Shuru
Apke Nagar Ki App…
యువత క్రీడలలో రాణించాలి యువత క్రీడలలో రాణించాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు, విద్యార్థులు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను నిర్వహిస్తారన్నారు.
Gourinatha p.g
యువత క్రీడలలో రాణించాలి యువత క్రీడలలో రాణించాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు, విద్యార్థులు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను నిర్వహిస్తారన్నారు.
More news from Telangana and nearby areas
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1
- భారత్ మాత కి జై 🇮🇳1
- యాదాద్రి జిల్లా.. నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే కుంభం..1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- పెద్దవాగు బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పెద్దవాగు బ్రిడ్జి పైన వాహన రద్దీ పెరగడంతో బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సుమారు 45 నిమిషాల పాటు వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అన్ని వాహనాలు ఒకేసారి రావడంతో కొన్ని వాహనాలు నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది 45 నిమిషాల తర్వాత అన్ని వాహనాలు వెళ్లిపోయాయి.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫేక్ మొబైల్ నంబర్‌లతో జిల్లా ఎస్పీ సంకీర్త్ పేరుతో సైబర్ మోసగాళ్లు వాట్సాప్ సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంలో ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.1
- 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.1