logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన జిందం కళా చక్రపాణి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందన్ కళా చక్రపాణి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.

6 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
6 hrs ago

సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన జిందం కళా చక్రపాణి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందన్ కళా చక్రపాణి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం బిజేపికి అడ్డాగా మారింది. కమలం వికాసానికి దిక్సూచిలా పరిణమించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుసగా రెండుసార్లు ఎంపిగా కరీంనగర్ నుంచి గెలువడమే కాకుండా తన సత్తా, బిజేపి బలం ఎంటో చూపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాకు మార్గదర్శిగా కరీంనగర్ ను నిలబెట్టారు. అంతర్గతంగా రాష్ట్ర బిజేపిలో విబేదాలు, గ్రూప్ రాజకీయాలు ఎన్ని ఉన్నా బండి సంజయ్ మాత్రం ఒంటి చెత్తో కరీంనగర్ ను బిజేపికి అడ్డాగా మార్చారు. రాష్ట్రంలోనే బిజేపి కైవసం చేసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలే కాదు బిజేపి పెద్దల దృ,ష్టిని ఆకర్శించారు. ఇక తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకున్నారు. బండి సంజయ్ అంటే పార్టీలో హాట్ టాఫిక్ గా మారారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సి పల్ కార్పోరేషన్ లు 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పోరేషన్ లో మినహా ఎక్కడ ఆశించిన ఫలితాలు బిజేపికి రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం 467 వార్డులు ఉండగా 90 వార్డులను బిజేపి కైవసం చేసుకుంది. అందులో వన్ థర్డ్ అంటే 30 వార్డులను కరీంనగర్ కార్పోరేషన్ లోనే గెలుచుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక పట్టణాలైన ధర్మపురి, మంథని మున్సిపాలిటీల్లో బిజేపి బోని కూడా చేయలేదు. ఇక రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కోక్క స్థానమే గెలుచుకుంది. మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను బిజేపి గెలుచుకున్నప్పటికి ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లభించక తృటిలో రెండు మున్సిపాలిటీలను బిజేపి కోల్పోయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మొత్తం 27 స్థానాలను బిజేపి కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 55 వార్డులను బిజేపి గెలుచుకుంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐదుగురు ఇండిపెండెంట్లు బిజేపి లో చేరడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజేపి కార్పోరేటర్ లు కౌన్సిలర్ ల సంఖ్య 60కి చేరింది. నాటకీయ పరిణామాల నేపద్యంలో కరీంనగర్ కార్పోరేషన్ లో బిజేపి జెండా ఎగురవేసింది. 66 డివిజన్ లలో 30 గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజేపి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండడంతో బిజేపికి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ యత్నించాయి. కూటిమిగా ఏర్పడి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ కు మేయర్ పదవి కట్టబెట్టి బిఆర్ఎస్ డిప్యూటి మేయర్ పొందాలనే ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ వ్యూహం ముందు కూటమి ప్రయత్నాలు పటాపంచల్ అయ్యాయి. కాంగ్రెస్ కు మేయర్ పీఠం చేజారిపోయి కషాయ దళానికి కార్పోరేషన్ దక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజేపికి కార్పోరేషన్ దక్కడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందట. కూటమి కట్టి కాంగ్రెస్, లేదా ఇండిపెండెంట్ ను మేయర్ ను చేస్తే అక్రమ కలయికను గ్రామగ్రామాన బండి సంజయ్ చాటి చెబుతాడని దీంతో రాబోయే ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బావించి, బండి సంజయ్ నోటికి బిఆర్ఎస్ బయపడిందటా. అందుకే మేయర్ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం వెనక్కి తగ్గినట్లు సమాచారం. బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో బిజేపి విజయాల పరంపర కొనసాగుతుంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్ని తానై వ్యవహరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 121 గ్రామాల్లో బిజేపి మద్దతుదారులు సర్పంచ్ లుగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ చరిత్రలోనే బిజేపి ఓ మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. వికసిస్తున్న కమళంతో కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు బిజేపి లో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బిజేపి కి ఢోకా లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోనే కమలం వికసించక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.‌ రాబోయే రోజుల్లో కరీంనగర్ మార్క్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు బావిస్తున్నారు. బండి సంజయ్ సంకల్ప బలానికి దైవానుగ్రహం తోడై అద్బుతాలు సాధిస్తామని కాషాయదళం ఆసక్తిగా చర్చించుకుంటుంది. -------
    1
    ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం బిజేపికి అడ్డాగా మారింది. కమలం వికాసానికి దిక్సూచిలా పరిణమించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుసగా రెండుసార్లు ఎంపిగా కరీంనగర్ నుంచి గెలువడమే కాకుండా తన సత్తా, బిజేపి బలం ఎంటో చూపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాకు మార్గదర్శిగా కరీంనగర్ ను నిలబెట్టారు. అంతర్గతంగా రాష్ట్ర బిజేపిలో విబేదాలు, గ్రూప్ రాజకీయాలు ఎన్ని ఉన్నా బండి సంజయ్ మాత్రం ఒంటి చెత్తో కరీంనగర్ ను బిజేపికి అడ్డాగా మార్చారు. రాష్ట్రంలోనే బిజేపి కైవసం చేసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలే కాదు బిజేపి పెద్దల దృ,ష్టిని ఆకర్శించారు. ఇక తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకున్నారు. బండి సంజయ్ అంటే పార్టీలో హాట్ టాఫిక్ గా మారారు.
ఉమ్మడి జిల్లాలో రెండు మున్సి పల్ కార్పోరేషన్ లు 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పోరేషన్ లో మినహా ఎక్కడ ఆశించిన ఫలితాలు బిజేపికి రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం 467 వార్డులు ఉండగా 90 వార్డులను బిజేపి కైవసం చేసుకుంది. అందులో వన్ థర్డ్ అంటే 30 వార్డులను కరీంనగర్ కార్పోరేషన్ లోనే గెలుచుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక పట్టణాలైన ధర్మపురి, మంథని మున్సిపాలిటీల్లో బిజేపి బోని కూడా చేయలేదు. ఇక రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కోక్క స్థానమే గెలుచుకుంది. మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను బిజేపి గెలుచుకున్నప్పటికి ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లభించక తృటిలో రెండు మున్సిపాలిటీలను బిజేపి కోల్పోయింది.  నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మొత్తం 27 స్థానాలను బిజేపి కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 55 వార్డులను బిజేపి గెలుచుకుంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐదుగురు ఇండిపెండెంట్లు బిజేపి లో చేరడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజేపి కార్పోరేటర్ లు కౌన్సిలర్ ల సంఖ్య 60కి చేరింది. 
నాటకీయ పరిణామాల నేపద్యంలో కరీంనగర్ కార్పోరేషన్ లో బిజేపి జెండా ఎగురవేసింది. 66 డివిజన్ లలో 30 గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజేపి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండడంతో బిజేపికి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ యత్నించాయి. కూటిమిగా ఏర్పడి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ కు మేయర్ పదవి కట్టబెట్టి బిఆర్ఎస్ డిప్యూటి మేయర్ పొందాలనే ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ వ్యూహం ముందు కూటమి ప్రయత్నాలు పటాపంచల్ అయ్యాయి. కాంగ్రెస్ కు మేయర్ పీఠం చేజారిపోయి  కషాయ దళానికి కార్పోరేషన్ దక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజేపికి కార్పోరేషన్ దక్కడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందట. కూటమి కట్టి కాంగ్రెస్, లేదా ఇండిపెండెంట్ ను మేయర్ ను చేస్తే అక్రమ కలయికను గ్రామగ్రామాన బండి సంజయ్ చాటి చెబుతాడని దీంతో రాబోయే ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బావించి, బండి సంజయ్ నోటికి బిఆర్ఎస్ బయపడిందటా. అందుకే మేయర్ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం వెనక్కి తగ్గినట్లు సమాచారం.
బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో బిజేపి విజయాల పరంపర కొనసాగుతుంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్ని తానై వ్యవహరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 121 గ్రామాల్లో బిజేపి మద్దతుదారులు సర్పంచ్ లుగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ చరిత్రలోనే బిజేపి ఓ మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. వికసిస్తున్న కమళంతో కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు బిజేపి లో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బిజేపి కి ఢోకా లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోనే కమలం వికసించక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.‌ రాబోయే రోజుల్లో కరీంనగర్ మార్క్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు బావిస్తున్నారు. బండి సంజయ్ సంకల్ప బలానికి దైవానుగ్రహం తోడై అద్బుతాలు సాధిస్తామని కాషాయదళం ఆసక్తిగా చర్చించుకుంటుంది.
-------
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి ---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కోల్చారం మండలం పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి 
---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 
పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు.
కోల్చారం మండలం  పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.
విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.
సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. 
తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. 
విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. 
ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం హనుమకొండ భవాని నగర్ లోని క్యాంపు కార్యాలయం నందు గీసుగొండ మండలం కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 27వ తేదీ(శుక్రవారం) రాత్రి 10.00 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నారు.
    2
    కొమ్మాల శ్రీశ్రీశ్రీ  లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను  ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి 
గురువారం హనుమకొండ భవాని నగర్ లోని క్యాంపు కార్యాలయం నందు గీసుగొండ మండలం కొమ్మాల శ్రీశ్రీశ్రీ  లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి  23వ తేదీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 27వ తేదీ(శుక్రవారం) రాత్రి 10.00 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    15 hrs ago
  • 📍హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
    1
    📍హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ 
పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు
ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు 
పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం 
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
    user_Journalist Madhu
    Journalist Madhu
    Financial Analyst కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • _స్వతంత్రం పూర్వం నుంచే ఆర్మీ సైనికుల ప్రధాన రాకపోకల కేంద్రం – ఆధునీకరణపై ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బొల్లారం, స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యం కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా నిలిచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ప్రయాణికులకు షెల్టర్ షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, పారిశుద్ధ్య లోపాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.బొల్లారం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం తరహాలో అభివృద్ధి చేసి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లు అధిక రద్దీతో కంజెక్షన్‌కు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెర్మినల్స్ అవసరమని పేర్కొన్నారు.ఇటీవల చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో ఉత్తర హైదరాబాద్‌కు కీలకమైన బొల్లారం స్టేషన్‌ను కూడా టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను నగరంలోకి ప్రవేశించకుండా నిలిపేందుకు బొల్లారం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు.స్థానికుల డిమాండ్ మేరకు నిజామాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజీ కల్పించినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల స్టాపేజీల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రైల్వే గేట్లు లేని ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, మొత్తం 22 ఆర్ ఓ బిలు, ఆర్ యు బిలు నిర్మించేందుకు రూపకల్పన సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.
    3
    _స్వతంత్రం పూర్వం నుంచే ఆర్మీ సైనికుల ప్రధాన రాకపోకల కేంద్రం 
– ఆధునీకరణపై ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
బొల్లారం, స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యం కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా నిలిచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ప్రయాణికులకు షెల్టర్ షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, పారిశుద్ధ్య లోపాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.బొల్లారం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం తరహాలో అభివృద్ధి చేసి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లు అధిక రద్దీతో కంజెక్షన్‌కు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెర్మినల్స్ అవసరమని పేర్కొన్నారు.ఇటీవల చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో ఉత్తర హైదరాబాద్‌కు కీలకమైన బొల్లారం స్టేషన్‌ను కూడా టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను నగరంలోకి ప్రవేశించకుండా నిలిపేందుకు బొల్లారం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు.స్థానికుల డిమాండ్ మేరకు నిజామాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజీ కల్పించినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల స్టాపేజీల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రైల్వే గేట్లు లేని ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, మొత్తం 22 ఆర్ ఓ బిలు, ఆర్ యు బిలు నిర్మించేందుకు రూపకల్పన సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.
    1
    హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందన్ కళా చక్రపాణి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందన్ కళా చక్రపాణి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • రైతు నుంచి 16500 రూపాయలు లంచం తీసుకుంటు పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్ ఏసీబీకి చిక్కారు. పుట్టపాక గ్రామానికి చెందిన రైతు కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోగా 35 వేల రూపాయలు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడగా 16500 డీల్ కుదిరింది. బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో 16500 రూపాయలు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ నేరుగా తీసుకోకుండా డాక్యుమెంట్ రైటర్ ఎండి రసీద్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసిబి అధికారులు రఘడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రషీద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ను అరెస్టు చేసి లంచం డబ్బులను సీజ్ చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రేపు కరీంనగర్ ఏసిబి కోర్టులో ఇద్దరిని హాజరుపరుస్తామని చెప్పారు.
    2
    రైతు నుంచి 16500 రూపాయలు లంచం తీసుకుంటు పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్ ఏసీబీకి చిక్కారు. పుట్టపాక గ్రామానికి చెందిన రైతు కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోగా 35 వేల రూపాయలు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడగా 16500 డీల్ కుదిరింది. బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో 16500 రూపాయలు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ నేరుగా తీసుకోకుండా 
డాక్యుమెంట్ రైటర్ ఎండి రసీద్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసిబి అధికారులు రఘడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రషీద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ను అరెస్టు చేసి లంచం డబ్బులను సీజ్ చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రేపు కరీంనగర్ ఏసిబి కోర్టులో ఇద్దరిని హాజరుపరుస్తామని చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు రామాయంపేట మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి రామాయంపేట పట్టణం సంబంధించి బైపాస్ రోడ్డు ధర రామాయంపేట బయట నుండి నిర్మాణం చేయుటకు సర్వేలు కూడా పూర్తి చేశారు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో అనేకమంది రైతుల యొక్క సాగు చేయబడే భూములు కోల్పోతూ ఉన్నారు వీటి గురించి అనేకసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది ముఖ్యంగా హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము రోడ్డు వేయుటకు నిధులను మంజూరు చేస్తుంది ఈ రోడ్డుకు భూముల భూములు ఇచ్చే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది 13 లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం కానివ్వండి సెక్షన్ 26 కింద భూములు కోల్పోయిన రైతులకు అక్కడి మార్కెట్ రేటు ప్రకారము నూటికి నూరు శాతం డబ్బులు చెల్లించి మాత్రమే భూములు తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెర్ల పెడుతూ రైతులను బెదిరిస్తూ అధికార యంత్రాంగాన్ని మొహరించి ఈ బైపాస్ రోడ్డు గురించి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు కోల్పోతున్న భూములకు మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి తనకు పట్టనట్టు ఇది నేషనల్ హైవే కదా మాకు ఎటువంటి సంబంధం లేదు అని రైతుల దగ్గర మాటలు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఒకటి అడుగుతా ఉన్నాం నేషనల్ హైవే ఏసేటప్పుడు దానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది ఆ రోడ్డుకి కావలసిన భూములను సమీకరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు మర్చిపోయినట్టున్నారు నేను రైతులను ఒకటే కోరుతా ఉన్నాం మనకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే మాత్రమే ఈ బైపాస్ రోడ్డుకు అంగీకరిద్దాం లేనట్టయితే అడ్డుకుందామని చెప్పేసి కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు వెంటనే స్పందించాలే కలెక్టర్ తో మాట్లాడాలి కన్స అండ్ మినిస్టర్ తో మాట్లాడాలి ముఖ్యమంత్రితో మాట్లాడి రామాయంపేట రైతులకు 2013 చట్టం ప్రకారము 26వ సెక్షన్ ప్రకారము మా రైతులకు వెంటనే మార్కెట్ రేట్ ప్రకారము డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సరం నుండి కూడా ఈ బైపాస్ రోడ్డు వ్యవహారం నడుస్తున్న ఈ బైపాస్ రోడ్ నిర్మాణం ఆగిపోయిన రైతులు నెత్తునూరు మొత్తుకున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారు స్పందించకపోవడం చొరవ చూపకపోవడం కలెక్టర్ తో మాట్లాడకపోవడం సిగ్గుచేటు బాధాకరం ప్రజలకు అందరికీ తెలుసు కోల్పోతున్న రైతులకు కూడా తెలుసు ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి స్థానికంగా మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు వెంటనే స్థానిక రైతులకు నష్టపోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి నష్ట పరివారం ఇప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్టయితే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక ఎమ్మెల్యేని కూడా అడ్డుకుంటాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ రైతులు చాలా పేదవాళ్లు వ్యవసాయ భూములు కోల్పోవడం బాధాకరం అయినప్పటికీ రోడ్డు నిర్మాణానికి వారు సపోర్ట్ చేస్తున్న కనీసం వాళ్లకు పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారు కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ తో కూడా మాట్లాడి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ఈ రైతులకు మీరు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రామాయంపేట ప్రజలందరిని రోడ్డుమీదికి తీసుకువచ్చి నిలదీయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనుకాడదు భారతీయ జనతా పార్టీ దమ్మెందో కార్యకర్తల దమ్మెందో రామయంపేట ప్రజల దమ్మెందో మేము చూపిస్తాం మా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా వారు వెన్ను అంటూ ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం
    1
    మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు రామాయంపేట మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి రామాయంపేట పట్టణం సంబంధించి బైపాస్ రోడ్డు ధర రామాయంపేట బయట నుండి నిర్మాణం చేయుటకు సర్వేలు కూడా పూర్తి చేశారు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో అనేకమంది రైతుల యొక్క సాగు చేయబడే భూములు కోల్పోతూ ఉన్నారు వీటి గురించి అనేకసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది ముఖ్యంగా హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము రోడ్డు వేయుటకు నిధులను మంజూరు చేస్తుంది ఈ రోడ్డుకు భూముల భూములు ఇచ్చే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది 13 లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం కానివ్వండి సెక్షన్ 26 కింద భూములు కోల్పోయిన రైతులకు అక్కడి మార్కెట్ రేటు ప్రకారము నూటికి నూరు శాతం డబ్బులు చెల్లించి మాత్రమే భూములు తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెర్ల పెడుతూ రైతులను బెదిరిస్తూ అధికార యంత్రాంగాన్ని మొహరించి ఈ బైపాస్ రోడ్డు గురించి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు కోల్పోతున్న భూములకు మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి తనకు పట్టనట్టు ఇది నేషనల్ హైవే కదా మాకు ఎటువంటి సంబంధం లేదు అని రైతుల దగ్గర మాటలు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఒకటి అడుగుతా ఉన్నాం నేషనల్ హైవే ఏసేటప్పుడు దానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది ఆ రోడ్డుకి కావలసిన భూములను సమీకరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు మర్చిపోయినట్టున్నారు నేను రైతులను ఒకటే కోరుతా ఉన్నాం మనకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే మాత్రమే ఈ బైపాస్ రోడ్డుకు అంగీకరిద్దాం లేనట్టయితే అడ్డుకుందామని చెప్పేసి కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు వెంటనే స్పందించాలే కలెక్టర్ తో మాట్లాడాలి కన్స అండ్ మినిస్టర్ తో మాట్లాడాలి ముఖ్యమంత్రితో మాట్లాడి రామాయంపేట రైతులకు 2013 చట్టం ప్రకారము 26వ సెక్షన్ ప్రకారము మా రైతులకు వెంటనే మార్కెట్ రేట్ ప్రకారము డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సరం నుండి కూడా ఈ బైపాస్ రోడ్డు వ్యవహారం నడుస్తున్న ఈ బైపాస్ రోడ్ నిర్మాణం ఆగిపోయిన రైతులు నెత్తునూరు మొత్తుకున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారు స్పందించకపోవడం చొరవ చూపకపోవడం కలెక్టర్ తో మాట్లాడకపోవడం సిగ్గుచేటు బాధాకరం ప్రజలకు అందరికీ తెలుసు కోల్పోతున్న రైతులకు కూడా తెలుసు ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి స్థానికంగా మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు వెంటనే స్థానిక రైతులకు నష్టపోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి నష్ట పరివారం ఇప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్టయితే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక ఎమ్మెల్యేని కూడా అడ్డుకుంటాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ రైతులు చాలా పేదవాళ్లు వ్యవసాయ భూములు కోల్పోవడం బాధాకరం అయినప్పటికీ రోడ్డు నిర్మాణానికి వారు సపోర్ట్ చేస్తున్న కనీసం వాళ్లకు పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారు కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ తో కూడా మాట్లాడి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ఈ రైతులకు మీరు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రామాయంపేట ప్రజలందరిని రోడ్డుమీదికి తీసుకువచ్చి నిలదీయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనుకాడదు భారతీయ జనతా పార్టీ దమ్మెందో కార్యకర్తల దమ్మెందో రామయంపేట ప్రజల దమ్మెందో మేము చూపిస్తాం మా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా వారు వెన్ను అంటూ ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.