logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లాలో మద్యం మత్తులో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ... ప్రాణాలు కోల్పోయిన కొడుకు... పోలీసులకు లొంగిపోయిన తండ్రీ కరీంనగర్ జిల్లాలో మద్యం మత్తులో తండ్రీ చేతిలో కొడుకు హత్యకు గురయ్యాడు. మానకొండూర్ మండలం కేంద్రంలో నివాసం ఉండే పురం కనకయ్య కు నలుగురు కొడుకులు. ఇంకా పెళ్ళి కాని చిన్న కొడుకు శ్రీనివాస్ తో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రీ కొడుకులు ఘర్షణ పడగా తండ్రీ బండ రాయితో కొడుకుపై దాడి చేయడంతో కొడుకు శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పోలీసుల ఎదుట తండ్రీ కనకయ్య లొంగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తాగిన మైకంలో కొడుకు తండ్రీతో గొడవ పడడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

5 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
5 hrs ago
d528481c-af12-44ab-be10-1d3c693ce505

కరీంనగర్ జిల్లాలో మద్యం మత్తులో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ... ప్రాణాలు కోల్పోయిన కొడుకు... పోలీసులకు లొంగిపోయిన తండ్రీ కరీంనగర్ జిల్లాలో మద్యం మత్తులో తండ్రీ చేతిలో కొడుకు హత్యకు గురయ్యాడు. మానకొండూర్ మండలం కేంద్రంలో నివాసం ఉండే పురం కనకయ్య కు నలుగురు కొడుకులు. ఇంకా పెళ్ళి కాని చిన్న కొడుకు శ్రీనివాస్ తో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రీ కొడుకులు ఘర్షణ పడగా తండ్రీ బండ రాయితో కొడుకుపై దాడి చేయడంతో కొడుకు శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పోలీసుల ఎదుట తండ్రీ కనకయ్య లొంగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తాగిన మైకంలో కొడుకు తండ్రీతో గొడవ పడడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    56 min ago
  • తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
    1
    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    2
    తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    9 hrs ago
  • ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    1
    ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు...
రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర...
మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి....
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ....
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు.
కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం.
ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు.
ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు.
ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు.
తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు.
కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ...
తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం.
రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది.
రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము.
తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది.
ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ....
ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది.
తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు.
రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు.
బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్.
దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు
నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    1
    వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి 
సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో  మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి  శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • IIT-JEE మేయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అభినందించారు. రెండో విడత లో ఆల్పోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్పోర్స్ కు చెందిన సిహెచ్.లక్ష్మీ హాసిని 99.94 పర్సంటైల్ తో అగ్రస్థానంలో నిలువగా వి.శ్రేయాస్ రెడ్డి 99.83, కె.ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74, బి.లిఖిత్ సాయి 99.6, ఏ. సత్య వర్ధన్ 99.6. జి.ఆశిష్ రెడ్డి 99.53, ఎన్. రత్న ప్రకాష్ 99.38, బి.శ్రీహాన్ 99.27 యు.అభినవ్ చౌదరి 99.25, ఎల్.ప్రణయ్నీ రెడ్డి 99.13, వి.సుహాని 99.111 సాధించారు. 99 పర్సం టైల్ మరియు ఆపై 12 మంది విద్యార్థులు సాధించారని నరేందర్ రెడ్డి తెలిపారు. 90 పర్సం టైల్ ఆపై 113 మంది విద్యార్థులు సాధించడం విశేషం. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv), NEET మరియు EAMCET లో కూడ మా అల్ఫోర్స్ చిన్నారులు అధ్బుత ర్యాంకులు సాధిస్తారని విశ్వసిస్తున్నామని చెప్పారు. IIT-JEE (MAIN) ఫలితాలలో అద్భుత పర్సంటైల్ సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.
    3
    IIT-JEE మేయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అభినందించారు. రెండో విడత లో ఆల్పోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్పోర్స్ కు చెందిన సిహెచ్.లక్ష్మీ హాసిని 99.94 పర్సంటైల్ తో అగ్రస్థానంలో నిలువగా వి.శ్రేయాస్ రెడ్డి 99.83, కె.ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74, బి.లిఖిత్ సాయి 99.6, ఏ. సత్య వర్ధన్ 99.6. జి.ఆశిష్ రెడ్డి 99.53, ఎన్. రత్న ప్రకాష్ 99.38,  బి.శ్రీహాన్ 99.27 యు.అభినవ్ చౌదరి 99.25, ఎల్.ప్రణయ్నీ రెడ్డి 99.13, వి.సుహాని 99.111 సాధించారు. 99 పర్సం టైల్ మరియు ఆపై 12 మంది విద్యార్థులు సాధించారని నరేందర్ రెడ్డి తెలిపారు. 90 పర్సం టైల్  ఆపై 113 మంది విద్యార్థులు సాధించడం విశేషం.  పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv), NEET మరియు EAMCET లో కూడ మా అల్ఫోర్స్ చిన్నారులు అధ్బుత ర్యాంకులు సాధిస్తారని విశ్వసిస్తున్నామని చెప్పారు. IIT-JEE (MAIN) ఫలితాలలో అద్భుత పర్సంటైల్ సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.