logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్* *రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం* *కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి* *రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* *రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం* *రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. *ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.* "ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు. "గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.

2 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
2 hrs ago

ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్* *రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం* *కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి* *రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* *రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం* *రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. *ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.* "ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు. "గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ లో శ్రీశైలం మూలిక వైద్యం...దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదిక్ మందులు పనిచేస్తాయని శ్రీశైలం మూలిక వైద్యం నిర్వాహకులు ఎం.కే నిఖిల్ తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్ లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ లో శ్రీశైల మూలిక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆయుర్వేద వైద్యులు ఎంకే నిఖిల్, క్యాంప్ ఆర్గనైజర్ నాగేంద్ర కుమార్ పాల్గొని ఆయుర్వేద వైద్యం గురించి వివరించారు. మోకాళ్ళ నొప్పులకు, కీళ్ల నొప్పులకు, వాతం, నడుము నొప్పి తలనొప్పి, సయాటికా, స్పాండిలైటీస్, గ్యాస్ ట్రబుల్, షుగర్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు దీర్ఘకాల వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. మూలికల యొక్క గుణం ఏ రోజుకు ఆ రోజు రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆహారంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ప్రతి నెల 11వ తేదీన కరీంనగర్లో శిబిరం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరలో మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
    4
    కరీంనగర్ లో శ్రీశైలం మూలిక వైద్యం...దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్
సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదిక్ మందులు పనిచేస్తాయని శ్రీశైలం మూలిక వైద్యం నిర్వాహకులు ఎం.కే నిఖిల్ తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్ లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ లో శ్రీశైల మూలిక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆయుర్వేద వైద్యులు ఎంకే నిఖిల్, క్యాంప్ ఆర్గనైజర్ నాగేంద్ర కుమార్ పాల్గొని ఆయుర్వేద వైద్యం గురించి వివరించారు. మోకాళ్ళ నొప్పులకు, కీళ్ల నొప్పులకు, వాతం, నడుము నొప్పి  తలనొప్పి, సయాటికా, స్పాండిలైటీస్, గ్యాస్ ట్రబుల్, షుగర్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు దీర్ఘకాల వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. మూలికల యొక్క గుణం ఏ రోజుకు ఆ రోజు రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆహారంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ప్రతి నెల 11వ తేదీన  కరీంనగర్లో శిబిరం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరలో మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.
    4
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని అందజేసిన బిఆర్ఎస్వి నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ ఒక మైనర్ బాలిక విషయం లో బండి సంజయ్ కుమారిని పై వస్తున్న ఆరోపణల్లో నిష్పక్షపాతంగా న్యాయం జరగాలంటే బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అలాగే అతని కుమారునిపై కేసు నమోదై 48 గంటలు గడిచిపోతున్న కూడా అరెస్ట్ చేయలేదని pocso కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కు బదులు బెయిలబుల్ సెక్షన్ లు పెట్టారని అన్నారు.pocso ఆక్ట్ లో సెక్షన్ 8 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
    1
    సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని అందజేసిన బిఆర్ఎస్వి నాయకులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ ఒక మైనర్ బాలిక విషయం లో బండి సంజయ్ కుమారిని పై వస్తున్న ఆరోపణల్లో నిష్పక్షపాతంగా న్యాయం జరగాలంటే బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అలాగే అతని కుమారునిపై కేసు నమోదై 48 గంటలు గడిచిపోతున్న కూడా అరెస్ట్ చేయలేదని pocso కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కు బదులు బెయిలబుల్ సెక్షన్ లు పెట్టారని అన్నారు.pocso ఆక్ట్ లో సెక్షన్ 8 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    45 min ago
  • రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
    1
    రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ... జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు. - సిరిసిల్ల శ్రీనివాస్ కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. "కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న"గా భక్తుల నమ్మకం. సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ పెద్ద జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. కొండగట్టు అంజన్నకు ఈ సమయం చాలా ప్రీతిపాత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కొండగట్టు అంజన్నా,  కోటి కోటి దండాలన్నా.... అంటూ,  జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అంజన్న గుట్ట ప్రాంతమంతా మార్మోగిపోతుంది.  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ విశేషాలలో ప్రధానంగా.... * తనకు అత్యంత ప్రీతీపాత్రుడైన భక్తుడు హనుమంతుడి జన్మదినానికి కానుకగా  శ్రీ సీతారామచంద్రులవారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు పంపించడం ఒక గొప్ప సాంప్రదాయం మనకు ఇక్కడ కనిపిస్తుంది.  • హనుమాన్ దీక్ష విరమణ: 11, 21, లేదా 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు ఈ పెద్ద జయంతి రోజున కొండగట్టుకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ దీక్షలను విరమిస్తారు. • ఈ పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలపాకులతో పూజలు మరియు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. • కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో కొండగట్టుకు తరలివస్తారు. • ఉత్సవాల్లో భాగంగా అంజన్న విగ్రహాన్ని రథంపై మేళతాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ శోభాయాత్ర చూస్తుంటే, సాక్షాత్తు గధతో తరలివస్తున్న ప్రశాంతవదనుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొండగట్టు గుట్ట ప్రాంతమంతా కలియ తిరుగుతూ, భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో హనుమాన్ దీక్షపరులు భక్తిభావంతో చేస్తున్న జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతాయి. కొండపైన ఉండే "ధర్మగుండం"లో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో చిన్న జయంతి, పెద్ద జయంతి, ఈ రెండు ఉత్సవాలు జగిత్యాల జిల్లాలో ఒక వైపు ఆధ్యాత్మికతను పదిలపరుస్తుండగా, మరో వైపు ఎన్నో చిరు వ్యాపారుల కుటుంబాలకు జీవనోపాధినందిస్తుంది. ఈ రెండు ఉత్సవాలకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మరియు దేవాలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, మరియు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది.
    1
    జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ...
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు.
- సిరిసిల్ల శ్రీనివాస్
కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. "కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న"గా భక్తుల నమ్మకం.
సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ పెద్ద జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. కొండగట్టు అంజన్నకు ఈ సమయం చాలా ప్రీతిపాత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కొండగట్టు అంజన్నా,  కోటి కోటి దండాలన్నా.... అంటూ,  జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అంజన్న గుట్ట ప్రాంతమంతా మార్మోగిపోతుంది. 
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ విశేషాలలో ప్రధానంగా....
* తనకు అత్యంత ప్రీతీపాత్రుడైన భక్తుడు హనుమంతుడి జన్మదినానికి కానుకగా  శ్రీ సీతారామచంద్రులవారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు పంపించడం ఒక గొప్ప సాంప్రదాయం మనకు ఇక్కడ కనిపిస్తుంది. 
• హనుమాన్ దీక్ష విరమణ: 11, 21, లేదా 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు ఈ పెద్ద జయంతి రోజున కొండగట్టుకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ దీక్షలను విరమిస్తారు.
• ఈ పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలపాకులతో పూజలు మరియు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు.
• కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో కొండగట్టుకు తరలివస్తారు.
• ఉత్సవాల్లో భాగంగా అంజన్న విగ్రహాన్ని రథంపై మేళతాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ శోభాయాత్ర చూస్తుంటే, సాక్షాత్తు గధతో తరలివస్తున్న ప్రశాంతవదనుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొండగట్టు గుట్ట ప్రాంతమంతా కలియ తిరుగుతూ, భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో హనుమాన్ దీక్షపరులు భక్తిభావంతో చేస్తున్న జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతాయి.
కొండపైన ఉండే "ధర్మగుండం"లో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ఇక కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో చిన్న జయంతి, పెద్ద జయంతి, ఈ రెండు ఉత్సవాలు జగిత్యాల జిల్లాలో ఒక వైపు ఆధ్యాత్మికతను పదిలపరుస్తుండగా, మరో వైపు ఎన్నో చిరు వ్యాపారుల కుటుంబాలకు జీవనోపాధినందిస్తుంది.
ఈ రెండు ఉత్సవాలకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మరియు దేవాలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, మరియు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    21 min ago
  • మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
    1
    మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • కరీంనగర్‌లో బండి సంజయ్ కొడుకు సాయి భగీరత్‌ను పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు నాయకుల ప్లకార్డులు ప్రదర్శించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బారాసా సవాల్ విసిరింది.
    3
    కరీంనగర్‌లో బండి సంజయ్ కొడుకు సాయి భగీరత్‌ను పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు నాయకుల ప్లకార్డులు ప్రదర్శించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బారాసా సవాల్ విసిరింది.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • హైదరాబాద్ లో యువకుడు హత్య...పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో శవం...11 రోజుల తర్వాత దొరికిన ఆచూకీ, మహిళతో సహా ముగ్గురు అరెస్టు. ప్రేమ యవ్వారం వేధింపులు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువతి దక్కకపోవడంతో ఫోన్ లో వేధిస్తు ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో పక్క ప్లాన్ తో. హైదరాబాద్ లో హత్య చేసి మంథని అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం లభించడంతో పోలీసులు హత్య కేసును చేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యారు. పది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం లభించింది. హైదరాబాదులో హత్యకు గురైతే శవం మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడిదలగండి వద్ద లోయలో లభించింది. ప్రేమ యవ్వారం, వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరిఖని ఏ సి పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీ కి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో టెన్త్ క్లాస్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ లో కలిసిన వంశీ, అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతోపాటు ఏకంగా వారి ఇంటికే వెళ్ళి గొడవపడ్డాడు. విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్ తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాదులో తన ప్లాట్ కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్ కు వెళ్ళిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్ కి వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటికి వెళ్లి పోగా వంశీ, భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలో చుట్టి కార్ లో భాస్కర్ ఒక్కరే మంథని కి తరలించి గాడుదులగండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డాటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంథని వద్ద గాడుదలగండి లోయలో పడేసినట్టు తెలుపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసిపి రమేష్ తెలిపారు.
    3
    హైదరాబాద్ లో యువకుడు హత్య...పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో శవం...11 రోజుల తర్వాత దొరికిన ఆచూకీ, మహిళతో సహా ముగ్గురు అరెస్టు.
ప్రేమ యవ్వారం వేధింపులు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువతి దక్కకపోవడంతో ఫోన్ లో వేధిస్తు ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో పక్క ప్లాన్ తో. హైదరాబాద్ లో హత్య చేసి మంథని అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం లభించడంతో పోలీసులు హత్య కేసును చేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యారు. పది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం లభించింది. హైదరాబాదులో హత్యకు గురైతే శవం మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడిదలగండి వద్ద లోయలో లభించింది. ప్రేమ యవ్వారం, వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరిఖని ఏ సి పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీ కి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో టెన్త్ క్లాస్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ లో  కలిసిన వంశీ, అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతోపాటు ఏకంగా వారి ఇంటికే వెళ్ళి గొడవపడ్డాడు. విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్ తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాదులో   తన ప్లాట్ కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్ కు వెళ్ళిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్ కి వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటికి వెళ్లి పోగా వంశీ, భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలో చుట్టి కార్ లో భాస్కర్ ఒక్కరే మంథని కి తరలించి గాడుదులగండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డాటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంథని వద్ద గాడుదలగండి లోయలో పడేసినట్టు తెలుపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసిపి రమేష్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • హనుమాన్ జయంతి సందర్భంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక వేసవి సౌకర్యాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ ఫ్యాన్లు, క్యూలైన్లలో జంబో కూలర్లు, అదనపు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు, చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ రాజరాజేశ్వర జల ప్రసాదం ఆధ్వర్యంలో సేవా వాలంటీర్ల సహకారంతో చల్లని తాగునీటి పంపిణీ నిర్వహిస్తున్నారు. కూల్ బబుల్స్ ద్వారా నిరంతరం భక్తులకు తాగునీరు అందుబాటు లో ఉంచుతున్నారు. మహా మండపంలో ఎయిర్ కండిషనర్లు (ఏసీ లు), ఫ్యాన్లు ఏర్పాటు చేయగా, మూల విరాట్టు దర్శన మార్గాల్లో జంబో కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు చల్లని వాతావరణం కల్పిస్తున్నారు. అదే విధంగా భక్తులకు ప్రసాదాల పంపిణీ, దర్శన ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు,జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, ఆదేశాల మేరకు ఆలయ ఈవో రమాదేవి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
    2
    హనుమాన్ జయంతి సందర్భంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక వేసవి సౌకర్యాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ ఫ్యాన్లు, క్యూలైన్లలో జంబో కూలర్లు, అదనపు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు, చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ రాజరాజేశ్వర జల ప్రసాదం ఆధ్వర్యంలో సేవా వాలంటీర్ల సహకారంతో చల్లని తాగునీటి పంపిణీ నిర్వహిస్తున్నారు. కూల్ బబుల్స్ ద్వారా నిరంతరం భక్తులకు తాగునీరు అందుబాటు లో ఉంచుతున్నారు. మహా మండపంలో ఎయిర్ కండిషనర్లు  (ఏసీ లు), ఫ్యాన్లు ఏర్పాటు చేయగా, మూల విరాట్టు దర్శన మార్గాల్లో జంబో కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు చల్లని వాతావరణం కల్పిస్తున్నారు. అదే విధంగా భక్తులకు ప్రసాదాల పంపిణీ, దర్శన ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ  శైలజ రామయ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు,జిల్లా కలెక్టర్ గరీమ  అగర్వాల్, ఆదేశాల మేరకు ఆలయ ఈవో రమాదేవి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.