Shuru
Apke Nagar Ki App…
జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Devender Pasunoori
జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు.. *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు..1
- సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.2
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్ వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు గురువారం వరంగల్ కి వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.1
- ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: నాయిని హనుమకొండ జిల్లా: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగ వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు.1
- అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.3
- రామంచ ప్రైమరీ స్కూల్ లో రాఖీ పర్వదిన వేడుకలు....రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విద్యార్థులు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్ల సమక్షంలో విద్యార్థులు సోదరీ సోదర భావంతో రాఖీలు కట్టుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ టీచర్ చీల పద్మా తోపాటు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.1
- మార్పులు ప్రధాన కారణం హిమాలయాల్లో భూతాపం తినడం వల్ల మంచు గడ్డలు వేగంగా కరిగి పెద్ద సరస్సుగా మారుతాయి టిబెట్,నేపాల్ ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన తీవ్రమైన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటానికి గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్స్ (GLOFs)తీవ్రమైన మేఘావృత్త వర్షాలు (Cloudbursts)మరియు వాతావరణ మార్పులు (Climate Change)ప్రధాన కారణాలు.* వరదలకు మరియు తీవ్ర వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు *గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ (GLOF):* హిమాలయాల్లో భూతాపం పెరగడం వల్ల మంచు గడ్డలు (Glaciers) వేగంగా కరిగి పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. ఈ సరస్సుల గట్లు తీవ్రమైన వర్షాలకు లేదా భూకంపాలకు ఒక్కసారిగా తెగిపోయినప్పుడు 'గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్' జరిగి గియిరోంగ్ పోర్ట్ (Gyirong Port) వంటి సరిహద్దు ప్రాంతాలపైకి సునామీలా బురద వరదలు విరుచుకుపడతాయి. *గ్లోబల్ వార్మింగ్ (భూతాపం పెరగడం):*ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల కంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరిగి,అనుకోని సమయంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. *వర్షాకాలంలో మార్పులు :* అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో భారీ వర్షం ప1
- అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి 10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల జేఏసీ మహా ధర్నా... వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు వేణుగోపాల్, రాంకిషన్ కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.1