భద్రాచలం నుంచి ద్వారకా తిరుమలకు టీజీఎస్ఆర్టిసి భద్రాచలం డిపో నుండి ప్రత్యేక బస్సులు భద్రాచలం: భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజిఎస్ఆర్టిసి భద్రాచలం డిపో నుంచి రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. మొదటి బస్సు ఉదయం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు ద్వారకా తిరుమల చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు తిరుగు ప్రయాణమై సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుతుంది. రెండో బస్సు ఉదయం 6.45 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 11.45 గంటలకు ద్వారకా తిరుమల చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు భద్రాచలం చేరుతుంది. ఈ బస్సు పాల్వంచ, జగన్నాధపురం, దమ్మపేట, చింతలపూడి మీదుగా ద్వారకా తిరుమల వెళ్తుంది. పెద్దలకు రూ.170, పిల్లలకు రూ.90 చార్జీగా నిర్ణయించినట్లు డిపో మేనేజర్ వెల్లడించారు.
భద్రాచలం నుంచి ద్వారకా తిరుమలకు టీజీఎస్ఆర్టిసి భద్రాచలం డిపో నుండి ప్రత్యేక బస్సులు భద్రాచలం: భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజిఎస్ఆర్టిసి భద్రాచలం డిపో నుంచి రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. మొదటి బస్సు ఉదయం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు ద్వారకా తిరుమల చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు తిరుగు ప్రయాణమై సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుతుంది. రెండో బస్సు ఉదయం 6.45 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 11.45 గంటలకు ద్వారకా తిరుమల చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు భద్రాచలం చేరుతుంది. ఈ బస్సు పాల్వంచ, జగన్నాధపురం, దమ్మపేట, చింతలపూడి మీదుగా ద్వారకా తిరుమల వెళ్తుంది. పెద్దలకు రూ.170, పిల్లలకు రూ.90 చార్జీగా నిర్ణయించినట్లు డిపో మేనేజర్ వెల్లడించారు.
- సారపాకలో లారీ ఢీ.. ట్రాక్టర్ డ్రైవర్‌కు త్రివ గాయాలు... సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేట్ వద్ద లారీ, ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నూతన బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రిడ్జి ఎంట్రన్స్ వద్ద మట్టి, ఇసుక పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే మట్టి, ఇసుకను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు.3
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..................... భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.1
- సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది అని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆలయ ఎప్పుడు నిర్మాణానికి భక్తులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ధన రూపేనా, వస్తురూపేనా సహాయ సహకారాలు అందించి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు .ఈ కార్యక్రమంలో భక్తులు ,మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు4
- ఆప్యాతలు కొలువైనను గడ్డ శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి గడ్డపై ఇలాంటి రోజు వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా..... ??? తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష రాముడు నడయాడిన భద్రాద్రి నేలపై న్యాయం కోసం ఆడబిడ్డ ఆవేదన తల్లి దండ్రుల కుటుంబ వివాదంలో తనను దూరం చేశారంటూ కూతురి ఆవేదన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారిన మహిళ నిరసన భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి నేలపై, తన తండ్రి ప్రేమ కోసం ఓ ఆడబిడ్డ న్యాయం కోరుతూ దీక్షకు కూర్చోవడం పలువురిని కలచివేస్తోంది. దీక్షకు కూర్చున్న మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తనను తండ్రి దూరం చేశారని ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో మాట్లాడి విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై తీవ్ర ఆరోపణలు తన తల్లి దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని కూతురు ఆరోపించింది. భర్త తన తల్లిని మానసికంగా వేధించడంతో పాటు, ఆమెను ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్పించారని తెలిపింది. అయితే తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని నిరూపించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా తన తల్లిని భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం దీక్ష తమ సమస్యను పలువురి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. ప్రభావశీల వ్యక్తుల అండదండలు ఉండటంతో ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. తండ్రి ప్రేమ కోసం కూతురు రోడ్డుపై దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కుటుంబం వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇరువర్గాల వాదనలు పూర్తిస్థాయిలో తెలుసుకొని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. రాముడు నడయాడిన నేలపై.. తండ్రి ప్రేమ కోసం కూతురి కన్నీటి పోరాటం.1
- రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్ పార్వతి ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1
- భద్రాచలం: తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ దీక్ష.. న్యాయం కోసం కూతురి పోరాటం... భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చ నీయాంశంగా మారింది. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తన తండ్రి తనను దూరం చేశారని దీక్షకు దిగిన మహిళ ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిని కూడా భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని ఆరోపించింది. కుటుంబ సమస్యపై పలువురిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని, ప్రభావశీలుల అండదండల కారణంగా తమకు న్యాయం దక్కడం లేదని పేర్కొంది. దీంతో న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. అధికారులు స్పందించి ఇరువర్గాల వాదనలు విని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1