Shuru
Apke Nagar Ki App…
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ https://www.youtube.com/live/5cbV6XODed0?si=GvKaB8UWGk_DwTcL
Kumar
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ https://www.youtube.com/live/5cbV6XODed0?si=GvKaB8UWGk_DwTcL
More news from Andhra Pradesh and nearby areas
- కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు గజపతినగరంలో కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేసిన ప్రజానాయకుడు అల్తి అప్పలనాయుడని కొనియాడారు. కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓమ్మి రమణ, పురం అప్పారావు, బెల్లాన శ్రీను, కోట అప్పారావు, కర్రి సురేష్, కనిమెరక శేషగిరి, తమ్మినేని కృష్ణ, లెంక ఆది, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.1
- నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా .. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.1
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.1
- *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామ్మోహన్ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...1
- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- సిమెంట్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి - భారత కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో అనేకమంది పేదలు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేసి సగంలో ఆపేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమును పెంపుదల చేసి లబ్ధిదారులుతో గృహ నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టినప్పటికీ వాస్తవ లబ్ధిదారులకు తెలియకుండా పాలకొండలో ఉన్న హౌసింగ్ ఏఈ గారు 56 మందికి మనిషి ఒక్కటికి 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినట్లు రికార్డ్ చేసి పక్కదారి పట్టించడంతో సమస్య అధికారుల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో మీడియా ద్వారా బయటికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారులు జరిగిన మోసాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కోరాడ వీధిలో ఉన్న సచివాలయం వద్ద హౌసింగ్ ఈఈ గారి సమక్షంలో జరుగుతున్న విచారణ వద్దకు చేరుకొని మోసపోయిన లబ్ధిదారుల నుండి వివరాలను అప్పలనాయుడు అడిగి సేకరించ్చారు.విచారణ చేస్తున్న సంబంధిత ఈ ఈ గారి వద్ద ప్రస్తావించగా ఇప్పటికీ 15 మంది వరకు విచారణ చేశామని పూర్తి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.దీనిపైఅప్పలనాయుడు మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి సంభిందిత హౌసింగ్ ఉద్యోగపై చర్యలు చేపట్టాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.1
- ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.1
- *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.1