logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం* *పరిస్థితి విషమయం మెరుగైన వైద్య సేవలను నిమిత్తం ఖమ్మం తరలింపు మద్యం మత్తులో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన మడకం దేవయ్య (దేవా) గత కొన్ని ఏళ్లుగా ఒరిస్సా నుంచి వచ్చి చెరుకుపల్లి లో సిర్ద నివాసం ఏర్పాటు చేసుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సోమవారం భార్యా భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సత్తుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్ నందు గల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సమీపంలో మద్యం మత్తులో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపి అపస్మార్క స్థితికి చేరుకోవడంతో స్థానికులు గుర్తించి 108.కి సమాచారం ఇవ్వడంతో హుటా హుటీనా సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పైలెట్ రాధాకృష్ణ,ఈ ఎన్ టి గొల్లమందల కృష్ణ, క్షతగాత్రుడికి మెరుగైనవైద్య సేవలు అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రదమ చికిత్స చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలను నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు,

4 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
4 hrs ago

*పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం* *పరిస్థితి విషమయం మెరుగైన వైద్య సేవలను నిమిత్తం ఖమ్మం తరలింపు మద్యం మత్తులో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన మడకం దేవయ్య (దేవా) గత కొన్ని ఏళ్లుగా ఒరిస్సా నుంచి వచ్చి చెరుకుపల్లి లో సిర్ద నివాసం ఏర్పాటు చేసుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సోమవారం భార్యా భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సత్తుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్ నందు గల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సమీపంలో మద్యం మత్తులో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపి అపస్మార్క స్థితికి చేరుకోవడంతో స్థానికులు గుర్తించి 108.కి సమాచారం ఇవ్వడంతో హుటా హుటీనా సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పైలెట్ రాధాకృష్ణ,ఈ ఎన్ టి గొల్లమందల కృష్ణ, క్షతగాత్రుడికి మెరుగైనవైద్య సేవలు అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రదమ చికిత్స చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలను నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు,

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    1
    .  సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. 
మట్టా రాగమయి దయానంద్ 
ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    2
    సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా  మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    1
    అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ
అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో  అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా  డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    1
    మండపేట టౌన్ న్యూస్...
అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో  అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా  డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
    1
    హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి
ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం,  నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం
అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు
మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు
జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు
ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    19 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.