వన మహోత్సవంలో భాగంగా స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్.... ఖానాపూర్ మండలం, ఆగస్టు 25 : వన మహోత్సవంలో భాగంగా ఖానాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో, ప్రధాన రహదారి వెంబడి మొక్కలు నాటారు. మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ.... చిన్నతనం నుండే పిల్లలలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించాలని, చెట్టును నాటి దానిని కాపాడితే అది మనకు ప్రాణవాయువును ఇస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సునీత, ఉపసర్పంచ్ ఉప్పు రాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
వన మహోత్సవంలో భాగంగా స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్.... ఖానాపూర్ మండలం, ఆగస్టు 25 : వన మహోత్సవంలో భాగంగా ఖానాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో, ప్రధాన రహదారి వెంబడి మొక్కలు నాటారు. మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ.... చిన్నతనం నుండే పిల్లలలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించాలని, చెట్టును నాటి దానిని కాపాడితే అది మనకు ప్రాణవాయువును ఇస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సునీత, ఉపసర్పంచ్ ఉప్పు రాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- హుస్నాబాద్ 20వ వార్డులో పందుల బెడద................... ......... హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- రంగశాయిపేటలో ఘనంగా వనమహోత్సవం.. మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ వరంగల్: ఖిలా వరంగల్ పరిధిలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రకృతి సంపద సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్) ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.1