Shuru
Apke Nagar Ki App…
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి కి శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టిన జిందం కళా చక్రపానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Satheesh gangu
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి కి శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టిన జిందం కళా చక్రపానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.1
- విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.1
- మెదక్ లో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడోత్సవాలు. 2nd Edition CM Cup 2025. Softball రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియం నందు ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రంలోని 25 జిల్లాల నుండి విచ్చేసిన సుమారు 700 మంది క్రీడాకారులు క్రీడోత్సవాలలో పాల్గొనడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి మెదక్ జిల్లా శ్రీ రమేష్ గంగాల కార్యక్రమానికి సభాదుక్షత వహించారు. క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవనీయులు శ్రీ యం. నగేష్ గారు అడిషనల్ కలెక్టర్ మెదక్ జిల్లా గారు విచ్చేసి క్రీడోత్సవాలను ప్రారంభించడం జరిగింది. మరియు శ్రీ మహేందర్ గారు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్ జిల్లా గారు, శ్రీమతి విజయ గారు జిల్లా విద్యాధికారిని మెదక్ జిల్లా, శ్రీ రాజిరెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి మెదక్ జిల్లా, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి శ్రీ శోభన్ బాబు గారు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ నాగరాజు గారు,శ్రీ శ్రీనివాసరావు గారు,శ్రీ మాధవ రెడ్డి గారు,శ్రీ మధు సుధన్ గారు,శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ మధు గారు, శ్రీ శ్యాంసుందర్ గారు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.2
- Post by Ravi Poreddy1
- Post by Venkatgoud kallepu1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టిన జిందం కళా చక్రపానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.1