logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైలు నుంచి జారిపడి టీచర్ మృతి.. భార్యను వెతికి వస్తుండగా విషాదం భార్యను వెతుక్కుంటూ హైదరాబాద్‌ వెళ్లి తిరిగి వస్తున్న ఓ ఉపాధ్యాయుడు రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్లకు చెందిన జాటోతు సుందర్‌ (50) ఏపీలోని మైలవరం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మతిస్థిమితం లేని తన భార్యను హైదరాబాద్‌లో వెతికేందుకు వెళ్లిన సుందర్‌.. తిరుగు ప్రయాణంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుందర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2 hrs ago
user_ఖమ్మం రిపోర్టర్
ఖమ్మం రిపోర్టర్
ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
2 hrs ago
81f0e5f9-2170-47e7-b533-87294c0bf3c7

రైలు నుంచి జారిపడి టీచర్ మృతి.. భార్యను వెతికి వస్తుండగా విషాదం భార్యను వెతుక్కుంటూ హైదరాబాద్‌ వెళ్లి తిరిగి వస్తున్న ఓ ఉపాధ్యాయుడు రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్లకు చెందిన జాటోతు సుందర్‌ (50) ఏపీలోని మైలవరం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మతిస్థిమితం లేని తన భార్యను హైదరాబాద్‌లో వెతికేందుకు వెళ్లిన సుందర్‌.. తిరుగు ప్రయాణంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుందర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
    1
    ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు 
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.టైటిల్: 🚨 హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 20 మందికి తీవ్ర గాయాలు హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.టైటిల్:
🚨 హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 20 మందికి తీవ్ర గాయాలు
హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • మంగాపురం మేజర్ కాల్వకు నీరు రావడం లేదని గ్రామానికి చెందిన రైతులు సీఈకి పిర్యాదు చేసారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం మేజర్ కాల్వకు నీరు రావడం లేదని గ్రామానికి చెందిన రైతులు సీఈకి పిర్యాదు చేసారు.రాజేశ్వర పురం వద్ద ప్రారంభమయ్యే నందిగామ బ్రాంచ్ కెనాల్ నుంచి చెరువుమాధారం చెరువు నింపేందుకు కేవలం 300 క్యూసెకుల నీటిని విడుదల చేస్తుండడం తో మంగాపురం కాల్వకు నీరు చేరలేదు. చెరు వుమాధారం, అప్పలనరసింహాపురం చెరువులకు చేరడానికి ఇంకా పది రోజులైనా పడుతుందని రైతులు సీఈ వాసంతికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆమె మంగాపురం మేజర్ కాల్వ పరిశీలనకు వచ్చారు. 'మంగాపురం మేజరుకు ఎంత నీరు అందిస్తున్నారు, ఇబ్బందులు ఉన్న విషయాన్ని తనకెందుకు చెప్పలేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే మంగాపురం మేజర్,నందిగామ బ్రాంచ్ కెనాళ్లకు 800 క్యూసెకుల నీరు విడుదల చేయాలని సీఈ ఆదేశించారు.
    1
    మంగాపురం మేజర్ కాల్వకు నీరు రావడం లేదని గ్రామానికి చెందిన రైతులు సీఈకి పిర్యాదు చేసారు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి 
మండలం మంగాపురం మేజర్ కాల్వకు నీరు రావడం లేదని గ్రామానికి చెందిన రైతులు సీఈకి పిర్యాదు చేసారు.రాజేశ్వర పురం వద్ద ప్రారంభమయ్యే నందిగామ బ్రాంచ్ కెనాల్ నుంచి చెరువుమాధారం చెరువు నింపేందుకు కేవలం 300 క్యూసెకుల నీటిని విడుదల చేస్తుండడం తో మంగాపురం కాల్వకు నీరు చేరలేదు. చెరు వుమాధారం, అప్పలనరసింహాపురం చెరువులకు చేరడానికి ఇంకా పది రోజులైనా పడుతుందని రైతులు సీఈ వాసంతికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆమె మంగాపురం మేజర్ కాల్వ పరిశీలనకు వచ్చారు. 'మంగాపురం మేజరుకు ఎంత నీరు అందిస్తున్నారు, ఇబ్బందులు ఉన్న విషయాన్ని తనకెందుకు చెప్పలేదు  అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే మంగాపురం మేజర్,నందిగామ బ్రాంచ్ కెనాళ్లకు 800 క్యూసెకుల నీరు విడుదల చేయాలని  సీఈ ఆదేశించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 min ago
  • తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్.. మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది.. ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..
    1
    తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్..
మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది..
ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.
    1
    మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్
పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం
సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్
పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం
సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి.
పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.
డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు.
సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం
మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.
“పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.
    user_Hatkar Rambabu
    Hatkar Rambabu
    Farmer సింగరేణి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊
    1
    ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన
*మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన*
*గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊
    user_గొల్లపల్లి సురేష్
    గొల్లపల్లి సురేష్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    1
    కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్.....
మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ
*ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు
లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్  అన్నారు.
నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్  ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.
మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్  అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న  మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి  ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు.
వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు.
సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు.
సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు.
ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు.
CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు.
సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు.
ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.
    1
    ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం
వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.