Shuru
Apke Nagar Ki App…
రైల్వే స్టేషన్లో కరెంటు తీగలు ఎక్కి ఫైట్ అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.
User7105
రైల్వే స్టేషన్లో కరెంటు తీగలు ఎక్కి ఫైట్ అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- బనగానపల్లె మండలం మైన్ ప్రాథమిక పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బడిబాట విశిష్టత హెచ్ఎం మల్లికార్జున రావుకు సన్మానం, విద్యార్థులకు బహుమతులు ప్రధాన ఉత్సవం, అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది, ముందుగా బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిల్లల కోసం మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికాహారం బూట్లు పుస్తకాలు అమ్మ ఒడి రూ. 15000 మొదలగునవి మీకోసం అమలు చేస్తుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చేయాలని బడిబాటి బంగారు బాట అన్నారు. అనంతరం హెచ్ ఎం మల్లికార్జునరావు ఘనంగా సన్మానించి విద్యార్థులకు బహుమతులు అందించారు. హెచ్ఎం మల్లికార్జునరావు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి చదువు చెప్పడం మా వంతు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు వల్లపు శంకర్, ఉపాధ్యాయులు, మధు కిషోర్, సురేష్, మల్లేశ్వరుడు, మల్లికార్జున , పలుకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.1
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు....1