Shuru
Apke Nagar Ki App…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల మానవత్వం మరోసారి వెలుగుచూసింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల మానవత్వం మరోసారి వెలుగుచూసింది అప్రమత్తంగా స్పందించి అడవిని, అందులోని మూగజీవులను కాపాడిన ఘటన ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లె అడవిలో మంటలు వేగంగా వ్యాపిస్తున్న సమయంలో అదే దారిలో కేసు విచారణకు వెళ్తున్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్ర చారి మంటలను గమనించారు.క్షణం ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి మంటల మధ్యకే దూసుకెళ్లిన పోలీసులు, ఎలాంటి భయాందోళనలు లేకుండా అగ్ని జ్వాలలను అదుపులోకి తెచ్చారు. భారీ ప్రమాదాన్ని ముందుగానే అడ్డుకున్నారు. అడవిలో నివసించే మూగజీవులు, చిన్న ప్రాణులు మంటల్లో కాలిపోకుండా కాపాడిన పోలీసుల ఈ చర్య స్థానికుల్లో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
Satheesh gangu
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల మానవత్వం మరోసారి వెలుగుచూసింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల మానవత్వం మరోసారి వెలుగుచూసింది అప్రమత్తంగా స్పందించి అడవిని, అందులోని మూగజీవులను కాపాడిన ఘటన ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లె అడవిలో మంటలు వేగంగా వ్యాపిస్తున్న సమయంలో అదే దారిలో కేసు విచారణకు వెళ్తున్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్ర చారి మంటలను గమనించారు.క్షణం ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి మంటల మధ్యకే దూసుకెళ్లిన పోలీసులు, ఎలాంటి భయాందోళనలు లేకుండా అగ్ని జ్వాలలను అదుపులోకి తెచ్చారు. భారీ ప్రమాదాన్ని ముందుగానే అడ్డుకున్నారు. అడవిలో నివసించే మూగజీవులు, చిన్న ప్రాణులు మంటల్లో కాలిపోకుండా కాపాడిన పోలీసుల ఈ చర్య స్థానికుల్లో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
More news from తెలంగాణ and nearby areas
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు1
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లాలో తనయుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగ, ఇక కొడుకు లేడనే నిజాన్ని తట్టుకోలేక తల్లి గుండె ఆగిపోయింది. గంటల వ్యవధిలో తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో మోతె గ్రామంలో విషాదం అలుముకుంది. మోతె గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ (25) అప్పుల బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. కొడుకు మరణ వార్తతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లవ్వ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు తల్లి–కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.3
- మెట్ పల్లి, మార్చి 18: పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్‌లను శాలువాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.3
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,1
- సిద్దిపేట జిల్లా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు.1