logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

on 17 February
user_Venu Gopal
Venu Gopal
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
on 17 February

మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • ఎండల తీవ్రత పెరగడంతో జన్నారం మండలం నిప్పుల కొలిమిల మారింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జన్నారం మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఇది గత సంవత్సరం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, రోడ్లు జన సంచారం లేక బోసిపోయాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    1
    ఎండల తీవ్రత పెరగడంతో జన్నారం మండలం నిప్పుల కొలిమిల మారింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జన్నారం మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఇది గత సంవత్సరం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, రోడ్లు జన సంచారం లేక బోసిపోయాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    36 min ago
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్ సీని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువపై ఆరా తీశారు.రోజు ఆసుపత్రికి ఎందరు రోగులు వస్తున్నారని, ఎందరు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలుపాలని సూచించారు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్ సీని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువపై ఆరా తీశారు.రోజు ఆసుపత్రికి ఎందరు రోగులు వస్తున్నారని, ఎందరు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలుపాలని సూచించారు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ హెల్పర్ల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సహకార విద్యుత్ సరఫరా సంఘం కార్యాలయం ముందు, 72 గంటలపాటు విద్యుత్ పనులను బహిష్కరించిన అసిస్టెంట్ హెల్పర్లు, తమ డిమాండ్ల సాధన కోసం సామూహిక దీక్ష కొనసాగిస్తున్నారు. సమ్మె స్థలంలోనే నిద్రించి, ఆవేదనతో మద్దతు కోరుతూ తాము సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంగా ప్రకటించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ హెల్పర్ల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సహకార విద్యుత్ సరఫరా సంఘం కార్యాలయం ముందు, 72 గంటలపాటు విద్యుత్ పనులను బహిష్కరించిన అసిస్టెంట్ హెల్పర్లు, తమ డిమాండ్ల సాధన కోసం సామూహిక దీక్ష కొనసాగిస్తున్నారు. సమ్మె స్థలంలోనే నిద్రించి, ఆవేదనతో మద్దతు కోరుతూ తాము సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంగా ప్రకటించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • స్థానిక మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని... రసూల్ పల్లి నుండి ఇందారం వెళ్ళే దారిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు.. ఇబ్బంది పడుతున్న రైతులు.. ఆ దారి లో కొన్ని వెంచర్లు ఉండడం తో వాటికి సంబంధించి స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులకు కమిషన్లు వెంచర్ నిర్వాహకులు ఇవ్వలేదనే కోపంతో ఈ చర్యకు పాల్పడ్డట్టు సమాచారం..
    1
    స్థానిక మంచిర్యాల జిల్లా  జైపూర్ మండలంలోని...  రసూల్ పల్లి నుండి ఇందారం వెళ్ళే దారిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు..  ఇబ్బంది పడుతున్న రైతులు..  ఆ దారి లో కొన్ని వెంచర్లు ఉండడం తో వాటికి సంబంధించి స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులకు కమిషన్లు వెంచర్ నిర్వాహకులు ఇవ్వలేదనే కోపంతో ఈ చర్యకు పాల్పడ్డట్టు సమాచారం..
    user_RAJESH KUMAR (GODsSON)
    RAJESH KUMAR (GODsSON)
    Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లా చిగురుపామిడి మండలం రామంచ గ్రామ అభివృద్ధికి పునాది రాయి పడింది. గ్రామపంచాయతీ నూతన భవనంతో పాటు రెండు వివో కార్యాలయాలకు సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు అధికారులు భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, మండల అధికారి ఖాజామొయినోద్దిన్, ముదిమాణిక్యం సర్పంచ్ బోయిని రమేష్, బిఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, ఏఈ నిరంజన్ రెడ్డి ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీలక్ష్మి, స్థానిక నాయకులు సంపత్ రెడ్డి, తిరుపతి, విజేందర్ రెడ్డి, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన పంచాయతీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయిస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం రెండు వివో భవనాలకు శంకుస్థాపన చేశామని మూడో భావనాన్ని అంటకాలపల్లెలో త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రైమరీ స్కూల్ లో అదనంగా రెండు గదులు, గ్రామపంచాయతీ నుంచి నర్సింహులపల్లి మీదుగా సీతారాంపూర్ వరకు రోడ్డు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. రెండు పల్లెలు, గ్రామానికి అనుకూలంగా ఉండేలా బడి వద్ద పంచాయతీ భవన నిర్మించడం అభినందనీయమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సూచించారు.
    2
    కరీంనగర్ జిల్లా చిగురుపామిడి మండలం రామంచ గ్రామ అభివృద్ధికి పునాది రాయి పడింది. గ్రామపంచాయతీ నూతన భవనంతో పాటు రెండు వివో కార్యాలయాలకు సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు అధికారులు భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, మండల అధికారి ఖాజామొయినోద్దిన్, ముదిమాణిక్యం సర్పంచ్ బోయిని రమేష్, బిఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, ఏఈ నిరంజన్ రెడ్డి ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీలక్ష్మి, స్థానిక నాయకులు సంపత్ రెడ్డి, తిరుపతి, విజేందర్ రెడ్డి, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన పంచాయతీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయిస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం రెండు వివో భవనాలకు శంకుస్థాపన చేశామని మూడో భావనాన్ని అంటకాలపల్లెలో త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. 
ప్రైమరీ స్కూల్ లో అదనంగా రెండు గదులు, గ్రామపంచాయతీ నుంచి నర్సింహులపల్లి మీదుగా సీతారాంపూర్ వరకు రోడ్డు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. రెండు పల్లెలు, గ్రామానికి అనుకూలంగా ఉండేలా బడి వద్ద పంచాయతీ భవన నిర్మించడం అభినందనీయమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • सिरपुर टाउन:* सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने आज कम्युनिटी हॉस्पिटल में एक टीनएज लड़की को वैक्सीन लगाई, जो भारत सरकार के HPV वैक्सीनेशन प्रोग्राम के हाल ही में लॉन्च होने का प्रतीक है। *इस मौके पर बोलते हुए, उन्होंने कहा कि 14-15 साल की टीनएज लड़कियों को HPV वैक्सीनेशन ज़रूर लगवाना चाहिए, ताकि वे सर्वाइकल कैंसर से बच सकें।* उन्होंने कहा कि वे कम्युनिटी हॉस्पिटल जाएंगे और वहां की समस्याओं को हल करेंगे। *उन्होंने कहा कि सिरपुर कम्युनिटी हॉस्पिटल में मेडिकल सर्विस बेहतर हुई हैं और लोगों को और भी सर्विस मिलेंगी। उन्होंने कहा कि उन्होंने सिरपुर कम्युनिटी हॉस्पिटल के लिए एक कंप्यूटराइज़्ड एक्स-रे मशीन मंज़ूर कर दी है और अप्रैल के पहले हफ़्ते में नई एक्स-रे मशीन के उद्घाटन के लिए वापस आएंगे।* सिरपुर टाउन के सरपंच ओद्देती नागमणि, DCHS डॉ. अविनाश, डॉ. जोगेंद्र, डॉ. अनुषा, नरसन्ना, हॉस्पिटल स्टाफ़, पंचायत सेक्रेटरी तिरुपति, सरपंच चणकपुरे लावण्या, डिप्टी सरपंच दुर्गम प्रशांत, दिवाकर, नेता नेरेला अशोक, राचरला महेश यादव, एलमुले शंकर, मारुति, विलास, श्याम राव, राजशेखर, संतोष, शेखर, रंगन्ना, बाबू, विश्वनाथ और दूसरे लोग इस प्रोग्राम में शामिल हुए।
    1
    सिरपुर टाउन:* सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने आज कम्युनिटी हॉस्पिटल में एक टीनएज लड़की को वैक्सीन लगाई, जो भारत सरकार के HPV वैक्सीनेशन प्रोग्राम के हाल ही में लॉन्च होने का प्रतीक है।
*इस मौके पर बोलते हुए, उन्होंने कहा कि 14-15 साल की टीनएज लड़कियों को HPV वैक्सीनेशन ज़रूर लगवाना चाहिए, ताकि वे सर्वाइकल कैंसर से बच सकें।*
उन्होंने कहा कि वे कम्युनिटी हॉस्पिटल जाएंगे और वहां की समस्याओं को हल करेंगे।
*उन्होंने कहा कि सिरपुर कम्युनिटी हॉस्पिटल में मेडिकल सर्विस बेहतर हुई हैं और लोगों को और भी सर्विस मिलेंगी। उन्होंने कहा कि उन्होंने सिरपुर कम्युनिटी हॉस्पिटल के लिए एक कंप्यूटराइज़्ड एक्स-रे मशीन मंज़ूर कर दी है और अप्रैल के पहले हफ़्ते में नई एक्स-रे मशीन के उद्घाटन के लिए वापस आएंगे।*
सिरपुर टाउन के सरपंच ओद्देती नागमणि, DCHS डॉ. अविनाश, डॉ. जोगेंद्र, डॉ. अनुषा, नरसन्ना, हॉस्पिटल स्टाफ़, पंचायत सेक्रेटरी तिरुपति, सरपंच चणकपुरे लावण्या, डिप्टी सरपंच दुर्गम प्रशांत, दिवाकर, नेता नेरेला अशोक, राचरला महेश यादव, एलमुले शंकर, मारुति, विलास, श्याम राव, राजशेखर, संतोष, शेखर, रंगन्ना, बाबू, विश्वनाथ और दूसरे लोग इस प्रोग्राम में शामिल हुए।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    3 hrs ago
  • ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    2
    ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న  బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా  మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.
బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో  శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం  పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. 
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన  కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో  హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    17 hrs ago
  • జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    1
    జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.