రకారము మా రైతులకు వెంటనే మార్కెట్ రేట్ ప్రకారము డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సరం నుండి కూడా ఈ బైపాస్ రోడ్డు వ్యవహారం నడుస్తున్న ఈ బైపాస్ రోడ్ నిర్మాణం ఆగిపోయిన రైతులు నెత్తునూరు మొత్తుకున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారు స్పందించకపోవడం చొరవ చూపకపోవడం కలెక్టర్ తో మాట్లాడకపోవడం సిగ్గుచేటు బాధాకరం ప్రజలకు అందరికీ తెలుసు కోల్పోతున్న రైతులకు కూడా తెలుసు ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి స్థానికంగా మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు వెంటనే స్థానిక రైతులకు నష్టపోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి నష్ట పరివారం ఇప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్టయితే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక ఎమ్మెల్యేని కూడా అడ్డుకుంటాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ రైతులు చాలా పేదవాళ్లు వ్యవసాయ భూములు కోల్పోవడం బాధాకరం అయినప్పటికీ రోడ్డు నిర్మాణానికి వారు సపోర్ట్ చేస్తున్న కనీసం వాళ్లకు పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారు కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ తో కూడా మాట్లాడి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ఈ రైతులకు మీరు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రామాయంపేట ప్రజలందరిని రోడ్డుమీదికి తీసుకువచ్చి నిలదీయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనుకాడదు భారతీయ జనతా పార్టీ దమ్మెందో కార్యకర్తల దమ్మెందో రామయంపేట ప్రజల దమ్మెందో మేము చూపిస్తాం మా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా వారు వెన్ను అంటూ ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం1