*ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.
*ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం
వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ
సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.
- *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.3
- రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.1
- హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు *హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* - జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు* రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.1
- కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.3
- *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో ప్రమాద భరితంగా మారిన విద్యుత్ స్తంభం పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా మారింది. పెడన మెయిన్ రోడ్ లోని సంత మార్కెట్ సమీపం డాక్టర్ అశోక్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు డివైడర్ పై ఉన్న విద్యుత్ లైట్ స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లారీ రివర్స్ చేస్తా ఉండగా స్తంభానికి తాకడం వల్ల స్తంభం పాక్షికంగా దెబ్బతిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రతిక్షణం వందలాది వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం కూలితే ఘోర ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు పెడన పోలీస్ శాఖ అధికారులుస్పందించి యుద్ధ ప్రాతిపదికన కోలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభంకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.1
- కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.1