*ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్న మంత్రి నారా లోకేష్* *బత్తలపల్లిలో ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్* *ఆర్కే ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశ ఏర్పాట్లు పరిశీలన* *ధర్మవరం పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం* ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ ను ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సందర్శించనున్నారు. ఈనెల 14, 15తేదీల్లో మంత్రి లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా 14వ తేదిన బత్తలపల్లికి చేరుకుని.. అక్కడ ఆర్డీటీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి లోకేష్ టీంతో కలిసి ధర్మవరం టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. ఘాట్ ను పరిశీలించిన అనంతరం ఆర్డీటీ ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులతో మాట్లాడారు. ఇటీవల ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ చేయించడంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా శ్రీరామ్ గుర్తు చేశారు. లక్షల మందికి సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థ విషయంలో మొదటి నుంచి మంత్రి లోకేష్ సానుకూలంగా ఉన్నారని.. ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కోసం ఆయన చాలా కృషి చేశారన్నారు. అందుకే జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ముందు ఫాదర్ ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను కూడా పరిశీలిస్తారని చెప్పారు. మరోవైపు బత్తలపల్లికి మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో భారీ స్వాగతం పలికే విధంగా శ్రీరామ్ ప్రణాళిక చేస్తున్నారు. ఆర్.కే. ఫంక్షన్ హాల్లో ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ధర్మవరంలోని పార్టీ కార్యాలయంలో ధర్మవరం పట్టణ, రూరల్ మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర వాటిపై చర్చించారు. బత్తలపల్లిలో మంత్రి లోకేష్ కు భారీ స్వాగతం పలికేందుకు శ్రేణులంతా తరలిరావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనను విజయవంతం చేద్దామని నాయకులు, కార్యకర్తలకు సూచించారు..
*ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్న మంత్రి నారా లోకేష్* *బత్తలపల్లిలో ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్* *ఆర్కే ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశ ఏర్పాట్లు పరిశీలన* *ధర్మవరం పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం* ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ ను ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సందర్శించనున్నారు. ఈనెల 14, 15తేదీల్లో మంత్రి లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా 14వ తేదిన బత్తలపల్లికి చేరుకుని.. అక్కడ
ఆర్డీటీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి లోకేష్ టీంతో కలిసి ధర్మవరం టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. ఘాట్ ను పరిశీలించిన అనంతరం ఆర్డీటీ ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులతో మాట్లాడారు. ఇటీవల ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ చేయించడంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా శ్రీరామ్ గుర్తు చేశారు. లక్షల మందికి సేవా
కార్యక్రమాలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థ విషయంలో మొదటి నుంచి మంత్రి లోకేష్ సానుకూలంగా ఉన్నారని.. ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కోసం ఆయన చాలా కృషి చేశారన్నారు. అందుకే జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ముందు ఫాదర్ ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను కూడా పరిశీలిస్తారని చెప్పారు. మరోవైపు బత్తలపల్లికి మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో భారీ స్వాగతం పలికే విధంగా శ్రీరామ్ ప్రణాళిక చేస్తున్నారు.
ఆర్.కే. ఫంక్షన్ హాల్లో ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ధర్మవరంలోని పార్టీ కార్యాలయంలో ధర్మవరం పట్టణ, రూరల్ మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర వాటిపై చర్చించారు. బత్తలపల్లిలో మంత్రి లోకేష్ కు భారీ స్వాగతం పలికేందుకు శ్రేణులంతా తరలిరావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనను విజయవంతం చేద్దామని నాయకులు, కార్యకర్తలకు సూచించారు..
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేసిన కార్మికులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది సత్య సాయి కార్మికులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు హెచ్ చెలిమప్ప మల్లెపల్లి మధు జేఏసీ కార్యకర్తలు వన్నూరు స్వామి మారెన్న వెంకటేశులు, చెన్నప్ప తదితరులు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్1
- బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ శివారులో ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 52 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. గొర్రె పిల్లలను ఓ చెట్టు నీడలో వదిలిన ఎర్రిస్వామి పొలంలోకి వెళ్లారు. ఆ సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి చంపడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.1