logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

2 hrs ago
user_NAVADEEP T
NAVADEEP T
బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
2 hrs ago

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    1
    నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, తన పుట్టుక బీఆర్ఎస్ అని, తన జీవితమంతా బీఆర్ఎస్ అని గతంలో ఎన్నోసార్లు చెప్పానని, ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కడి విలువ ఉందంటూ ప్రశ్నించిన ఆయన, నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని తీవ్రంగా విమర్శించారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని హరీష్ రావు ఆరోపించారు.
    1
    సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, తన పుట్టుక బీఆర్ఎస్ అని, తన జీవితమంతా బీఆర్ఎస్ అని గతంలో ఎన్నోసార్లు చెప్పానని, ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కడి విలువ ఉందంటూ ప్రశ్నించిన ఆయన, నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని తీవ్రంగా విమర్శించారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని హరీష్ రావు ఆరోపించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    3 hrs ago
  • ఈ రోజు ఉదయం నుంచే ఫలక్నుమా కాళీ మాత మందిరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలను నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో భక్తులు ముడుపులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ యాజమాన్యం పటిష్టమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ వంటి అవసరమైన సదుపాయాలను కల్పించడంతో, పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాయి.
    1
    ఈ రోజు ఉదయం నుంచే ఫలక్నుమా కాళీ మాత మందిరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలను నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో భక్తులు ముడుపులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ యాజమాన్యం పటిష్టమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ వంటి అవసరమైన సదుపాయాలను కల్పించడంతో, పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాయి.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    4 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రూ.2.56 కోట్ల వ్యయంతో నిర్మించిన మెడల్ బస్ బేను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన మొత్తం 1,053 మంది కళ్యాణలక్ష్మి, 56 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.11.09 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అదనంగా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య కిట్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ రెడ్డి, కె. హైమావతి, లక్ష్మీ కిరణ్, చంద్రకళ, గంగిశెట్టి చందన, నరేందర్ రెడ్డి వంటి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, త్వరలో ఈ సదుపాయాన్ని ఇంటర్ కళాశాలలకు కూడా విస్తరిస్తామని ఆయన వివరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు చికిత్స సౌకర్యం కల్పిస్తున్నామని, సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో ఇప్పటికే 3,500 ఇళ్లు స్లాబ్ స్థాయికి చేరుకున్నాయని, మరో 2,500 ఇళ్లను వచ్చే నెలలో మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడి అంచనాల కంటే 30 శాతం అధికంగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తినా, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రిని కోరారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రూ.2.56 కోట్ల వ్యయంతో నిర్మించిన మెడల్ బస్ బేను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన మొత్తం 1,053 మంది కళ్యాణలక్ష్మి, 56 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.11.09 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అదనంగా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య కిట్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ రెడ్డి, కె. హైమావతి, లక్ష్మీ కిరణ్, చంద్రకళ, గంగిశెట్టి చందన, నరేందర్ రెడ్డి వంటి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, త్వరలో ఈ సదుపాయాన్ని ఇంటర్ కళాశాలలకు కూడా విస్తరిస్తామని ఆయన వివరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు చికిత్స సౌకర్యం కల్పిస్తున్నామని, సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో ఇప్పటికే 3,500 ఇళ్లు స్లాబ్ స్థాయికి చేరుకున్నాయని, మరో 2,500 ఇళ్లను వచ్చే నెలలో మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడి అంచనాల కంటే 30 శాతం అధికంగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తినా, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రిని కోరారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఘాజీపూర్‌లో జరిగిన ఒక దారుణ సంఘటనలో, రాత్రి వేళ ఒక యువకుడిని కాల్చి చంపారు. ఈ హత్య కేసు నేపథ్యంలో, పోలీసులు అత్యంత అప్రమత్త మోడ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఘాజీపూర్ పోలీసులు, వారణాసి జోన్ పోలీసులు, డిఐజి వారణాసి, ఎస్‌పి ఘాజీపూర్‌లతో సహా మొత్తం పోలీసు బలగం నేర పరిశోధనలో నిమగ్నమై ఉంది. ప్రత్యేక బృందాలు, ఎన్‌కౌంటర్ బృందాలను రంగంలోకి దించి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని, బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
    1
    ఘాజీపూర్‌లో జరిగిన ఒక దారుణ సంఘటనలో, రాత్రి వేళ ఒక యువకుడిని కాల్చి చంపారు. ఈ హత్య కేసు నేపథ్యంలో, పోలీసులు అత్యంత అప్రమత్త మోడ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఘాజీపూర్ పోలీసులు, వారణాసి జోన్ పోలీసులు, డిఐజి వారణాసి, ఎస్‌పి ఘాజీపూర్‌లతో సహా మొత్తం పోలీసు బలగం నేర పరిశోధనలో నిమగ్నమై ఉంది. ప్రత్యేక బృందాలు, ఎన్‌కౌంటర్ బృందాలను రంగంలోకి దించి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని, బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    1
    జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    user_MK news telugu
    MK news telugu
    Media company Midthur, Nandyal•
    5 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.