logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వినతులు పరిష్కారంలో ఆలసత్యం వహిస్తే సహించేది లేదు పత్రికా ప్రకటన - పి.జి.ఆర్.ఎస్., రెవెన్యు క్లినిక్కు , విశేష స్పందన - 190 వినతుల స్వీకరణ – రెవెన్యుకు సంబంధించిన 108 వినతులు - రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి -రెవెన్యు వినతుల పరిష్కారంపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు -జిల్లా కలక్టరు ఎస్ రాం సుందరరెడ్డి - విజయనగరం, మార్చి, 09: సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) మరియు 'రెవెన్యూ క్లినిక్' కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్కలపై వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేసారు. రెవెన్యూ వినతులపై ఫోకస్: అందిన మొత్తం 190 వినతుల్లో అత్యధికంగా 108 రెవెన్యూ శాఖవే ఉన్నాయి. పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, వినతులు పరిష్కారంలో ఆలసత్యం వహిస్తే సహించేది లేదని అధికారులను జిల్లా కలక్టరు ఎస్ రాం సుందరరెడ్డి ఆదేశించారు. వినతులపై సత్వర చర్యలు చేపట్టాలని, రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన వినతులు: రెవెన్యూ: 108, డిఆర్డిఎ-25, పంచాయతీ రాజ్: 18, మున్సిపల్-5 విద్యుత్ శాఖ-1, హౌసింగు-1, డిఎం హెచ్ఒ-8, గ్రామ సచివాలయ శాఖ-5, విద్య శాఖ-3, ఇతర శాఖలు-16 వినతులు వచ్చాయి. పి.జి.ఆర్.ఎస్. పై డిజిటల్ పర్యవేక్షణ: 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వారం పి.జి.ఆర్.ఎస్ పురోగతిపై స్వయంగా సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారును కలిసి, మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్ట్ లో నమోదు చేయాలన్నారు. పిజిఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ 1100 పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ నెంబర్ కు అందిన కాల్స్ కు కూడా సంబంధిత అధికారి సమాధానం సరైన రీతిలో అందజేయవలసి ఉంటుందన్నారు. ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను తగు చర్యలు, సత్వర పరిష్కారానిని తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసారు. జిల్లా కలక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి, జిల్లా జాయింటు కలక్టరు సెతు మాధవన్ రెవెన్యూకి సంబంధించిన వినతులు, అంశాలపై ప్రత్య్గేక దృష్టి పెట్టి ప్రజలు, రైతుల వినతులపై ఆరాతీసి వెను వెంటనే పరిష్కరిస్తున్నందున ప్రజలు ,రైతుల నుండి విశేష స్పందన లభిస్తున్నది. రెవెన్యు వినతులను సత్వరం పరిష్కారిస్తున్నందున ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు ఇ.మురళి, డి.వెంకటేశ్వర రావు, రాజేశ్వరి, బి. శాంతి, కళావతి, సి.పి.ఒ. బాలజి, విజయనగరం, చీపురుపలి, బొబ్బిలి ఆర్.డి.ఓ లు, జిల్లా సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, డిఆర్ డిఎ పిడి శ్రీనివాస్ పాణి, డ్వామా పిడి ఎస్. శారదదేవి, డి.పి.ఒ., హౌసింగు పిడి మురళీధర్, డి.ఇ.ఒ., మైక్రో ఇరిగెషను పిడి లక్ష్మీనారాయణ, జెడ్పీ సిఇఒ సత్యనారాయణ, మార్క్ పెడ్ మేనేజరు డి.వెంకటేశ్వరరావు, డి.ఎం.హెచ్.ఒ. డా.జీవనరాణి, కలక్టరేటు పరిపాలనాధికారి దేవి ప్రసాద్, జిల్లా పరిషత్ సిఇఒ బి.వి.సత్యనారాయణ, జిల్లా అధికారులు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

17 hrs ago
user_Journalist Naidu
Journalist Naidu
Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు
ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।
    1
    चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    20 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    23 hrs ago
  • శ్రీకాకుళం మార్చి 9. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిష్ట అనంతరం భక్తులు స్వామివారి దర్శనార్థమై పోటెత్తారు. భక్తులందరూ ప్రతిష్ట అయిన స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు అనంతరం స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి మహా ప్రవచన కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
    2
    శ్రీకాకుళం మార్చి 9. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిష్ట అనంతరం భక్తులు స్వామివారి దర్శనార్థమై పోటెత్తారు. భక్తులందరూ ప్రతిష్ట అయిన స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు అనంతరం స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి మహా ప్రవచన కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • భారతదేశం గర్వించదగ్గ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అని ఆయనపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.వరల్డ్ ఎకానమీ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న కేంద్రమంత్రి జిల్లాకు గర్వకారణం అని అన్నారు. జిల్లాకు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
    1
    భారతదేశం గర్వించదగ్గ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అని ఆయనపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. 
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం
తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.వరల్డ్ ఎకానమీ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న కేంద్రమంత్రి జిల్లాకు గర్వకారణం అని అన్నారు. జిల్లాకు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అడ్డతీగల రేంజ్ పరిధిలోని పరింతడక గ్రామం సమీపంలో గేదె దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి సమీపంలో కట్టేసి ఉంచిన దూడపై సోమవారం తెల్లవారుజామున పులి దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయంతో వణుకుతున్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    1
    అడ్డతీగల రేంజ్ పరిధిలోని పరింతడక గ్రామం సమీపంలో గేదె దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి సమీపంలో కట్టేసి ఉంచిన దూడపై సోమవారం తెల్లవారుజామున పులి దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు.
ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయంతో వణుకుతున్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.