logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ... జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు. - సిరిసిల్ల శ్రీనివాస్ కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. "కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న"గా భక్తుల నమ్మకం. సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ పెద్ద జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. కొండగట్టు అంజన్నకు ఈ సమయం చాలా ప్రీతిపాత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కొండగట్టు అంజన్నా,  కోటి కోటి దండాలన్నా.... అంటూ,  జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అంజన్న గుట్ట ప్రాంతమంతా మార్మోగిపోతుంది.  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ విశేషాలలో ప్రధానంగా.... * తనకు అత్యంత ప్రీతీపాత్రుడైన భక్తుడు హనుమంతుడి జన్మదినానికి కానుకగా  శ్రీ సీతారామచంద్రులవారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు పంపించడం ఒక గొప్ప సాంప్రదాయం మనకు ఇక్కడ కనిపిస్తుంది.  • హనుమాన్ దీక్ష విరమణ: 11, 21, లేదా 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు ఈ పెద్ద జయంతి రోజున కొండగట్టుకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ దీక్షలను విరమిస్తారు. • ఈ పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలపాకులతో పూజలు మరియు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. • కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో కొండగట్టుకు తరలివస్తారు. • ఉత్సవాల్లో భాగంగా అంజన్న విగ్రహాన్ని రథంపై మేళతాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ శోభాయాత్ర చూస్తుంటే, సాక్షాత్తు గధతో తరలివస్తున్న ప్రశాంతవదనుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొండగట్టు గుట్ట ప్రాంతమంతా కలియ తిరుగుతూ, భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో హనుమాన్ దీక్షపరులు భక్తిభావంతో చేస్తున్న జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతాయి. కొండపైన ఉండే "ధర్మగుండం"లో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో చిన్న జయంతి, పెద్ద జయంతి, ఈ రెండు ఉత్సవాలు జగిత్యాల జిల్లాలో ఒక వైపు ఆధ్యాత్మికతను పదిలపరుస్తుండగా, మరో వైపు ఎన్నో చిరు వ్యాపారుల కుటుంబాలకు జీవనోపాధినందిస్తుంది. ఈ రెండు ఉత్సవాలకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మరియు దేవాలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, మరియు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది.

1 hr ago
user_Sk chaitanya
Sk chaitanya
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
1 hr ago

జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ... జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు. - సిరిసిల్ల శ్రీనివాస్ కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. "కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న"గా భక్తుల నమ్మకం. సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ పెద్ద జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. కొండగట్టు అంజన్నకు ఈ సమయం చాలా ప్రీతిపాత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కొండగట్టు అంజన్నా,  కోటి కోటి దండాలన్నా.... అంటూ,  జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అంజన్న గుట్ట ప్రాంతమంతా మార్మోగిపోతుంది.  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ విశేషాలలో ప్రధానంగా.... * తనకు అత్యంత ప్రీతీపాత్రుడైన భక్తుడు హనుమంతుడి జన్మదినానికి కానుకగా  శ్రీ సీతారామచంద్రులవారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు పంపించడం ఒక గొప్ప సాంప్రదాయం మనకు ఇక్కడ కనిపిస్తుంది.  • హనుమాన్ దీక్ష విరమణ: 11, 21, లేదా 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు ఈ పెద్ద జయంతి రోజున కొండగట్టుకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ దీక్షలను విరమిస్తారు. • ఈ పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలపాకులతో పూజలు మరియు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. • కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో కొండగట్టుకు తరలివస్తారు. • ఉత్సవాల్లో భాగంగా అంజన్న విగ్రహాన్ని రథంపై మేళతాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ శోభాయాత్ర చూస్తుంటే, సాక్షాత్తు గధతో తరలివస్తున్న ప్రశాంతవదనుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొండగట్టు గుట్ట ప్రాంతమంతా కలియ తిరుగుతూ, భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో హనుమాన్ దీక్షపరులు భక్తిభావంతో చేస్తున్న జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతాయి. కొండపైన ఉండే "ధర్మగుండం"లో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో చిన్న జయంతి, పెద్ద జయంతి, ఈ రెండు ఉత్సవాలు జగిత్యాల జిల్లాలో ఒక వైపు ఆధ్యాత్మికతను పదిలపరుస్తుండగా, మరో వైపు ఎన్నో చిరు వ్యాపారుల కుటుంబాలకు జీవనోపాధినందిస్తుంది. ఈ రెండు ఉత్సవాలకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మరియు దేవాలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, మరియు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది.

More news from తెలంగాణ and nearby areas
  • వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి,తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలోని మెట్ పెల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మ నగర్, వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులు, ధాన్యంకొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో  మాట్లాడుతూ....కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని  దాన్యంను ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పరిశీలనలో మండల తహసిల్దార్ నీత, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    1
    వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి,తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల
జిల్లాలోని మెట్ పెల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మ నగర్, వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులు, ధాన్యంకొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో  మాట్లాడుతూ....కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని  దాన్యంను ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ పరిశీలనలో మండల తహసిల్దార్ నీత, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    44 min ago
  • రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
    1
    రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను పదవి నుండి తొలగించాలని కోరుట్ల పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
    1
    కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను పదవి నుండి తొలగించాలని కోరుట్ల పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంపు ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈరోజు జిల్లాలోని 9 పీఎంశ్రీ పాఠశాలతో పాటు, కేజీబీవీ రుద్రంగి లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజు వారీగా ఈరోజు నుండి 17 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించ బడతాయని పేర్కొన్నారు. ఈరోజు మౌలిక వసతుల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపుల ప్రారంభం, రెండవ రోజు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు రెమిడియల్ తరగతుల ప్రారంభం, ఇంటర్మీడియట్ విద్యార్థుల రెమిడియల్ తరగతుల ముగింపు, మూడవ రోజు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సర్పంచ్‌లతో నియోజకవర్గ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహణ, నాలుగవ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహణ, ఐదవ రోజు పుస్తక పఠనం ప్రాముఖ్యతపై జిల్లా, మండల గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఆరవ రోజు ఆర్ట్, క్రాఫ్ట్ & కల్చరల్ డే నిర్వహణ, ఏడవ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా నాట్యం, సంగీతం, చేతి రాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ రోజు విద్యార్థులకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఏ పాఠశాల విద్యార్థులైనా ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యా వారోత్సవాల ముగింపు రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి అత్యుత్తమైన మార్కులను పొందిన విద్యార్థులకు సన్మానం చేసి, నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే స్థాయిలో డిమాండ్ ఉందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు రావడానికి చురుకుగా ఉన్న విద్యార్థులను ఇస్రో కు పంపిస్తామని, ఇప్పటికే చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. జీవితంలో విద్యార్థులు చదువుతో పాటు అన్నీ విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అందుకే ఈ సమ్మర్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యాలను వెలికితీసేలా ఏదైనా ఒక హాబీ ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కష్టపడి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని అంకాలపు సిరికి సన్మానం చేసి అభినందించారు. అనంతరం సమ్మర్ క్యాంపు విద్యార్థులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, తదితరులు పాల్గొన్నారు.
    3
    విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు
సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంపు ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈరోజు జిల్లాలోని 9 పీఎంశ్రీ పాఠశాలతో పాటు, కేజీబీవీ రుద్రంగి లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజు వారీగా ఈరోజు నుండి 17 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించ బడతాయని పేర్కొన్నారు. ఈరోజు మౌలిక వసతుల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపుల ప్రారంభం, రెండవ రోజు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు రెమిడియల్ తరగతుల ప్రారంభం, ఇంటర్మీడియట్ విద్యార్థుల రెమిడియల్ తరగతుల ముగింపు, మూడవ రోజు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సర్పంచ్‌లతో నియోజకవర్గ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహణ, నాలుగవ రోజు  ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహణ, ఐదవ రోజు పుస్తక పఠనం ప్రాముఖ్యతపై జిల్లా, మండల గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఆరవ రోజు ఆర్ట్, క్రాఫ్ట్ & కల్చరల్ డే నిర్వహణ, ఏడవ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా నాట్యం, సంగీతం, చేతి రాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ రోజు విద్యార్థులకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఏ పాఠశాల విద్యార్థులైనా ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యా వారోత్సవాల ముగింపు రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి అత్యుత్తమైన మార్కులను పొందిన విద్యార్థులకు సన్మానం చేసి, నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. 
సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే స్థాయిలో డిమాండ్ ఉందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు రావడానికి చురుకుగా ఉన్న విద్యార్థులను ఇస్రో కు పంపిస్తామని, ఇప్పటికే చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. జీవితంలో విద్యార్థులు చదువుతో పాటు అన్నీ విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అందుకే ఈ సమ్మర్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యాలను వెలికితీసేలా ఏదైనా ఒక హాబీ ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కష్టపడి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన  విద్యార్థిని అంకాలపు సిరికి సన్మానం చేసి అభినందించారు. అనంతరం సమ్మర్ క్యాంపు విద్యార్థులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 min ago
  • ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్* *రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం* *కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి* *రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* *రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం* *రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. *ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.* "ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు. "గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.
    1
    ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం

డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్*
*రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం*
*కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి*
*రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* 
*రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం*
*రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* 
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. 
ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
"గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు.
దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు.
*ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.*
"ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు.
"గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్  క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు.
అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు.
మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్  తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. 
జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు
    1
    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి

17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ?

రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి

కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
   కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై
 పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్  ను మంత్రి వర్గం నుండి భర్తరప్  చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు   కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు
  
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది
 ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ
 బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం  ఎందుకని,
 పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా  విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్  బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి  మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు  నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్
తదితరులు పాల్గొన్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి
17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ?
రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి
కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై
పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్  ను మంత్రి వర్గం నుండి భర్తరప్  చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు   కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది
ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ
బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం  ఎందుకని,
పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా  విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్  బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి  మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు  నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్
తదితరులు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం... గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డైరీ ఫామ్ చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం...
గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  డైరీ ఫామ్  చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు  నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్, నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం : ప్రెస్ మీట్ లో brs నాయకులు  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్,పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర రావుతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్ నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నైతిక విలువలు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. భగీరథ్ పై ఉద్దేశ పూర్వకముగా నేరానికి అనుగుణమైన సెక్షన్లు పెట్టకుండా తప్పించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలన్నారు.
    1
    ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్, నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం : ప్రెస్ మీట్ లో brs నాయకులు 
జగిత్యాల 
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్,పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర రావుతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్ నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నైతిక విలువలు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.
భగీరథ్ పై ఉద్దేశ పూర్వకముగా నేరానికి అనుగుణమైన సెక్షన్లు పెట్టకుండా తప్పించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    49 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.