logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం తెదేపా కార్యాలయంలో పేదల ఆరోగ్యాన్ని తెలుగుదేశం పార్టీ ప్రాధాన్య లక్ష్యంగా పెట్టుకొని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి చెక్కులను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ప్రజాసేవనే పరమ వాదిగా భావించి పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక ఇన్‌ఛార్జి ఎన్. రాఘవేందర్ రెడ్డి, కౌతాళం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు చొరవతో ఈ చెక్కులు పంపిణీ కాగా, మొత్తం 80 మంది లబ్ధిదారులకు రూ. 36,61,253 విలువైన సహాయం అందింది. ఈ సహాయం అందుకున్న ప్రజలు తెదేపా పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేయగా, ఇన్‌ఛార్జి మాట్లాడుతూ ప్రజాపాలనే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు. తమ నాయకుడి దూరదృష్టి, కృషి ఫలితంగానే ఈరోజు 15వ విడత కింద సీఎం సహాయనిధి చెక్కులు అర్హులైన ప్రతి పేదవాడికి అందుతున్న తీరు దీనికి నిదర్శనమని వివరించారు. ఈ 80 చెక్కులలో కోసిగి మండలానికి 29 మందికి, కౌతాళం మండలానికి 18 మందికి, పెద్దకడబురు మండలానికి 15 మందికి, మంత్రాలయం మండలానికి 18 మందికి లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

1 hr ago
user_P.VEERANNA
P.VEERANNA
మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
3ed99f1a-cd18-4535-96cd-092e051c048a

మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం తెదేపా కార్యాలయంలో పేదల ఆరోగ్యాన్ని తెలుగుదేశం పార్టీ ప్రాధాన్య లక్ష్యంగా పెట్టుకొని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి చెక్కులను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ప్రజాసేవనే పరమ వాదిగా భావించి పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక ఇన్‌ఛార్జి ఎన్. రాఘవేందర్ రెడ్డి, కౌతాళం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు చొరవతో ఈ చెక్కులు పంపిణీ కాగా, మొత్తం 80 మంది లబ్ధిదారులకు రూ. 36,61,253 విలువైన సహాయం అందింది. ఈ సహాయం అందుకున్న ప్రజలు తెదేపా పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేయగా, ఇన్‌ఛార్జి మాట్లాడుతూ ప్రజాపాలనే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు. తమ నాయకుడి దూరదృష్టి, కృషి ఫలితంగానే ఈరోజు 15వ విడత కింద సీఎం సహాయనిధి చెక్కులు అర్హులైన ప్రతి పేదవాడికి అందుతున్న తీరు దీనికి నిదర్శనమని వివరించారు. ఈ 80 చెక్కులలో కోసిగి మండలానికి 29 మందికి, కౌతాళం మండలానికి 18 మందికి, పెద్దకడబురు మండలానికి 15 మందికి, మంత్రాలయం మండలానికి 18 మందికి లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

More news from Kurnool and nearby areas
  • కర్నూలు జిల్లా ఆదోనిలో మహేశ్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఈరమ్మ హత్య చేసిందని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2013లో మహేశ్, ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహేతర సంబంధంపై అనుమానంతో మహేశ్ తరచుగా తన భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేశ్ తో మరోసారి గొడవ జరిగింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతోనే ఈరమ్మ అతడిని ఇంటి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీఐ చంద్రశేఖర్ శనివారం వెల్లడించారు.
    1
    కర్నూలు జిల్లా ఆదోనిలో మహేశ్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఈరమ్మ హత్య చేసిందని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2013లో మహేశ్, ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహేతర సంబంధంపై అనుమానంతో మహేశ్ తరచుగా తన భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేశ్ తో మరోసారి గొడవ జరిగింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతోనే ఈరమ్మ అతడిని ఇంటి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీఐ చంద్రశేఖర్ శనివారం వెల్లడించారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    Adoni, Kurnool•
    15 hrs ago
  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    1
    నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    4 hrs ago
  • కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    user_MK news telugu
    MK news telugu
    Media company Midthur, Nandyal•
    7 hrs ago
  • కొత్తపల్లి మండలంలోని పాత మాడుగుల-సంగమేశ్వరం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మొక్కలు రోడ్డుపైకి విస్తరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
    1
    కొత్తపల్లి మండలంలోని పాత మాడుగుల-సంగమేశ్వరం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మొక్కలు రోడ్డుపైకి విస్తరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    1
    జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం స్థానిక షిరిడి సాయి కల్యాణ మండపంలో ఈ ఆదివారం వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 2026-27 సంవత్సరానికి గాను శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో 400 మార్కులు, ప్రైవేట్ పాఠశాలల్లో 450 మార్కులు, ఇంటర్మీడియట్‌లో 750 మార్కులు సాధించిన వాల్మీకి విద్యార్థులకు వాల్మీకి ఉద్యోగ సంఘం తరఫున ప్రతి ఒక్కరికీ నగదు రూపేణా ₹500లు, మెమెంటో, సర్టిఫికెట్, శాలువాతో ప్రతిభా పురస్కారాలు అందజేశారని తెలిపారు. అంతేకాకుండా, తన అంబికా ఫౌండేషన్ ద్వారా మెరుగైన ఉన్నత చదువుల కోసం వాల్మీకి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగరాజు, ట్రెజరర్ రామకృష్ణ, ధర్మవరం వాల్మీకి ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరసింహులు, సెక్రటరీ చంద్రశేఖర్, కార్యదర్శి శివయ్యలు కూడా పాల్గొన్నారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం స్థానిక షిరిడి సాయి కల్యాణ మండపంలో ఈ ఆదివారం వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 2026-27 సంవత్సరానికి గాను శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో 400 మార్కులు, ప్రైవేట్ పాఠశాలల్లో 450 మార్కులు, ఇంటర్మీడియట్‌లో 750 మార్కులు సాధించిన వాల్మీకి విద్యార్థులకు వాల్మీకి ఉద్యోగ సంఘం తరఫున ప్రతి ఒక్కరికీ నగదు రూపేణా ₹500లు, మెమెంటో, సర్టిఫికెట్, శాలువాతో ప్రతిభా పురస్కారాలు అందజేశారని తెలిపారు. అంతేకాకుండా, తన అంబికా ఫౌండేషన్ ద్వారా మెరుగైన ఉన్నత చదువుల కోసం వాల్మీకి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగరాజు, ట్రెజరర్ రామకృష్ణ, ధర్మవరం వాల్మీకి ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరసింహులు, సెక్రటరీ చంద్రశేఖర్, కార్యదర్శి శివయ్యలు కూడా పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    9 hrs ago
  • అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం సీఐ హరినాథ్ మాట్లాడుతూ, హెల్మెట్ ఒక రక్షణ కవచమని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాంలో పోలీసులు స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుమారు 100 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సీఐ హరినాథ్ వివరించారు.
    1
    అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం సీఐ హరినాథ్ మాట్లాడుతూ, హెల్మెట్ ఒక రక్షణ కవచమని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాంలో పోలీసులు స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుమారు 100 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సీఐ హరినాథ్ వివరించారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.