Shuru
Apke Nagar Ki App…
రోడ్డు ప్రమాదాలపై వికారాబాద్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దృశ్య రూప అవగాహన. వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర ఆదేశాల మేరకు పట్టణంలో పట్టణ సీఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో రోడ్డు ప్రమాదాలపై దృశ్యరూప అవగాహన కల్పించారు. పట్టణం లోని ప్రధాన కోడళ్ళు కాలనీలలో మువబుల్ ఎల్ఈడి వాహనం ద్వారా ప్రమాద దృశ్యాలను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ సీఐ రఘుకుమార్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజలలో స్వయం నియంత్రణ లేనిది మార్పు సాధ్యం కాదని, ప్రమాదాల నివారణకు సంబంధించిన మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
Thanmai Sri
రోడ్డు ప్రమాదాలపై వికారాబాద్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దృశ్య రూప అవగాహన. వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర ఆదేశాల మేరకు పట్టణంలో పట్టణ సీఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో రోడ్డు ప్రమాదాలపై దృశ్యరూప అవగాహన కల్పించారు. పట్టణం లోని ప్రధాన కోడళ్ళు కాలనీలలో మువబుల్ ఎల్ఈడి వాహనం ద్వారా ప్రమాద దృశ్యాలను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ సీఐ రఘుకుమార్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజలలో స్వయం నియంత్రణ లేనిది మార్పు సాధ్యం కాదని, ప్రమాదాల నివారణకు సంబంధించిన మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- Post by Tagore1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట * పిల్లలను తమ పిల్లలుగా భావించాలి * గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన * అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ * ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ---------------------------------1
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయా గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు.1
- *ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా *(74)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1
- ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...1
- పోతంగల్ తాసిల్దార్ కార్యాలయంలో ఇలా పోతంగల్పోతంగల్ తాసిల్దార్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నూతనంగా రావటం జరిగింది. అయితే తాసిల్దార్ కార్యాలయంలో పది గంటల ఐదు నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10:00 తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10 30 నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉంది, 10 గంటల తర్వాత ఇద్దరు అటెండర్లు ఉండగా, 10:30 తర్వాత భూషణం అనే సిబ్బంది ఉన్నారు. మిగతా సిబ్బంది లేకపోవడంతో జనం వచ్చి పనుల కోసం, అధికారుల రాక కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా తాసిల్దార్ కు ఫోన్లు వివరణ కోరగా పదిన్నర సమయంలో అందరూ ఉండాల్సి ఉంటుందని ఆఫీసులో ఎవరైనా ఉంటారు అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఆఫీసులో వెళుతున్న లైట్లు తిరుగుతున్న ఫ్యాన్లు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి విద్యుత్తు ఇలా వృధా చేస్తే ఎలా అని పలువురు ప్రశ్న వర్షం కురిపించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నూతనంగా రావటం జరిగింది. అయితే తాసిల్దార్ కార్యాలయంలో పది గంటల ఐదు నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10:00 తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10 30 నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉంది, 10 గంటల తర్వాత ఇద్దరు అటెండర్లు ఉండగా, 10:30 తర్వాత భూషణం అనే సిబ్బంది ఉన్నారు. మిగతా సిబ్బంది లేకపోవడంతో జనం వచ్చి పనుల కోసం, అధికారుల రాక కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా తాసిల్దార్ కు ఫోన్లు వివరణ కోరగా పదిన్నర సమయంలో అందరూ ఉండాల్సి ఉంటుందని ఆఫీసులో ఎవరైనా ఉంటారు అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఆఫీసులో వెళుతున్న లైట్లు తిరుగుతున్న ఫ్యాన్లు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి విద్యుత్తు ఇలా వృధా చేస్తే ఎలా అని పలువురు ప్రశ్న వర్షం కురిపించుకుంటున్నారు.4