logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

త్రాగు నీటి సమస్య తీర్చేందుకే బోరు బావి ఏర్పాటు గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్  గణపురం : వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకే బోరు వేస్తున్నట్లు గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పాత తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని నర్సరీ ప్రాంతంలో బోర్ వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన నర్సరీ కోసం బోర్ వేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బోర్ బావిలో సరిపడా నీళ్లు పడ్డాయని ప్రజల అవసరాల కోసం కూడా ఈ నీటిని అందిస్తామని తెలిపారు. వేసవికాలంలో కాలనీవాసులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో బోర్ పాయింట్ వేయించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజేందర్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్. నాయకులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
Farmer Ghanpur (Mulug), Jayashankar Bhupalapally•
2 hrs ago
ec2ddf26-3136-466e-b0de-480ea7cf685b

త్రాగు నీటి సమస్య తీర్చేందుకే బోరు బావి ఏర్పాటు గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్  గణపురం : వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకే బోరు వేస్తున్నట్లు గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పాత తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని నర్సరీ ప్రాంతంలో బోర్ వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన నర్సరీ కోసం బోర్ వేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బోర్ బావిలో సరిపడా నీళ్లు పడ్డాయని ప్రజల అవసరాల కోసం కూడా ఈ నీటిని అందిస్తామని తెలిపారు. వేసవికాలంలో కాలనీవాసులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో బోర్ పాయింట్ వేయించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజేందర్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్. నాయకులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ నగరంలోని మాస్టర్ జి డిగ్రీ & పీజీ కళాశాలలో నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కోటిక్స్ మరియు డ్రగ్స్‌పై ప్రత్యేక అధికారి గిరిధర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    2
    హన్మకొండ నగరంలోని మాస్టర్ జి డిగ్రీ & పీజీ కళాశాలలో నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కోటిక్స్ మరియు డ్రగ్స్‌పై ప్రత్యేక అధికారి గిరిధర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను ఈసారి కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు చెప్పారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అందువల్ల ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత, వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రానికి వచ్చే భక్తులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.
    2
    గోదావరి పుష్కరాలను  ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన  “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను ఈసారి కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు చెప్పారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అందువల్ల ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత, వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రానికి వచ్చే భక్తులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    1
    *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త*
ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది 
ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 day ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉన్న ప్రతిమ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న నాళ్ళెం జంపయ్య అనే వ్యక్తి డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో మరణించారు.గత ఎనిమిదేళ్లుగా ఇదే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న ఆయన, జనవరి 22వ తేదీ రాత్రి విధుల్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు.. అక్కడ డ్యూటీలో సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్న జంపయ్య గుండె పోటు తో చనిపోయిన తర్వాత కంపెనీ వారు ఎటువంటి న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ప్రతిమ కంపెనీ గేటు ఎదుట టెంట్ వేసుకొని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంపయ్య కోడలు సుమలత తెలిపిన వివరాల ప్రకారం, ఆ రోజు రాత్రి ఆయనకు కాళ్లు, చేతులు లాగుతున్నాయని తోటి ఉద్యోగికి చెప్పారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆయన రూమ్‌కు వెళ్తుండగా, తలుపు వద్దే కిందపడిపోయారు. కంపెనీ యాజమాన్యం సరైన సమయంలో స్పందించలేదని, 108 కి ఫోన్ చేయడం లేదా ప్రాథమిక చికిత్స (CPR) వంటివి చేయడంలో విఫలమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జంపయ్య మరణించి నెల రోజులు దాటినా, కంపెనీ యాజమాన్యం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేదని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా కంపెనీ చుట్టూ తిరుగుతున్నా, కాంట్రాక్ట్ వారినే కలవమని చెప్తూ ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేస్తున్నారని వారు మండిపడుతున్నారు. బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం అందించాలి. కుటుంబంలో చదువుకున్న వారు ఉన్నందున, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి.యాజమాన్యం బాధ్యత తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రతిమా కంపెనీ వారు మానవత్వ కోణంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు..అలాగే ఐడీఎస్ సెక్యూరిటీ చెందిన నిర్వాహకులు వాళ్ళ పేరు మీద ఇన్స్యూరెన్స్ కట్టాము.. వాళ్ళకు ఇన్స్యూరెన్స్ ఉందని రెండున్నర లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్పుతున్న పరిస్థితి ఉంది.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉన్న ప్రతిమ కంపెనీలో 
సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న నాళ్ళెం జంపయ్య అనే వ్యక్తి డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో మరణించారు.గత ఎనిమిదేళ్లుగా ఇదే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న ఆయన, జనవరి 22వ తేదీ రాత్రి విధుల్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు..
అక్కడ డ్యూటీలో సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్న జంపయ్య గుండె పోటు తో చనిపోయిన తర్వాత కంపెనీ వారు ఎటువంటి న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ప్రతిమ కంపెనీ గేటు ఎదుట టెంట్ వేసుకొని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జంపయ్య కోడలు సుమలత తెలిపిన వివరాల ప్రకారం, ఆ రోజు రాత్రి ఆయనకు కాళ్లు, చేతులు లాగుతున్నాయని తోటి ఉద్యోగికి చెప్పారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆయన రూమ్‌కు వెళ్తుండగా, తలుపు వద్దే కిందపడిపోయారు. కంపెనీ యాజమాన్యం సరైన సమయంలో స్పందించలేదని, 108 కి ఫోన్ చేయడం లేదా ప్రాథమిక చికిత్స (CPR) వంటివి చేయడంలో విఫలమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జంపయ్య మరణించి నెల రోజులు దాటినా, కంపెనీ యాజమాన్యం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేదని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా కంపెనీ చుట్టూ తిరుగుతున్నా, కాంట్రాక్ట్ వారినే కలవమని చెప్తూ ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం అందించాలి. కుటుంబంలో చదువుకున్న వారు ఉన్నందున, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి.యాజమాన్యం బాధ్యత తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
ప్రతిమా కంపెనీ వారు మానవత్వ కోణంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు..అలాగే ఐడీఎస్ సెక్యూరిటీ చెందిన నిర్వాహకులు వాళ్ళ పేరు మీద ఇన్స్యూరెన్స్ కట్టాము.. వాళ్ళకు ఇన్స్యూరెన్స్ ఉందని రెండున్నర లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్పుతున్న పరిస్థితి ఉంది.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    21 min ago
  • पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।
    1
    पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत
मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।
    user_Ramesh songara
    Ramesh songara
    Chunchupalli, Bhadradri Kothagudem•
    3 hrs ago
  • వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 
స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. 
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • హన్మకొండ:ఎల్కతుర్తి మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యాచరణపై సమీక్ష సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని, స్థానిక మరియు మండల అధికారులతో ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో అధికారులు ప్రస్తుత ప్రణాళిక కింద చేపట్టిన పనుల రిపోర్ట్‌ను వివరించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛత, పౌరసౌకర్యాలు, మరియు ప్రభుత్వ సేవల అందుబాటులో ఉన్నత ప్రమాణాలను నిర్ధారించడంలో ప్రగతి ఏ స్థాయిలో ఉందో గుర్తించబడింది. మంత్రి ప్రభాకర్ సమావేశంలో భాగంగా అధికారులకు సమగ్ర మార్గదర్శక సూచనలు ఇచ్చారు మరియు ఈ కార్యక్రమం పూర్ణవంతంగా అమలు కావడానికి చర్యలను వేగవంతం చేయాలని దృష్టి పెట్టారు. మంత్రి మాట్లాడుతూ, “ప్రజాపాలనలో పారదర్శకత మరియు సమయపాలన ప్రధానమైన అంశాలు. ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా మేము ప్రతీ గ్రామానికి సమగ్రమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం” అని అన్నారు.
    1
    హన్మకొండ:ఎల్కతుర్తి మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యాచరణపై సమీక్ష సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని, స్థానిక మరియు మండల అధికారులతో ప్రగతిని సమీక్షించారు.
సమావేశంలో అధికారులు ప్రస్తుత ప్రణాళిక కింద చేపట్టిన పనుల రిపోర్ట్‌ను వివరించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛత, పౌరసౌకర్యాలు, మరియు ప్రభుత్వ సేవల అందుబాటులో ఉన్నత ప్రమాణాలను నిర్ధారించడంలో ప్రగతి ఏ స్థాయిలో ఉందో గుర్తించబడింది. మంత్రి ప్రభాకర్ సమావేశంలో భాగంగా అధికారులకు సమగ్ర మార్గదర్శక సూచనలు ఇచ్చారు మరియు ఈ కార్యక్రమం పూర్ణవంతంగా అమలు కావడానికి చర్యలను వేగవంతం చేయాలని దృష్టి పెట్టారు.
మంత్రి మాట్లాడుతూ, “ప్రజాపాలనలో పారదర్శకత మరియు సమయపాలన ప్రధానమైన అంశాలు. ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా మేము ప్రతీ గ్రామానికి సమగ్రమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం” అని అన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రాష్టంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశ పెట్టిన తరువాత ఇప్పటి వరకు మూడు వందల కోట్ల మంది మహిళలు ఉచితం గా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని తద్వారా ఆర్టీసీకి పది వేల కోట్ల లాభం చేకూరిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రమిశ్రా పాల్గొన్నారు. నూతనంగా మున్సిపల్ పాలక వర్గం బాధ్యతలు చేపట్టడంతో వారికి శుభాకాంక్షలు తెలిపి హుజూరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలని నూతన పాలకవర్గాన్ని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని తెలిపారు. ప్రజలందరూ పరిసరాలు శుభ్రం గా ఉండే విధం గా చూసుకోవాలని యువత చెడు మార్గం పట్టకుండా చెడు అలవాట్లకు లోనూ కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, సమాజం బాధ్యత వహించాలని కోరారు. యువత ఎదుగుదలకు ప్రధాన కారణం విద్యేనని ఇటీవల ఒక సర్వేలో తేలిందని అందుకే పిల్లలను ప్రతి ఒక్కరు చదివించాలని కోరారు. రాబోయే రోజుల్లో స్థానిక శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడి సహకారం తో హుజూరాబాద్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    రాష్టంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశ పెట్టిన తరువాత ఇప్పటి వరకు మూడు వందల కోట్ల మంది మహిళలు ఉచితం గా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని తద్వారా ఆర్టీసీకి పది వేల కోట్ల లాభం చేకూరిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రమిశ్రా పాల్గొన్నారు. నూతనంగా మున్సిపల్ పాలక వర్గం బాధ్యతలు చేపట్టడంతో వారికి శుభాకాంక్షలు తెలిపి హుజూరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలని నూతన పాలకవర్గాన్ని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని తెలిపారు. ప్రజలందరూ పరిసరాలు శుభ్రం గా ఉండే విధం గా చూసుకోవాలని యువత చెడు మార్గం పట్టకుండా చెడు అలవాట్లకు లోనూ కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, సమాజం బాధ్యత వహించాలని కోరారు. యువత ఎదుగుదలకు ప్రధాన కారణం విద్యేనని ఇటీవల ఒక సర్వేలో తేలిందని అందుకే పిల్లలను ప్రతి ఒక్కరు చదివించాలని కోరారు. రాబోయే రోజుల్లో స్థానిక శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడి సహకారం తో హుజూరాబాద్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.