logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కాజీపూర్ ఇసుక క్వారీ వద్ద గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ కోమటిరెడ్డి అంజన్ కుమార్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ నిరసనలో పాల్గొని ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజన్ కుమార్ మరియు మాజీ ప్రజా ప్రతినిధి సోమినేని తిరుపతి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ఏళ్లుగా కాజీపూర్ శివారులో టిజిఎండిసి ఆధ్వర్యంలో ఇసుకను చుట్టుపక్కల గ్రామ అవసరాల కోసం నిబంధనలకు అనుగుణంగా తరలించేవారని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఒక కంపెనీకి సుమారు ₹1457 కోట్ల రూపాయలకు కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, ఎల్ఎండి ప్రాజెక్టులలో ఒక టీఎంసీ నీటి పెరుగుదల కోసం ఇసుక తరలింపు ప్రక్రియను అప్పగించిందని ఆరోపించారు. సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలకు మాత్రమే ఉండే ఒప్పందాలను పక్కనపెట్టి, ఏకంగా 20 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రలో శోచనీయమని, దీన్ని ప్రశ్నించారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందాన్ని అలుసుగా తీసుకున్న కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంప్ చేసి లక్షల కోట్లు దండుకుంటున్నదని వారు ఆరోపించారు. గతంలో టిఎస్ఎండిఎస్ ద్వారా సాండ్ టాక్స్ అమలు చేయగా, దాని ద్వారా గ్రామస్తులకు ఉపాధి లభించడమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక కొరత లేకుండా ఉండేదని వివరించారు. అయితే, ప్రస్తుత కంపెనీ గ్రామస్తులకు చెందిన ఒక్క ట్రాక్టర్ ఇసుకను కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నదని, సాగునీటి కోసం వాగులో రెండు కిలోమీటర్ల పొడవుతో మోటార్లు వేసుకొని సాగు చేసుకుంటున్న రైతుల మోటార్లను ఇసుక తరలింపు కోసం తొలగిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులు వ్యవసాయం చేసుకునేదెలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు ఇసుక తరలింపు వల్ల సాగునీటికే కాకుండా త్రాగునీటికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, గ్రామం వలసపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, టిఎస్ఎండిఎస్ ద్వారా స్థానిక గ్రామ ప్రజలకు ఇసుక తరలింపుకు సాండ్ టాక్స్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రాబోయే రోజుల్లో ఇసుక తరలింపును అడ్డుకునేందుకు కలెక్టరేట్, క్వారీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కాజీపూర్ ఇసుక క్వారీ వద్ద గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ కోమటిరెడ్డి అంజన్ కుమార్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ నిరసనలో పాల్గొని ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజన్ కుమార్ మరియు మాజీ ప్రజా ప్రతినిధి సోమినేని తిరుపతి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ఏళ్లుగా కాజీపూర్ శివారులో టిజిఎండిసి ఆధ్వర్యంలో ఇసుకను చుట్టుపక్కల గ్రామ అవసరాల కోసం నిబంధనలకు అనుగుణంగా తరలించేవారని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం

ప్రభుత్వం ఒక కంపెనీకి సుమారు ₹1457 కోట్ల రూపాయలకు కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, ఎల్ఎండి ప్రాజెక్టులలో ఒక టీఎంసీ నీటి పెరుగుదల కోసం ఇసుక తరలింపు ప్రక్రియను అప్పగించిందని ఆరోపించారు. సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలకు మాత్రమే ఉండే ఒప్పందాలను పక్కనపెట్టి, ఏకంగా 20 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రలో శోచనీయమని, దీన్ని ప్రశ్నించారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందాన్ని అలుసుగా తీసుకున్న కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంప్ చేసి లక్షల కోట్లు దండుకుంటున్నదని వారు ఆరోపించారు. గతంలో టిఎస్ఎండిఎస్ ద్వారా సాండ్ టాక్స్ అమలు చేయగా, దాని ద్వారా గ్రామస్తులకు ఉపాధి లభించడమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక కొరత లేకుండా ఉండేదని వివరించారు. అయితే, ప్రస్తుత కంపెనీ గ్రామస్తులకు చెందిన ఒక్క ట్రాక్టర్

ఇసుకను కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నదని, సాగునీటి కోసం వాగులో రెండు కిలోమీటర్ల పొడవుతో మోటార్లు వేసుకొని సాగు చేసుకుంటున్న రైతుల మోటార్లను ఇసుక తరలింపు కోసం తొలగిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులు వ్యవసాయం చేసుకునేదెలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు ఇసుక తరలింపు వల్ల సాగునీటికే కాకుండా త్రాగునీటికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, గ్రామం వలసపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, టిఎస్ఎండిఎస్ ద్వారా స్థానిక గ్రామ ప్రజలకు ఇసుక తరలింపుకు సాండ్ టాక్స్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రాబోయే రోజుల్లో ఇసుక తరలింపును అడ్డుకునేందుకు కలెక్టరేట్, క్వారీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్‌ను దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతుండగా కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. చనిపోయాడని అందరూ భావిస్తున్న ఈ కరుడుగట్టిన నేరస్తుడిని వలవేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై మానభంగం కేసు తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ధూమ్ ఖాలీద్‌పై దాడి చేసి తీవ్రంగా చితకబాది, కాళ్లపై బండరాళ్లతో మోదారు. ఆసుపత్రిలో అతనికి రెండు కాళ్లు తీసేశారు వైద్యులు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ధూమ్ ఖాలీద్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. పదేళ్లుగా కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్ష తదితర ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నాడు. రెండు కాళ్లు లేకపోయినా, మహారాష్ట్రలో గ్యాంగులను ఏర్పాటు చేసుకుని ధూమ్ ఖాలీద్ తన నేర ప్రవృత్తిని కొనసాగించాడు. బిక్షగాడి వేషంలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ, వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో పలు క్రిమినల్ కేసుల్లో పాల్గొన్న ధూమ్ ఖాలీద్ కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. పలు కేసుల్లో శిక్ష పడిన ఖాలీద్ పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 5, వన్ టౌన్‌లో 2, టూ టౌన్‌లో 1 కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష, చంద్రపూర్ లలో కూడా కేసులు నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసుకుని యువతను నేరాలకు ఉసిగొల్పేవాడు. కరీంనగర్‌లో ధూమ్ ఖాలీద్ పాల్పడిన దాదాపు వంద ఘటనలపై కేసులు నమోదు కాలేదని, ఫిర్యాదులు ఇవ్వలేదని తెలుస్తోంది. కరీంనగర్‌లోని మూడు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో ధూమ్ ఖాలీద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అతని గురించి వాకబు చేయగా చనిపోయాడన్న సమాధానమే రావడంతో అతని ఆచూకీ దొరకడం కష్టమేనని అనుకున్నారు. అయితే, హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో నివసిస్తున్న ధూమ్ ఖాలీద్ భార్యను గత ఆరు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యను హతమార్చేందుకు స్కెచ్ వేయడంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడని పోలీసులు సమాచారం అందుకున్నారు. సోమవారం ధూమ్ ఖాలీద్ కరీంనగర్ వచ్చాడన్న పక్కా సమాచారం మేరకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగతా కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు, ఇప్పటికే శిక్షలు పడినందున అతను జైలుకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దశాబ్ద కాలంగా తప్పించుకుంటున్న ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, పోలీసు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కూడా సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని అభినందించి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఘరానా క్రిమినల్ అయిన ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంపై కరీంనగర్ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడు జైళ్లోనే ఉండేలా చూడాలని, బయటకు వస్తే మరిన్ని దారుణాలకు ఒడిగట్టే ప్రమాదం ఉందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ధూమ్ ఖాలీద్ చేసిన నేరాలను గమనించి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్‌ను దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతుండగా కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. చనిపోయాడని అందరూ భావిస్తున్న ఈ కరుడుగట్టిన నేరస్తుడిని వలవేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై మానభంగం కేసు తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ధూమ్ ఖాలీద్‌పై దాడి చేసి తీవ్రంగా చితకబాది, కాళ్లపై బండరాళ్లతో మోదారు. ఆసుపత్రిలో అతనికి రెండు కాళ్లు తీసేశారు వైద్యులు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ధూమ్ ఖాలీద్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు.

పదేళ్లుగా కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్ష తదితర ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నాడు. రెండు కాళ్లు లేకపోయినా, మహారాష్ట్రలో గ్యాంగులను ఏర్పాటు చేసుకుని ధూమ్ ఖాలీద్ తన నేర ప్రవృత్తిని కొనసాగించాడు. బిక్షగాడి వేషంలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ, వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో పలు క్రిమినల్ కేసుల్లో పాల్గొన్న ధూమ్ ఖాలీద్ కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. పలు కేసుల్లో శిక్ష పడిన ఖాలీద్ పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 5, వన్ టౌన్‌లో 2, టూ టౌన్‌లో 1 కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష, చంద్రపూర్ లలో కూడా కేసులు నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసుకుని యువతను నేరాలకు ఉసిగొల్పేవాడు. కరీంనగర్‌లో ధూమ్ ఖాలీద్ పాల్పడిన దాదాపు వంద ఘటనలపై కేసులు నమోదు కాలేదని, ఫిర్యాదులు ఇవ్వలేదని తెలుస్తోంది.

కరీంనగర్‌లోని మూడు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో ధూమ్ ఖాలీద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అతని గురించి వాకబు చేయగా చనిపోయాడన్న సమాధానమే రావడంతో అతని ఆచూకీ దొరకడం కష్టమేనని అనుకున్నారు. అయితే, హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో నివసిస్తున్న ధూమ్ ఖాలీద్ భార్యను గత ఆరు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యను హతమార్చేందుకు స్కెచ్ వేయడంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడని పోలీసులు సమాచారం అందుకున్నారు. సోమవారం ధూమ్ ఖాలీద్ కరీంనగర్ వచ్చాడన్న పక్కా సమాచారం మేరకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగతా కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు, ఇప్పటికే శిక్షలు పడినందున అతను జైలుకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దశాబ్ద కాలంగా తప్పించుకుంటున్న ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, పోలీసు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కూడా సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని అభినందించి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఘరానా క్రిమినల్ అయిన ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంపై కరీంనగర్ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడు జైళ్లోనే ఉండేలా చూడాలని, బయటకు వస్తే మరిన్ని దారుణాలకు ఒడిగట్టే ప్రమాదం ఉందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ధూమ్ ఖాలీద్ చేసిన నేరాలను గమనించి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలోని హనుమాజిపల్లి గ్రామ రైతులు స్థానిక డీసీఎంఎస్ కేంద్రంలో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంగపల్లిలోని ఐకేపీ కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు ఉన్నప్పటికీ, సిబ్బంది కమీషన్ల కోసం అక్కడ వడ్లు కొనుగోలు చేయవద్దని చెబుతున్నారని రైతులు తీవ్రంగా ఆరోపించారు. ఈ నెల 20న తూకం వేయాల్సిన వడ్లు సైతం ఇప్పటికీ కొలవలేదని, దీనివల్ల వర్షాలు కురిస్తే తమ పంట పూర్తిగా నష్టపోతామని రైతులు వాపోయారు. తమ పంటలకు నష్టం వాటిల్లకముందే వడ్ల కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని హనుమాజిపల్లి గ్రామ రైతులు గట్టిగా డిమాండ్ చేశారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలోని హనుమాజిపల్లి గ్రామ రైతులు స్థానిక డీసీఎంఎస్ కేంద్రంలో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంగపల్లిలోని ఐకేపీ కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు ఉన్నప్పటికీ, సిబ్బంది కమీషన్ల కోసం అక్కడ వడ్లు కొనుగోలు చేయవద్దని చెబుతున్నారని రైతులు తీవ్రంగా ఆరోపించారు. ఈ నెల 20న తూకం వేయాల్సిన వడ్లు సైతం ఇప్పటికీ కొలవలేదని, దీనివల్ల వర్షాలు కురిస్తే తమ పంట పూర్తిగా నష్టపోతామని రైతులు వాపోయారు.

తమ పంటలకు నష్టం వాటిల్లకముందే వడ్ల కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని హనుమాజిపల్లి గ్రామ రైతులు గట్టిగా డిమాండ్ చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో VOAలు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు) చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ VOAలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా VOAలు ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లను వినిపించారు. తమకు కనీస వేతనం రూ.20,000 ఇవ్వాలని, SERP ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీని అమలు చేయాలని కోరారు. అర్హులైన VOAలకు CCలుగా పదోన్నతి కల్పించాలని, సాధారణ మరియు ఆరోగ్య బీమా సౌకర్యంగా రూ.20 లక్షల వరకు భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే, యూనిఫాం, నెట్ సౌకర్యాలు అందించాలని, 58 G.O.ను సవరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం సిగ్గుచేటని VOAలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో VOAలు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు) చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ VOAలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు.

ఈ సందర్భంగా VOAలు ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లను వినిపించారు. తమకు కనీస వేతనం రూ.20,000 ఇవ్వాలని, SERP ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీని అమలు చేయాలని కోరారు. అర్హులైన VOAలకు CCలుగా పదోన్నతి కల్పించాలని, సాధారణ మరియు ఆరోగ్య బీమా సౌకర్యంగా రూ.20 లక్షల వరకు భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే, యూనిఫాం, నెట్ సౌకర్యాలు అందించాలని, 58 G.O.ను సవరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం సిగ్గుచేటని VOAలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • ఒత్తిడి, ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల అనుభవంతో కూడిన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసిన ఓ మహిళ, ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న వివరాల ప్రకారం, ఆమె తన కెరీర్ మార్చుకోవడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేల వరకు సంపాదిస్తూ, మానసిక ప్రశాంతతతో సాఫీగా జీవిస్తున్నట్లు తెలిపారు. పని ఒత్తిడి కంటే సంతోషమే ముఖ్యమని ఆమె నిరూపించారు.
    1
    ఒత్తిడి, ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల అనుభవంతో కూడిన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసిన ఓ మహిళ, ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న వివరాల ప్రకారం, ఆమె తన కెరీర్ మార్చుకోవడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేల వరకు సంపాదిస్తూ, మానసిక ప్రశాంతతతో సాఫీగా జీవిస్తున్నట్లు తెలిపారు. పని ఒత్తిడి కంటే సంతోషమే ముఖ్యమని ఆమె నిరూపించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    20 hrs ago
  • గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధికారులు మరియు నాయకులు మొదటగా ఒక డబ్బాను JCBతో తొలగించి, దానిని ఏదో సాధించినట్టుగా చూపించారు. అయితే, ముడుపులు అందకపోవడంతోనే ఆ డబ్బాను తొలగించినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా, తొలగించినప్పుడు స్లాబ్ లేని ఆ డబ్బాకు, తొలగింపు తర్వాత స్లాబులు వేశారు. ముడుపులు అందినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆగిపోయిన పనిని తిరిగి ప్రారంభించడం చూస్తుంటే అధికారులు మరియు నాయకులు అమ్ముడుపోయారనే భావన కలుగుతోందని స్పష్టమవుతోంది. ఇదే మున్సిపాలిటీలో, ప్రభుత్వానికి లక్షల్లో D.D.లు కట్టిన తర్వాత కూడా సాధారణ ప్రజలకు మాత్రం ఏదో ఒక సాకులు చెబుతూ ఇప్పటికీ పర్మిషన్లు ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఇలా అక్రమంగా కట్టిన వాటికి మున్సిపల్ సిబ్బంది ఇంత తొందరగా అనుమతులు ఎలా ఇస్తున్నారని తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
    1
    గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధికారులు మరియు నాయకులు మొదటగా ఒక డబ్బాను JCBతో తొలగించి, దానిని ఏదో సాధించినట్టుగా చూపించారు. అయితే, ముడుపులు అందకపోవడంతోనే ఆ డబ్బాను తొలగించినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా, తొలగించినప్పుడు స్లాబ్ లేని ఆ డబ్బాకు, తొలగింపు తర్వాత స్లాబులు వేశారు. ముడుపులు అందినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆగిపోయిన పనిని తిరిగి ప్రారంభించడం చూస్తుంటే అధికారులు మరియు నాయకులు అమ్ముడుపోయారనే భావన కలుగుతోందని స్పష్టమవుతోంది.

ఇదే మున్సిపాలిటీలో, ప్రభుత్వానికి లక్షల్లో D.D.లు కట్టిన తర్వాత కూడా సాధారణ ప్రజలకు మాత్రం ఏదో ఒక సాకులు చెబుతూ ఇప్పటికీ పర్మిషన్లు ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఇలా అక్రమంగా కట్టిన వాటికి మున్సిపల్ సిబ్బంది ఇంత తొందరగా అనుమతులు ఎలా ఇస్తున్నారని తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • ములుగు జిల్లాలోని గోదావరి లోయ, నక్సల్‌బరీ ఉద్యమానికి పురుడు పోసి, అజ్ఞాత సాయుధ దళాలకు ఆశ్రయం ఇచ్చిన చారిత్రక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది. ఈ సందర్భంలో, జిల్లా కేంద్రంలో సీపీయూఎస్ఐ అమరుల స్మారకంగా నిర్మించిన అమరుల స్తూపం దాదాపు 20 ఏళ్ల తర్వాత పూర్తి ఎరుపు రంగులోకి మారింది. ఇన్నాళ్లు తెలుపు రంగులో ఉన్న ఈ స్తూపం, తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘అరుణ వర్ణం’ దాల్చింది. అయితే, స్తూపంపై ఉన్న సుత్తి–కొడవలి గుర్తులపై ఉన్న ముసుగు ఇంకా తొలగించబడలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
    1
    ములుగు జిల్లాలోని గోదావరి లోయ, నక్సల్‌బరీ ఉద్యమానికి పురుడు పోసి, అజ్ఞాత సాయుధ దళాలకు ఆశ్రయం ఇచ్చిన చారిత్రక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది. ఈ సందర్భంలో, జిల్లా కేంద్రంలో సీపీయూఎస్ఐ అమరుల స్మారకంగా నిర్మించిన అమరుల స్తూపం దాదాపు 20 ఏళ్ల తర్వాత పూర్తి ఎరుపు రంగులోకి మారింది.

ఇన్నాళ్లు తెలుపు రంగులో ఉన్న ఈ స్తూపం, తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘అరుణ వర్ణం’ దాల్చింది. అయితే, స్తూపంపై ఉన్న సుత్తి–కొడవలి గుర్తులపై ఉన్న ముసుగు ఇంకా తొలగించబడలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించడంతో కరీంనగర్‌లో అభిమానుల హంగామా శృతి మించింది. కొందరు యువకులు అర్ధరాత్రి బైకులపై నగరంలో తిరుగుతూ వీరంగం సృష్టించారు. వారు వాహనాలను అడ్డుకుని, వాటిపై దాడికి ప్రయత్నించారు. ముఖ్యంగా కమాన్ వద్ద అభిమానం మితిమీరింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి యువకులను చెదరగొట్టారు. అభిమానం ఉండాలి కానీ, ఇలా హంగామా చేసి వీరంగం సృష్టించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
    1
    ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించడంతో కరీంనగర్‌లో అభిమానుల హంగామా శృతి మించింది. కొందరు యువకులు అర్ధరాత్రి బైకులపై నగరంలో తిరుగుతూ వీరంగం సృష్టించారు. వారు వాహనాలను అడ్డుకుని, వాటిపై దాడికి ప్రయత్నించారు. ముఖ్యంగా కమాన్ వద్ద అభిమానం మితిమీరింది.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి యువకులను చెదరగొట్టారు. అభిమానం ఉండాలి కానీ, ఇలా హంగామా చేసి వీరంగం సృష్టించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీలో గల స్వయం హోటల్‌లో సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతు ప్రభుత్వం అంటే రైతులపై కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం రైతులపై పగపడుతున్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే ధాన్యం కొనుగోలుపై చర్చకు రావాలని ఎమ్మెల్యే సత్యంకు రవి శంకర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పగటిపూట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు నిలదీస్తారని, అందుకే ఆయన రాత్రివేళ దొంగల మాదిరిగా వచ్చి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని సుంకె రవి శంకర్ ఆరోపించారు. కేవలం రీల్స్ కోసం మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన, లారీలు ఎక్కి స్టంట్లు చేయడం తప్ప రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేస్తున్న రైతులను ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేస్తున్నారని, రౌడీలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, చొప్పదండిలో నియంత పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. అన్నాడి దామోదర్ రెడ్డి, మహిపాల్ అనే రైతులపై కేసులు నమోదు అయ్యాయని, మొత్తం 8 మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభంపల్లి కరుణాకర్ అనే యువకునిపై అక్రమ కేసులు పెట్టి 14 రోజులు జైల్లో ఉంచారని తెలిపారు. ధైర్యం ఉంటే తనపై కేసు పెట్టాలని, కానీ అన్నం పెట్టే అమాయక రైతులపై కేసులు పెట్టవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చొప్పదండి నియోజకవర్గ రైతులపై అక్రమ కేసులు నమోదు చేయించి వారిని ఏడిపిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీలో గల స్వయం హోటల్‌లో సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతు ప్రభుత్వం అంటే రైతులపై కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం రైతులపై పగపడుతున్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే ధాన్యం కొనుగోలుపై చర్చకు రావాలని ఎమ్మెల్యే సత్యంకు రవి శంకర్ సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే పగటిపూట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు నిలదీస్తారని, అందుకే ఆయన రాత్రివేళ దొంగల మాదిరిగా వచ్చి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని సుంకె రవి శంకర్ ఆరోపించారు. కేవలం రీల్స్ కోసం మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన, లారీలు ఎక్కి స్టంట్లు చేయడం తప్ప రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేస్తున్న రైతులను ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేస్తున్నారని, రౌడీలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, చొప్పదండిలో నియంత పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

అన్నాడి దామోదర్ రెడ్డి, మహిపాల్ అనే రైతులపై కేసులు నమోదు అయ్యాయని, మొత్తం 8 మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభంపల్లి కరుణాకర్ అనే యువకునిపై అక్రమ కేసులు పెట్టి 14 రోజులు జైల్లో ఉంచారని తెలిపారు. ధైర్యం ఉంటే తనపై కేసు పెట్టాలని, కానీ అన్నం పెట్టే అమాయక రైతులపై కేసులు పెట్టవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చొప్పదండి నియోజకవర్గ రైతులపై అక్రమ కేసులు నమోదు చేయించి వారిని ఏడిపిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలలు, హాస్టళ్లకు తిరిగి వెళ్లే ముందు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్య చండీహోమం, నిత్య కల్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చన, ఆకుల పూజ వంటి విశేష పూజల్లో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో ఎల్. రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, కోడె మొక్కుల క్యూలైన్ల వద్ద ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, కోడెలకు దారాలతో అల్లిన దండలు వేయరాదని, కొబ్బరికాయలను ఎక్కడపడితే అక్కడ కొట్టకుండా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలోనే కొట్టాలని భక్తులకు సూచించారు. దీనివల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రత కూడా కాపాడబడుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే, వేసవికాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఆలయంలో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయడంతో భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలలు, హాస్టళ్లకు తిరిగి వెళ్లే ముందు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఉదయం నుంచే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్య చండీహోమం, నిత్య కల్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చన, ఆకుల పూజ వంటి విశేష పూజల్లో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో ఎల్. రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, కోడె మొక్కుల క్యూలైన్ల వద్ద ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, కోడెలకు దారాలతో అల్లిన దండలు వేయరాదని, కొబ్బరికాయలను ఎక్కడపడితే అక్కడ కొట్టకుండా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలోనే కొట్టాలని భక్తులకు సూచించారు. దీనివల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రత కూడా కాపాడబడుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే, వేసవికాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఆలయంలో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయడంతో భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.