logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.

1 hr ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
1 hr ago

వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.

More news from తెలంగాణ and nearby areas
  • హనుమాన్ జయంతి సందర్భంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక వేసవి సౌకర్యాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ ఫ్యాన్లు, క్యూలైన్లలో జంబో కూలర్లు, అదనపు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు, చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ రాజరాజేశ్వర జల ప్రసాదం ఆధ్వర్యంలో సేవా వాలంటీర్ల సహకారంతో చల్లని తాగునీటి పంపిణీ నిర్వహిస్తున్నారు. కూల్ బబుల్స్ ద్వారా నిరంతరం భక్తులకు తాగునీరు అందుబాటు లో ఉంచుతున్నారు. మహా మండపంలో ఎయిర్ కండిషనర్లు (ఏసీ లు), ఫ్యాన్లు ఏర్పాటు చేయగా, మూల విరాట్టు దర్శన మార్గాల్లో జంబో కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు చల్లని వాతావరణం కల్పిస్తున్నారు. అదే విధంగా భక్తులకు ప్రసాదాల పంపిణీ, దర్శన ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు,జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, ఆదేశాల మేరకు ఆలయ ఈవో రమాదేవి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
    2
    హనుమాన్ జయంతి సందర్భంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక వేసవి సౌకర్యాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ ఫ్యాన్లు, క్యూలైన్లలో జంబో కూలర్లు, అదనపు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు, చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ రాజరాజేశ్వర జల ప్రసాదం ఆధ్వర్యంలో సేవా వాలంటీర్ల సహకారంతో చల్లని తాగునీటి పంపిణీ నిర్వహిస్తున్నారు. కూల్ బబుల్స్ ద్వారా నిరంతరం భక్తులకు తాగునీరు అందుబాటు లో ఉంచుతున్నారు. మహా మండపంలో ఎయిర్ కండిషనర్లు  (ఏసీ లు), ఫ్యాన్లు ఏర్పాటు చేయగా, మూల విరాట్టు దర్శన మార్గాల్లో జంబో కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు చల్లని వాతావరణం కల్పిస్తున్నారు. అదే విధంగా భక్తులకు ప్రసాదాల పంపిణీ, దర్శన ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ  శైలజ రామయ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు,జిల్లా కలెక్టర్ గరీమ  అగర్వాల్, ఆదేశాల మేరకు ఆలయ ఈవో రమాదేవి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 min ago
  • కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది. *బండి సంజయ్ తప్పు చేశాడు..* *జయం న్యూస్ మీడియా యూట్యూబ్* *కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది..* కుట్ర చేస్తున్నారు అని అనడం కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా అనేది మీరు నిరూపించుకోవాలి కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఎదో కుట్ర చేస్తున్నారు అంటున్నారు కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే వేరే పార్టీ నాయకుడు అని మీ పట్ల వివక్ష ఉండదు, అదేవిదంగా కేంద్ర మంత్రి అని విచారణ పక్క దారి పట్టే అవకాశం లేదు – మంత్రి పొన్నం ప్రభాకర్
    1
    కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది.
*బండి సంజయ్ తప్పు చేశాడు..*
*జయం న్యూస్ మీడియా యూట్యూబ్*
*కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది..*
కుట్ర చేస్తున్నారు అని అనడం కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా అనేది మీరు నిరూపించుకోవాలి 
కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఎదో కుట్ర చేస్తున్నారు అంటున్నారు కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే 
వేరే పార్టీ నాయకుడు అని మీ పట్ల వివక్ష ఉండదు, అదేవిదంగా కేంద్ర మంత్రి అని విచారణ పక్క దారి పట్టే అవకాశం లేదు 
– మంత్రి పొన్నం ప్రభాకర్
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer ఎల్లందకుంట, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం... గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డైరీ ఫామ్ చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం...
గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  డైరీ ఫామ్  చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు  నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
    5
    విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం
మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి* *బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి.* ⁠*పోలీస్ స్టేషన్ లో సామాన్యులకు న్యాయం జరగడం లేదు.* . AIFB బండారి శేఖర్ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని ప్లే కార్డులతో మంచిర్యాల చౌరస్థలో నిరసన చేయడం జరిగింది. - బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం ధనవంతులకు, ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీస్ వ్వవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందని ఏద్ధవ చేశారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ్‌పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా హోంశాఖ, డీజీపీ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు., తక్షణమే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలనీ అన్నారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబంపైనే కరీంనగర్‌లో అక్రమంగా కేసులు బాణయించి వేదించడం అన్యాయమని అన్నారు. నిందితుడి వేధింపులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ, అధికార బలంతో కేసును ఉపసంహరించుకోవాలంటూ బాధితులను బెదిరించడం జరుగుతుందని, కేసును కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి కనపడుతున్నదని అన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ, బాలిక కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.బాలిక కుటుంబనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్రినేత, అరుణ్ , కల, లత, అరుణ, శారదా శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు
    2
    అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి*
*బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి.*
⁠*పోలీస్ స్టేషన్ లో సామాన్యులకు న్యాయం జరగడం లేదు.*
.
AIFB బండారి శేఖర్ 
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని ప్లే కార్డులతో మంచిర్యాల చౌరస్థలో నిరసన చేయడం జరిగింది.  
- బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం ధనవంతులకు, ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీస్ వ్వవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందని ఏద్ధవ చేశారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
భగీరథ్‌పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా హోంశాఖ, డీజీపీ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు., తక్షణమే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలనీ అన్నారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబంపైనే కరీంనగర్‌లో అక్రమంగా కేసులు బాణయించి వేదించడం అన్యాయమని అన్నారు. నిందితుడి వేధింపులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాలిక  రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుందని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ, అధికార బలంతో కేసును ఉపసంహరించుకోవాలంటూ బాధితులను బెదిరించడం జరుగుతుందని, కేసును కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి కనపడుతున్నదని అన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ, బాలిక కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.బాలిక కుటుంబనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్రినేత, అరుణ్ , కల, లత, అరుణ, శారదా శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    40 min ago
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు
    1
    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి

17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ?

రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి

కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
   కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై
 పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్  ను మంత్రి వర్గం నుండి భర్తరప్  చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు   కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు
  
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది
 ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ
 బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం  ఎందుకని,
 పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా  విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్  బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి  మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు  నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్
తదితరులు పాల్గొన్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి
17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ?
రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి
కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై
పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్  ను మంత్రి వర్గం నుండి భర్తరప్  చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు   కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది
ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ
బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం  ఎందుకని,
పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా  విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్  బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి  మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు  నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్
తదితరులు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    1
    మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి
మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.
    1
    వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని  దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.