Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరణ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరణ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.1
- విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.1
- Post by Ravi Poreddy1
- కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం హనుమకొండ భవాని నగర్ లోని క్యాంపు కార్యాలయం నందు గీసుగొండ మండలం కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 27వ తేదీ(శుక్రవారం) రాత్రి 10.00 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నారు.2
- Post by Venkatgoud kallepu1
- హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.1
- ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం బిజేపికి అడ్డాగా మారింది. కమలం వికాసానికి దిక్సూచిలా పరిణమించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుసగా రెండుసార్లు ఎంపిగా కరీంనగర్ నుంచి గెలువడమే కాకుండా తన సత్తా, బిజేపి బలం ఎంటో చూపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాకు మార్గదర్శిగా కరీంనగర్ ను నిలబెట్టారు. అంతర్గతంగా రాష్ట్ర బిజేపిలో విబేదాలు, గ్రూప్ రాజకీయాలు ఎన్ని ఉన్నా బండి సంజయ్ మాత్రం ఒంటి చెత్తో కరీంనగర్ ను బిజేపికి అడ్డాగా మార్చారు. రాష్ట్రంలోనే బిజేపి కైవసం చేసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలే కాదు బిజేపి పెద్దల దృ,ష్టిని ఆకర్శించారు. ఇక తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకున్నారు. బండి సంజయ్ అంటే పార్టీలో హాట్ టాఫిక్ గా మారారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సి పల్ కార్పోరేషన్ లు 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పోరేషన్ లో మినహా ఎక్కడ ఆశించిన ఫలితాలు బిజేపికి రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం 467 వార్డులు ఉండగా 90 వార్డులను బిజేపి కైవసం చేసుకుంది. అందులో వన్ థర్డ్ అంటే 30 వార్డులను కరీంనగర్ కార్పోరేషన్ లోనే గెలుచుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక పట్టణాలైన ధర్మపురి, మంథని మున్సిపాలిటీల్లో బిజేపి బోని కూడా చేయలేదు. ఇక రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కోక్క స్థానమే గెలుచుకుంది. మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను బిజేపి గెలుచుకున్నప్పటికి ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లభించక తృటిలో రెండు మున్సిపాలిటీలను బిజేపి కోల్పోయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మొత్తం 27 స్థానాలను బిజేపి కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 55 వార్డులను బిజేపి గెలుచుకుంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐదుగురు ఇండిపెండెంట్లు బిజేపి లో చేరడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజేపి కార్పోరేటర్ లు కౌన్సిలర్ ల సంఖ్య 60కి చేరింది. నాటకీయ పరిణామాల నేపద్యంలో కరీంనగర్ కార్పోరేషన్ లో బిజేపి జెండా ఎగురవేసింది. 66 డివిజన్ లలో 30 గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజేపి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండడంతో బిజేపికి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ యత్నించాయి. కూటిమిగా ఏర్పడి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ కు మేయర్ పదవి కట్టబెట్టి బిఆర్ఎస్ డిప్యూటి మేయర్ పొందాలనే ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ వ్యూహం ముందు కూటమి ప్రయత్నాలు పటాపంచల్ అయ్యాయి. కాంగ్రెస్ కు మేయర్ పీఠం చేజారిపోయి కషాయ దళానికి కార్పోరేషన్ దక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజేపికి కార్పోరేషన్ దక్కడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందట. కూటమి కట్టి కాంగ్రెస్, లేదా ఇండిపెండెంట్ ను మేయర్ ను చేస్తే అక్రమ కలయికను గ్రామగ్రామాన బండి సంజయ్ చాటి చెబుతాడని దీంతో రాబోయే ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బావించి, బండి సంజయ్ నోటికి బిఆర్ఎస్ బయపడిందటా. అందుకే మేయర్ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం వెనక్కి తగ్గినట్లు సమాచారం. బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో బిజేపి విజయాల పరంపర కొనసాగుతుంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్ని తానై వ్యవహరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 121 గ్రామాల్లో బిజేపి మద్దతుదారులు సర్పంచ్ లుగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ చరిత్రలోనే బిజేపి ఓ మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. వికసిస్తున్న కమళంతో కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు బిజేపి లో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బిజేపి కి ఢోకా లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోనే కమలం వికసించక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కరీంనగర్ మార్క్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు బావిస్తున్నారు. బండి సంజయ్ సంకల్ప బలానికి దైవానుగ్రహం తోడై అద్బుతాలు సాధిస్తామని కాషాయదళం ఆసక్తిగా చర్చించుకుంటుంది. -------1