Shuru
Apke Nagar Ki App…
అన్నా చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతలకు ప్రతిరూపమైన ఈ పవిత్రమైన రోజున ప్రతి సోదర, సోదరీమణుల కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అన్నాచెల్లెళ్ల అనుబంధం కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ… మీ తాతయ్య, అమ్మమ్మ, సతివాడ వెంకటరావు. సతివాడ రాజేశ్వరి.
Sativada Venkatarao
అన్నా చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతలకు ప్రతిరూపమైన ఈ పవిత్రమైన రోజున ప్రతి సోదర, సోదరీమణుల కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అన్నాచెల్లెళ్ల అనుబంధం కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ… మీ తాతయ్య, అమ్మమ్మ, సతివాడ వెంకటరావు. సతివాడ రాజేశ్వరి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 🌿 From the cotton field to everyday comfort. A little CGI imagination brings the journey to life. ☁️👕 MGM Vests — Born from Nature. Made for Comfort. Hashtags: #MGMVests #Cotton #Comfort #MensVest #MadeInIndia1
- స్వగ్రామంలో సుదీర్ఘ ప్రజా దర్బార్ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం సుదీర్ఘ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఓపిగ్గా నిర్వహించారు. ఈ గ్రామం ఆయన స్వగ్రామం కావడం విశేషం. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమoలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి అర్జీదారులకు భరోసా కల్పించారు.1
- ఇరుముడి సినిమా కాదు..! గిరిజన విద్యార్థుల చదువుకోసం పోరాటం..! మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాల (APTWR ఇంగ్లీష్ మీడియం పాఠశాల) ను ఎత్తివేసి.. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలిగించేలా పాఠశాలను ఎత్తివేయొద్దని.. విద్యార్థులను తరలించొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పెంచాల్సిన సమయంలో.. ఉన్న పాఠశాలను ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులను మరోచోటికి తరలిస్తే.. వారి చదువుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు చేస్తున్న ఈ నిరసనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.1
- సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు1
- *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa1
- కోరుకొండ మండలం శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతనలో లో సరస్వతి సామూహిక అక్షరాభ్యాసం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతనలో లో సరస్వతి సామూహిక అక్షరాభ్యాసం1
- వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.1
- రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.1
- *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.3