_జిల్లా కేంద్రంలోని ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా పిలువబడే *సుభాష్ చంద్రబోస్ స్టాచు* జంక్షన్‌లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...
_జిల్లా కేంద్రంలోని ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా పిలువబడే *సుభాష్ చంద్రబోస్ స్టాచు* జంక్షన్‌లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...
- జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.1
- ఈరోజు సుధనపల్లి గ్రామంలో Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.1
- Post by JADI RAJU1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్‌పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.2
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- జనగామ జిల్లా శివునిపల్లిలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లి పరీక్ష హాలులోకి వెళ్లగా, ఆమె పెద్ద కుమారుడు తమ్ముడిని చూసుకున్నాడు. పరీక్ష పూర్తయ్యే వరకు చిన్నారిని ఆడిస్తూ, తల్లికి ధైర్యం చెప్పిన ఆ బాలుడిని స్థానికులు అభినందించారు. చదువుపై ఆసక్తితో చంటి పిల్లలతోనే మహిళలు పరీక్షలకు హాజరవడం విశేషంగా మారింది.1
- యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1