logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లారెడ్డి మండలం : బీసీ హాస్టల్ లో బాలిక మృతి పై ధర్నా, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కుటుంబ సభ్యులు అరెస్ట్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.

3 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
3 hrs ago

ఎల్లారెడ్డి మండలం : బీసీ హాస్టల్ లో బాలిక మృతి పై ధర్నా, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కుటుంబ సభ్యులు అరెస్ట్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
    1
    కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్.
ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • Indiramma Indlu Meeting Protocol Issue :స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు, జిల్లా సర్పంచుల పోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మధ్యల ప్రోటోకాల్ పై రగడ జరిగింది. బుధవారం నాడు కౌడిపల్లి రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన ఇందిరమైండ్ల పత్రాల పంపిణీ సమావేశానికి స్థానిక ఎంపీడీవో అధ్యక్షత వహిస్తూ జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ని వేదిక నల్లంకరించాలని ప్రసంగించగానే బి ఆర్ ఎస్ నాయకులు మిగతా సర్పంచ్ వేదిక పైకి పిలవాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సర్పంచ్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు స్థానిక సర్పంచికి సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ప్రభుత్వ కర్యక్రమాలు ఎలానిర్వహిస్తారని కృష్ణా గౌడ్ మండిపాటు. ఒక్కసారిగా వేడెక్కిన సమావేశం. ఇరు వర్గాల వాదనలతో సభ ప్రాంగణం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేసింది.ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి,సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించగా నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు. దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రస బసాగా మారింది.స్థానిక సర్పంచికి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు ఇరు వర్గాల వాదనలతో రైతు వేదిక దద్దరిల్లింది స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువురిని శాంతింప చేసింది ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ డిఎల్ పి ఓ సాయి బాబా హౌసింగ్ డిఇ ప్రభు ఏఈ అభిషేక్ ఎస్సై అమర్ ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
    4
    Indiramma Indlu Meeting Protocol Issue :స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు, జిల్లా సర్పంచుల పోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మధ్యల ప్రోటోకాల్ పై రగడ జరిగింది. బుధవారం నాడు కౌడిపల్లి రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన ఇందిరమైండ్ల పత్రాల పంపిణీ సమావేశానికి స్థానిక ఎంపీడీవో అధ్యక్షత వహిస్తూ జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ని వేదిక నల్లంకరించాలని ప్రసంగించగానే బి ఆర్ ఎస్ నాయకులు మిగతా సర్పంచ్ వేదిక పైకి పిలవాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
సర్పంచ్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు
స్థానిక సర్పంచికి సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ప్రభుత్వ కర్యక్రమాలు ఎలానిర్వహిస్తారని కృష్ణా గౌడ్ మండిపాటు. ఒక్కసారిగా వేడెక్కిన సమావేశం. ఇరు వర్గాల వాదనలతో సభ ప్రాంగణం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేసింది.ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి,సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించగా నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు.
దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రస బసాగా మారింది.స్థానిక సర్పంచికి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు ఇరు వర్గాల వాదనలతో రైతు వేదిక దద్దరిల్లింది స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువురిని శాంతింప చేసింది ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచించారు.
ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ డిఎల్ పి ఓ సాయి బాబా హౌసింగ్ డిఇ ప్రభు ఏఈ అభిషేక్ ఎస్సై అమర్ ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    14 min ago
  • స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.
    3
    స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.
జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్  మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ​బాబాపూర్ గ్రామంలో భానుడి భగభగలకు కేవలం మనుషులే కాదు అడవిలోని మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో అల్లాడిపోతున్న జీవాలు చల్లదనం కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. ​గ్రామానికి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పెద్ద చెట్టు ఉంది. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక కోతి ఆ చెట్టు నీడకు వచ్చింది. అక్కడ చెట్టుకు కట్టిన ఊయలను చూసిన వానరం ఏమాత్రం తడబడకుండా అందులోకి దూరింది. కాసేపు హాయిగా ఊగుతూ అలసటను మర్చిపోయి ఆటలాడింది. ​పెరుగుతున్న ఎండలకు మూగజీవాలు పడుతున్న అవస్థలు ఒకవైపు ఆవేదన కలిగిస్తుంటే మరోవైపు ఈ కోతి చేసిన పని ప్రకృతి ప్రేమికులను ఆలోచింపజేస్తోంది. మండుతున్న వేసవిలో పక్షులు జంతువుల కోసం నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ​బాబాపూర్ గ్రామంలో భానుడి భగభగలకు కేవలం మనుషులే కాదు అడవిలోని మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి. 
ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో అల్లాడిపోతున్న జీవాలు చల్లదనం కోసం నానా తంటాలు పడుతున్నాయి. 
ఈ క్రమంలో బాబాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.
​గ్రామానికి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పెద్ద చెట్టు ఉంది. 
ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక కోతి ఆ చెట్టు నీడకు వచ్చింది. 
అక్కడ చెట్టుకు కట్టిన ఊయలను చూసిన వానరం ఏమాత్రం తడబడకుండా అందులోకి దూరింది. 
కాసేపు హాయిగా ఊగుతూ అలసటను మర్చిపోయి ఆటలాడింది.
​పెరుగుతున్న ఎండలకు మూగజీవాలు పడుతున్న అవస్థలు ఒకవైపు ఆవేదన కలిగిస్తుంటే మరోవైపు ఈ కోతి చేసిన పని ప్రకృతి ప్రేమికులను ఆలోచింపజేస్తోంది. 
మండుతున్న వేసవిలో పక్షులు జంతువుల కోసం నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం  పోస్టర్ ను  లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను  ఏడు గ్రామాల  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.
    user_Kommera Rajureddy Reporter
    Kommera Rajureddy Reporter
    రియల్ ఎస్టేట్ తిమ్మాపూర్ ఎల్‌ఎండి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    12 hrs ago
  • కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.