logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్నా క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి భోజనం చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారి మహోన్నత సేవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు పల్నాడు బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్‌ను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసి ప్రజలతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందించే ఏర్పాట్లు చేయడం గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు. పేదల పట్ల ఆమె చూపిన సేవా తత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మీడియాతో మాట్లాడుతూ... ఏప్రిల్ 20వ తేదీ మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్‌లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నా క్యాంటీన్లు సామాన్య ప్రజల ఆకలి తీర్చే “అన్నపూర్ణ”లాంటివని, తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే ఈ పథకం ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. కేవలం రూ.5కే పూర్తి భోజనం అందించడం గొప్ప సంకల్పమని, అక్షయపాత్ర సంస్థ సహకారంతో నాణ్యతతో భోజనం అందించడం విశేషమని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తూ, వేలాది మంది ప్రజలకు లాభం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.

3 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
Guntur, Andhra Pradesh•
3 hrs ago
55d10a75-132d-4893-b9ce-c33bd9ed86c8

అన్నా క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి భోజనం చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారి మహోన్నత సేవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు పల్నాడు బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్‌ను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకులు,

0c57cf95-748a-49bd-a62b-b4709aa06c33

కార్యకర్తలతో కలిసి అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసి ప్రజలతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందించే ఏర్పాట్లు చేయడం గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు. పేదల పట్ల ఆమె చూపిన సేవా తత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మీడియాతో మాట్లాడుతూ... ఏప్రిల్ 20వ తేదీ మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు

aa928695-4978-4276-84b1-45e8ec7baf8c

గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్‌లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నా క్యాంటీన్లు సామాన్య ప్రజల ఆకలి తీర్చే “అన్నపూర్ణ”లాంటివని, తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే ఈ పథకం ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. కేవలం రూ.5కే పూర్తి భోజనం అందించడం గొప్ప సంకల్పమని, అక్షయపాత్ర సంస్థ సహకారంతో నాణ్యతతో భోజనం అందించడం విశేషమని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తూ, వేలాది మంది ప్రజలకు లాభం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐
    3
    ప్రజాప్రస్థానం
నకిరేకల్, నియోజకవర్గo:-
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు.
అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు.
తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు.
2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    6 hrs ago
  • *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    1
    *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన*
*14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం*
*ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా*
*కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్*
*పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* 
భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC  మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA  అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు.
ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం 
వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై  వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    user_Shivaram
    Shivaram
    Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.
    1
    ఆకాశంలో ఫైటింగ్ 
రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్!
"గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. 
దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. 
మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    49 min ago
  • కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    4
    కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం.
- చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై  నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. 
- నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. 
- విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం.
- కోవూరు అన్నా క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.  
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి  76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు  వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు  ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరులో మొట్ట మొదటి సారి గా సెల్ రిపేరు ట్రైనింగ్ సెంటర్ Shot News: గుంటూరులో అరండల్ పేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువత కోసం సెల్ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబడినది అని... ఐ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ అధినేత జుబేర్ తెలిపారు... పూర్తి వివరాలకు తమ ట్రైనింగ్ సెంటర్ ను సంప్రదించాలని తెలియజేశారు...వారి సెల్: 95812 57761
    1
    గుంటూరులో మొట్ట మొదటి సారి గా సెల్ రిపేరు ట్రైనింగ్ సెంటర్ 
Shot News: గుంటూరులో అరండల్ పేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువత కోసం సెల్ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబడినది అని... ఐ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ అధినేత జుబేర్ తెలిపారు... పూర్తి వివరాలకు తమ ట్రైనింగ్ సెంటర్ ను సంప్రదించాలని తెలియజేశారు...వారి సెల్:  95812 57761
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    1
    . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు....
    1
    తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు....
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.