Shuru
Apke Nagar Ki App…
చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ 📍హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
Journalist Madhu
చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ 📍హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
More news from తెలంగాణ and nearby areas
- రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకుల ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుటకొరకు, దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కోరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు.విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం, దేశభక్తి, స్ఫూర్తిదాయకం పెరుగుతాయి.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వలన, ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టారు.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే సరేసరి, లేకపోతే రామంతాపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంధును కూడా చేపడతాం, ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం అన్నారు.1
- ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ... పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్స్ ... పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు... గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ... ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.2
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పందెం బండ లాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. శక్తివంతమైన ఒంగోలు గిత్తలు పందెం బండను లాగుతూ పరుగులు తీస్తూ ప్రేక్షకులను అలరించాయి. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. రైతుల సంప్రదాయ క్రీడలకు గ్రామంలో ప్రత్యేక ఆదరణ కనిపించింది.1
- 'ది బిల్ ఈస్ పాస్డ్' (ఫిబ్రవరి 20, 2014) తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు. పార్లమెంట్‌లో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు పాసై నేటికి 12 ఏండ్లు..! జై తెలంగాణ... జై కేసీఆర్ SRK....1
- మెదక్ లో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడోత్సవాలు. 2nd Edition CM Cup 2025. Softball రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియం నందు ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రంలోని 25 జిల్లాల నుండి విచ్చేసిన సుమారు 700 మంది క్రీడాకారులు క్రీడోత్సవాలలో పాల్గొనడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి మెదక్ జిల్లా శ్రీ రమేష్ గంగాల కార్యక్రమానికి సభాదుక్షత వహించారు. క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవనీయులు శ్రీ యం. నగేష్ గారు అడిషనల్ కలెక్టర్ మెదక్ జిల్లా గారు విచ్చేసి క్రీడోత్సవాలను ప్రారంభించడం జరిగింది. మరియు శ్రీ మహేందర్ గారు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్ జిల్లా గారు, శ్రీమతి విజయ గారు జిల్లా విద్యాధికారిని మెదక్ జిల్లా, శ్రీ రాజిరెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి మెదక్ జిల్లా, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి శ్రీ శోభన్ బాబు గారు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ నాగరాజు గారు,శ్రీ శ్రీనివాసరావు గారు,శ్రీ మాధవ రెడ్డి గారు,శ్రీ మధు సుధన్ గారు,శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ మధు గారు, శ్రీ శ్యాంసుందర్ గారు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండెద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సుందరాపురం, లేమామిడి, నిర్దవెళ్లి, బొదునంపల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీల్లో పాల్గొన్నారు.1
- పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి ---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కోల్చారం మండలం పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- నల్లగొండ జిల్లా: ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ మిర్యాలగూడ నందు... నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది నుండి మంజూరైన 14 లక్షల 71000 ల చెక్కులను పంపిణీ చేసిన..... *_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._* ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మాట్లాడుతూ...... అనారోగ్యం బారిన పడి, ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న పేదలు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి నుండి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో...... బిఆర్ఎస్ నాయకులు,రమావత్ రవికుమార్ నాయక్,చల్ల కోటేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ జలీల్,కృష్ణ నాయక్,లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.1