విఠ్యాల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్* *హెడ్మాస్టర్ 'రవి' పై విద్యాశాఖ చర్యలు!* *స్వయంగా విచారణ జరిపిన విద్యాశాఖ డైరెక్టర్* *విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు* షాద్ నగర్: తమ భవిష్యత్తు కోసం గ్రామ విద్యార్థులు చేసిన పోరాటం ఫలించింది. పాఠశాలకు సక్రమంగా రాకుండా, విద్యార్థుల చదువులను నిర్లక్ష్యం చేస్తున్న విఠ్యాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రవిపై విద్యాశాఖ వేటు వేసింది. విద్యార్థులు మరియు గ్రామస్తుల ఆందోళనతో కదిలిన యంత్రాంగం, తక్షణమే విచారణ చేపట్టి సదరు హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫరూక్ నగర్ మండలం విఠ్యాల గ్రామంలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ బోధించే టీచర్ వ్యవహారంపై నిన్న విద్యార్థులు పాఠశాలకు తాళం వేసిన సంగతి విధితమే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు. తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ మరియు కమిషనర్ నవీన్ నికోలస్, జిల్లా విద్యాశాఖాధికారి సుసింధర్ రావు, ఫరూక్ నగర్ ఎంఈఓ మనోహర్ కలిసి బుధవారం విఠ్యాల ఉన్నత పాఠశాలను సందర్శించారు. అధికారుల బృందం విద్యార్థులతో, గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి వాస్తవాలను తెలుసుకున్నారు. *విచారణలో వెలుగుచూసిన హెచ్‌ఎం 'రవి' లీలలు* అధికారులు జరిపిన ఎంక్వైరీలో ప్రధానోపాధ్యాయుడు రవి గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విద్యార్థుల వద్ద చేసిన డబ్బుల వసూళ్ల పర్వం వెలుగు చూసింది. స్కూల్లో ఒక్కో విద్యార్థి నుండి అకారణంగా 300 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు అధికారుల ఎదుట సాక్ష్యం చెప్పారు. దీనికి తోడు విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన గ్రామస్తులతో, తల్లిదండ్రులతో కనీస మర్యాద లేకుండా ప్రవర్తించేవారని గ్రామస్తులు స్వయంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గత కొంత కాలంగా విధులకు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు చెప్పకుండా, కేవలం ఆఫీసు పనుల పేరుతో నెలల తరబడి స్కూలుకు రాకుండా ముఖం చాటేసినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా విద్యార్థులపై దౌర్జన్యం చేస్తూ పాఠాలు అడిగిన విద్యార్థులపై కూడా దురుసుగా వ్యవహరించేవాడని ఎంక్వైరీలో స్పష్టమైంది. *తక్షణమే సస్పెన్షన్ వేటు!* అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసిన అధికారులు, హెచ్‌ఎం రవి విధి నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని నిర్ధారించారు. అక్రమ వసూళ్లు, నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులు నిజమని తేలడంతో.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎం రవిని ఉన్న ఫలంగా సస్పెండ్ చేస్తున్నట్లు కమిషనర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. *ఆనందంలో విద్యార్థులు..* తమ గోడును విన్నందుకు మరియు తక్షణమే స్పందించినందుకు విద్యార్థులు, గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. "మాకు చదువు చెప్పే మంచి టీచర్లను పంపి, పదో తరగతి పరీక్షల్లో మేము పాస్ అయ్యేలా చూడాలి" అని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కొత్త ఆంగ్ల టీచర్ గా అమరేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..

- టీమిండియా తదుపరి కెప్టెన్ సంజూ శాంసన్? మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు! టీ20 ప్రపంచకప్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం తర్వాత, జట్టు భవిష్యత్తు నాయకత్వంపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. వార్తలోని ముఖ్యాంశాలు: కైఫ్ జోస్యం: సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 జట్టుకు నాయకత్వం వహించే అన్ని అర్హతలు సంజూ శాంసన్‌కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌లో వీరవిహారం: ఈ మెగా టోర్నీలో సంజూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించారు. కీలక ఇన్నింగ్స్: సెమీ ఫైనల్ మరియు ఫైనల్ వంటి హై-ప్రెషర్ మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. నమ్మకమైన ఆటగాడు: సంజూ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.1
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.1
- వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) రిజిస్ట్రార్ గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్.విజయలక్ష్మి గారిని యూనివర్సిటీ దర్బార్ హాలులో ఉన్న వారి ఛాంబర్ లో కలిసి పూలబోకే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నాయకులు జాతీయ అధ్యక్షులు డా.సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కొమ్ము శేఖర్ మాదిగ,రాష్ట్ర సీనియర్ నాయకులు వీరపాకుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,ఓయూ ఉపాధ్యక్షులు కోల హరీష్ మాదిగ, ఓయూ నాయకులు కనకపూడి మహేంద్ర మాదిగ,పోతుగంటి ఉదయ్ కిరణ్ మాదిగ,ధార సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.1
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.1
- తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా1